11.5 C
New York
Sunday, November 24, 2024

కర్మ యోగి, ధర్మ మూర్తి

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక

చాలామంది భగవద్గీత చదువుతారు. చాలా కొద్ది మంది అందులోని సారాన్ని ఆకళింపు చేసుకుంటారు. అతి కొద్దిమంది గీతలో స్తుతించిన వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకుంటారు. అలాంటి నరులలో అరుదైన సింహం, నరసింహారావు. ఎత్తు అయిదు అడుగుల మూడంగుళాలు; వ్యక్తిత్వం హిమవత్‌ శిఖరం; సంఘంలో ఉంటూనే నిస్సంగత్వమ్‌; తన సమాజ శ్రేయస్సుకు పనిచేస్తూనే ఏకాకి జీవితం. తామరాకు మీద నీటిబొట్టులాంటి తాత్వికత. కలుషిత చెరువునే సంస్కరించాలనే ఆలోచనా తపస్వి” నింద, స్తుతి పంకాలంటని అనింద్యానంద మూర్తి. భూకామందైనా భూమి వితరణ సౌభాగ్యశీలి. ఇన్ని చెప్పాక, ఇంత చెప్పాక నేను రాస్తున్న వారి గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. నవ భారత అర్థశాస్త్ర కోవిదుడు, భారత నవశక నిర్మాత, నరసింహారావు. పాములపర్తి నరసింహారావు.

“కర్మ నిర్వాహణాయ సంభవామి యుగే యుగే” అన్నట్లు భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వానప్ర ప్రస్థంలో ఉన్న రావుగారు ఆయన నమ్మిన, ఆయన జీవితాంతం సేవ చేసిన పార్టీ అభ్యర్థన మేరకు ప్రధాని పదవిని చేపట్టారు. పైరవీలు లేవు, కుల సమీకరణ అర్హతలు లేవు. వర్గ, వర్ణ సమీకరణ అర్హతలూ లేవు. ఎలాంటి ఆశ గాని, వాంఛ గాని లేని, కరుడుగట్టిన కాంగ్రెస్‌ పార్ట్‌ విధేయుడు అన్న అర్హత ప్రాతిపదికన నివురుగప్పిన ప్రతిభాగ్ని! కి ప్రధాని పదవి వరించింది. అండరికీ ఆమోద యోగ్యుడు, “అణిగి మణిగి ఉండే మనిషి” అనే ముద్రబిళ్ళ సాయంతో ఒక ‘ రాజకీయ సన్యాసి” భారత ప్రధాని అయ్యాక అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ పెద్ద మార్పులు వస్తాయని ఎవరూ నమ్మలేదు, ఊహించలేదు. అందరూ నరసింహారావును ఒక “ఆపద్ధర్మ కీలుబొమ్మ” గా ఉంటారని ఊహించారు. హస్తినారణ్యంలో
పాములపర్తి సింహం దేశ రక్షణార్ధం జూలు విదిలించి, కార్యరంగంలోకి దూకి, ఆర్థిక సంస్కరణలు, రాజకీయ సంక్షోభాలు, విశ్వాస రాహిత్యాలు,

అవిశ్వాస తీర్మానాలు, అసమ్మతి సెగలూ, అంతర్గత బడబాగ్నిలూ, నిరసనలూ, నిర్లక్ష్యాలు, ఉపేక్షలూ… ఇలా అన్నింటినీ అధిగమించి భారత ధర్మాకృతిని చాటిన కర్మయోగి, భారత సింహం, నరసింహారావు. పి.వి. తరవాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయన వేసిన బలమైన పునాది మీద నడుస్తున్నాయనడం అతిశయోక్తి కాదు.

రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అవసరాలు, దేశ అవసరాల ప్రాతిపదికన పి.వి. ప్రధాని అవడం “అందరికీ తెలుసు. పి.వి. ప్రధానిగా ఉన్న కాలంలో ఎలాంటి వివాదలూ, కుంభకోణాలూ రాలేదు. ఎంత వేగంగా ఆర్థిక సంస్కరణలు జరిగినా ఏ ‘దానీలు” లబ్దిదారులుగా నిందింపబడలేదు. రామజన్మభూమి వివాదం మనిషిని నమ్మిన మంచి మనసున్న మనిషిగా, శ్రీరామ భక్తుడిలా పి. వి. భరించిన అపవాదు మాత్రమే. ఇంకొక వివాదం ఆయనని సుఖంగా మరణించకుండా చేసిన వివాదం అయినా అభియోగాలలో పస లేదని తెలిసినా ప్రతీకార భావంతో కొనసాగిన కేసు. మోసేవాడు లేకపోతే ఎంతగా అలంకరింపబడిన పల్లకి అయినా, అందులో ఎక్కినవాడు ఎంత ఉన్నత వంశ వ్యక్తి అయినా, పల్లకి, ఎక్కిన వాడూ వెలవెల
బోతారు. పి.వికి తనని పొగిడి, మోసి, ప్రచారం చేసే అనుచరగణం లేదు. ఆయన వల్ల లబ్ధి పొందిన వారూ లేరు. పార్టీ యంత్రాంగమూ వెనక లేదు. హస్తినలో తుది శ్వాస విడిచినప్పుడు ఏ ప్రధానికి జరగని అవమానం జరిగింది. “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌” కి ప్రతినిధి అయిన పి.వి. కి ఇటాలియన్‌ కోడలు సంస్కారయుత సంస్కరణ స్థలం కేటాయింపుకి కాలొడ్డిందని వినికిడి,

నెహ్రూ, ఇందిర తర్వాత భారత దేశాన్ని అత్యంత ప్రగతిశీల పథంలో నడిపిన వ్యక్తికి దేశరాజధానిలో సంస్కరణ స్థలం నిరాకరించడం, రాజమర్యాదలతో సాగవలసిన స్వర్గారోహణ పర్వం రాజకీయ కుయుక్తులతో ముగియడం బాధ గానూ, ఆశ్చర్యంగానూ లేదూ!!

తెలుగు వారు దేశ అభివృద్ధికి ఎంత పాటుపడినా, ఎంత తోడ్చృడినా వారికి తగిన ప్రతిఫలం దక్కడం అరుదు. పి.వి. తెలుగు వాడు అవటం తెలుగు వారి అదృష్టం అయితే, ఆయన తెలుగు వారిగా పుట్టడం ఆయనకి పెద్దగా కలిసొచ్చినట్టు లేదు! ఆయన తెలుగు వారి సొత్తు. ప్రాంతీయ తత్వ జ్వాలలని
తట్టుకుని భారతమాత ముద్దు బిడ్డగా నిలబడ్డ పి.వి. తెలుగుబిడ్డ. ఆయన సమైక్యవాది, దేశ సమైక్యాభిలాషి. వట్టిమాటలు కాక గట్టిమేల్‌ తలపెట్టిన గురజాడ స్ఫూర్తి రత్నం పి.వి. ఆయన ప్రధానిగా ఉన్న రోజుల్లో దేశ సమగ్రతకి భంగం కలిగీలా మారుతున్న పంజాబ్‌, కాశ్మీర్‌ రాజకీయ పరిస్థితులని చాకచక్యంగా, ఆర్భాటం లేకుండా పరిష్కరించిన తీరు అనితర సాధ్యం. పి.వి. జీవితం నాయకత్వ లక్షణాలు నేర్పే ఒక పాఠ్య గ్రంధం. ఆర్భాటాలూ, హడావిడీ లేకుండా దేశాన్ని ఎలా నడపాలో చూపిన చతురుడు పి. వ్టి దేశానికి ఇంత
చేసినా ఎవరికీ పట్టిని పి.వి! ఎంత ఆశ్చర్యం!!? జీవితాంతం పనిచేసిన పార్టీకి “అంటరాని” వాడు, ఒక ప్రాంతానికి మాత్రమే” చెందినవాడు అయ్యాడు. 14 అంతర్జాతీయ భాషలని ఆపోసన పట్టిన తెలుగు తేజాన్ని కుత్సిత రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విస్మరించినా, మంచిని గుర్తించి పెంచే మనుషుల
మనసుల్లో పి.వి. వేసిన ముద్ర శాశ్వతం. పి.వి. భరత మాత గర్వపడే జాతి రత్నం. భారత దేశ అభ్యున్నతికి అత్యంత దోహద పడడమే అర్హత అయితే భారత రత్న బిరుదుకి పి.వి.ని మించిన అర్హుడు లేడు. త్వరలో ఆయనకి “భారత రత్న బిరుదు దక్కాలని కోరుకుందాం.

నేను పి.వి.గారి పేరు మొదట విన్నది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో. అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నాను. ఆయన పేరు రాష్ట్రం అంతటా మారు మ్రోగేది. ఆ ఉద్యమ పర్యవసానంగా వెలసిన హైదరాబాదు కేంద్ర విశ్వ విద్యాలయంలో నేను M.Sc. పట్టా పుచ్చుకోవడం యాదృచ్చికం కావచ్చు కానీ,
నా జీవితాన్ని మలుపు తిప్పిన పరిణామం. తరవాత, నేను ఢిల్లీ లో AIIMSలో నా Ph.D. పని నిమిత్తం ఒక రోజు నా విభాగానికి వెడుతున్నప్పుడు కలిగిన ఆయన ప్రత్యక్ష దర్శనం. ఒక రోజు నేను AIIMS ప్రధాన ద్వారం నుండి నా విభాగానికి ప్రైవేట్‌ suites ఉండే ప్రాతం ద్వారా వెడుతున్నాను. హఠాత్తుగా
పి.వి. గారు అటుగా వస్తూ కనిపించారు. ఒకింత విస్తుపోయిన నేను తేరుకుని “నమస్కారం సర్‌” అన్నాను. ఆయన కొంచెం ఆగి, ప్రతి నమస్కారం చేసి కదిలి వెళ్ళారు. ఆయన వెనక గాని, ముందు గాని వందిమాగధులు లేరు. వైద్యం కోసం AIIMS లో చేరి, విడుదల అయిన ఆయన అప్పుడు ఆయన
విదేశాంగ శాఖ మంత్రి అని నాకు గుర్తు. ఎంతటి నిరాడంబరత!

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles