15.8 C
New York
Thursday, April 3, 2025

భూమాతలు

శ్రీ సిరికి స్వాామి నాయుడు

వాళ్ల త్యాగాల ముందు మనమెంత?
వాళ్ల సహనంముందు మనమెంత?

వాళ్ళు… భూమాతలు
కాసింత బరువును మోసేందుకే
మనం ఆపసోపాలు పడతాంగానీ…
అంతటి యింటిని- వాళ్లు భుజాలమీద ఇట్లే మోస్తారు
చీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారు
ఆశల్నీకోర్కెల్నీ తమలోనే సంలీనం జేసుకొని
నిర్మల నదీప్రవాహాలై సాగిపోతారు!

వాళ్లు…దుర్గమ అరణ్యాలు
ఛేదించాలనుకుంటే… మొలకై ప్రణమిల్లాల్సిందే
వాళ్లు… దయా కల్పవృక్షాలు
కరుణపొందాలనుకుంటే… దోసిలి పట్టాల్సిందే

వాళ్లు.. జీవనదులు
అమేయ జలగీతాల్ని వినాలనుకుంటే…
అంతరాంతరగాధాల్లోకి దూకాల్సిందే…
వాళ్ళు..అమూల్యగ్రంధాలు
అర్థంకావాలనుకుంటే…
మనసుపుటల్ని మననం చేయాల్సిందే!
వాళ్లు…

అగ్నిపర్వతాలు.. అంతు తెలియని అగాధాలు
కరుణరసార్ట్స హిమశిఖరాలు
సతత హరితారణ్యాలు వెన్నెల ఆకాశాలు…
వేకువపూదోటలు.. నడచేగాయాలు.. నెత్తుటిగేయాలు!
వాళ్లు ..అడవిని యిల్లుజేసి హరివిల్లును ముగ్గేస్తారు
పొద్దల్లా-యిళ్ల మీదా.. పొాలాలమీదా…
చెమటపిట్టలై ఎగురుతారు
తమ పొత్తిళ్లలో ప్రపంచాన్ని పసిపాపను జేసీ
జోకొడతారు!!

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles