9.8 C
New York
Sunday, November 24, 2024

మాయిముంత – కథానిక

ఆచార్య ఏటూరు జ్యోతి

మేటి కథలు-లోతు వ్యాఖ్యలు

తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం ‘మాయిముంతః’. పెద్దింటి అశోక్‌ కుమార్‌ గారు రాసిన కథానికల్లో ఒకటి మాయిముంత. ఇది తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ముఖ్యంగా పశువులకు ఆ కుటుంబ సభ్యులకు మధ్యగల అనుబంధాన్ని ఆవిష్కరించిన కథ.

ఈ కథానికలో సాయమ్మ, సాయన్న భార్య భర్తలు. వీరికి ముగ్గురు ఆడబిడ్డలు. మొదటి ఇద్దర్ని తెలంగాణలో కొంత దూరపు ప్రాంతాల్లోనే పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిల్లు శారు. చిన్న కుమార్తెను పిలిస్తే పలుకుతుంది. ఇరుకు, ఇబ్బందికి తోద్చడుతుందనే ఉద్దేశంతోనే ఉన్న ఊరిలోనే ఇచ్చి పెళ్లి చేశారు. కుమార్తె ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గేదెను కూడా తోలిచ్చారు. ముందు ఇద్దరి బిడ్డలకు సైతం చెరి ఒక గేదెను ఇచ్చారు. అయితే వారి గేదెలు దూడలను (ఈనాయి) కన్నాయి. చిన్న కూతురు గెదె దూడను కనక పోవడంతో గొడ్డు బర్రెను ఇచ్చిందని అమ్మను దూషించింది. చిన్న బిడ్డ మొదటి కాన్సును పుట్టింట్లోనే పురుడుపోసుకోనింది. రెండేళ్ళ నుండి పుట్టింటి మొహం చూడలేదు.

అక్క వాళ్ళు పుట్టింటికొస్తే వారం, పది రోజులుండిపోతారు. ఉన్న ఆస్తినంతా వారు అనుభవిస్తున్నారనే అపోహతో భర్త, అత్త మాటలకు తాను వంతపాడుతూ అమ్మా నాన్నలతో బెద్దుగి ఉంది. తాను మరొక బిద్దకు పురుడు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాా పంతంతో అత్తగారింట్లోనే బంద చాకిరి చేసుకుంటూ ఉండిపోయింది. తన బిడ్డ పుట్టెంట్రుకలకు తల్లిదండ్రులను మాటవరసకన్నా రమ్మని పిలువ లేదు.

తల్లి బిడ్డకోసం ఎంత కష్టపడి ఉన్నదాంట్లో ఇచ్చి. సుఖంగా ఉండాలని తను తాహతుకు మించి కట్నమిచ్చి పెళ్లి చేసిన వారి అత్యాశ వలన _ మనశ్శాంతి లేకుందా పోయిందని, పైగా నిందలు వేసి ఆడిపోసుకున్నారని తల్లి సాయమ్మ బాధపడుతుంది. తన ఇంట్లోని గేదెను చిన్న కూతురికి పంపారు. అది రండు సంవత్సరాలకు దూడను కనబోతాంది. అనుకోకుండా ఒకరోజు అర్ధరాత్రి తను అనూప చేలో పడి పది లేగలను తొక్కుకుంటూ రావడం వలన అలికడి అవ్వడంతో సాయమ్మ ఎవరిదో ఏద్దో, దొంగ బరైై అనో భావించింది. కానీ భర్తను టార్చ్‌ లైట్‌ వేసి చూడమంటే చూడగా మొదట మడిలోనే బరై కనిపించింది. సాయమ్మ దాన్ని కొట్టి తరమడం కొరకు ముందుగా మట్టి పెల్లను విసిరేశాడు. అయినా అది కదలక పోవడంతో కట్టెను అందుకొని బర్రెమిదికి ఉరికిండు. ఆ వెన్నెల వెలుగులోనే సాయమ్మ బర్రెను గుర్తుపట్టి బర్రెను కొట్టబోతున్న భర్తను ఆపింది. ఆమెడ దూరంలో గోజా కనపడితే ఊరికురికి తరిమే సాయమ్మ తనను ఎందుకు ఆపిందో అర్థం కాలేదు. సాయమ్మకు అతడు అడిగేలోపే గొంతు తగ్గించి అది మన గొంగి బర్రెకదా! బరి వంగి కొమ్ములు కనబడుత లేవ్వా… అన్నది సాయమ్మ మరింత కోపంతో గొంగిదో… గోషిదో… తలకు వాసిన ఎంటిక ఏ రేవుల పోతే మనకేంది. అంటూ బర్రె కొంకుల మీద కొట్టిండు. ఆ దెబ్బకు నిండు గెండునట్టు రెండుడగులు ముందుకేసింది.

సాయమ్మ గుండెల్లో కలుపుమంది నీ పాడుగాను జరాగు. బర్రె సుడిమీది ఉంది. తెగలేస్తుంది కనబడత లేదా. అన్నది నిండుకుండ లెక్క కదులుతున్న బర్రెను చూసినంక సాయి అన్న చేయి కిందికి దిగింది అయినా కోపం తగ్గలేదు నీ గతర్రను నా ఇల్లుకు సిచ్చు పెట్టినావు. చేసింది చాలదని మరిచినావా అన్నాడు కోపంగా…..కానీ సాయమ్మకు కోపం లేదు బాధగా ఉంది. అప్పటికే బిడ్డ తిట్టుకుంటూ ఏడుస్తుంది. బరైను చూశాక ఆ ఏడుపు ఎక్కువైంది దాన్ని రోడ్డు మీద చేతులేసి తడ్చా. రేపు మాకు అన్నట్లు అల్లాడిత్తనవు. ఇప్పుడు దొంగ తిండి కావాలనా….. పొద్దున నిండినై సక్కగా ఇంటికి పో అన్నది. ఈ వాక్యాల్లోని మాటలు పశువుకు దాని యజమానురాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రార్ధించే మాటలు మనకు అర్ధం అవుతున్నాయి. అర్ధరాత్రి వెన్నెలలోనే ఆమడ దూరం ఉందగానే దాని కొమ్ములను బట్టి అది తన ఇంటి పశువుని గుర్తించింది.

దాని నదుమును రందిగ చూసి అది ఈనబోతుందని, పేయి దగ్గర ఉన్న కనిపిస్తున్న స్థితిషాలను బట్టి అతి త్వరలో దూడను కనబబోతుందని గ్రహించింది. అర్థరాత్రి దొంగగా తన చేనులో పడి తినదం దొంగ తిండి ఈనాటికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇలా ఎవరి చేనులో పడితే వారు బడితే పూజ చేస్తారు. అరీదుకే ఆమె చక్కగా ఇంటికి పొమ్మని మనిషికి నీతులు చెప్పినట్లుగా ఆ  బర్రెతో చెప్పడం సాయమ్మ హృదయాన్ని ఆవిష్కరించే మనస్తత్వంగా అర్ధం చేసుకోవచ్చు.

చూసినావా గొడ్డు బర్రెను ఇచ్చినానని మీ అక్క తిట్టను తిట్టు తిడుతుంది. బిడ్డ సల్లగా ఉంటే, దాని బిడ్డ బుద్ధిమంతురాలు. అనరాన్ని మాటలనే నన్ను ఊరి పెట్టుకుని చావమనే, పంది సెన్నట్లు కన్నవాయే. ఇప్పుడు చూడు బర్రె ఈతకొచ్చే. మీదపడ్డ దెబ్బలు ఉంటాయని మాటలు పోతాయా అని బాధగా అన్నది సాయమ్మ.

ఈ మాటల ద్వారా తల్లి సాయం మనం బిడ్డ దూషించిన తీర్పు తల్లి హృదయం ఎలా తల్లడిల్లి పోతుందో వారి మనసుపై ఎలాంటి ముద్రణ వేస్తాయో వాస్తవికతకు నిదర్శనంగా నిలుస్తాయి. కోపంతోనో బాధతోనో రెండు దెబ్బలు కొట్టిన వాడు నొప్పిని రోజులు గడిచే కొద్ది మరిచిపోవచ్చు. కానీ మనసును బాధ పెట్టిన మాట దెబ్బలు అంత సులువుగా మర్చిపోలేమని సూత్రాన్ని ఈ సామెత ద్వారా అభివ్యక్తం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రధాన ఘట్టం ఈ బరైను సెను వరకు తోలి వచ్చినా కొద్దిసేపటికే మరల వచ్చి అనుప చేనులో పడి పాడు చేయడం, తన కొమ్ములతో తీగలను తెంపుతూ, నేలను పొడుస్తూ ఉన్నదిగా అలికిడికి సాయమ్మ మరల వచ్చి చూడడం మరో ఎత్తు.అది ఈనడానికి నొప్పులు పడుతుందని ఆమె గ్రహించింది ఒక వైపున భయపడుతూనే తొలిసూరు ఈత ఎలా ఇబ్బంది కలుగుతుందో ఆందోళనలతో సతమతమవుతూనే మరొకవైపు ఆమె బర్రైను చుట్టూ తిరుగుతూ దాని వీపు మీద చేత్తో తడుతూ ధైర్యాన్ని కలిగించింది.

బరై ఆయాసంతో తిరుగుతూ ఉంటే ఆమెలో తల్లి పేగు కదులుతుంది. ఎందుకంటే స్త్రీమూర్తికి బిడ్డ నొప్పులు ఎలా ఉంటాయో తెలుసు. తాను కడుపుతో ఉన్నప్పుడు పడిన సాధక బాధకాలు పశువులకు సైతం వర్తిస్తాయి. అందుకే ఈనబోతున్న గొడ్డును కొట్టవద్దని భర్త సాయన్నను ఆపింది. దాని చేష్టలు, ఆయాసంతో తిరగడం, పడుతూ, లేస్తూ జరుగుతున్న తీరు సాయమ్మకు అర్థం అవుతున్నాయి. అందుకే దానికి వేడి నీళ్లు పోయడానికి పొయ్యి మీద నీళ్లు పెట్టింది. బలం కోసం కంకిచొప్ప, తెల్లగడ్డలను దంచి ముద్ద చేసింది. వరి, గోధుమ, మినప పిండి కలిపి నానబెట్టింది. నీ కాయ చల్లగుండ పోతే పోనీ, పొదుగు మాత్రం జారుతుంది గంటలోనూ అరగంటలోనూ ఇనుతది. నా ముగ్గురు బిడ్డల తోటి దాని మాయమంత గూడ నా ఇంట్లోనే ఉంది. నిజానికి మన ఆడవాళ్లు కాన్పు జరిగిన తర్వాత వారి మాయిని జాగ్రత్తగా కుక్కలు తినకుండా పూడుస్తారు. అలాగే ఇండ్ల దొడ్డలో ఈనిన పశువుల మాయిలను సైతం కుక్కల బారిన పడకుండా జాగ్రత్తగా మూండు లోతు మట్టి తీసి పూడుస్తారు. పుద్చే పద్ధతి ఒకప్పుడు మన గ్రామంలో మన సంస్కృతీ సాంప్రదాయాల్లో పాటించేహారు మాయిని తింటే తిన్న దానికి జబ్బులు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుందని గ్రామ పెద్దలు భావించి జాగ్రత్తలు వహిస్తారు. ఇక్కడ బర్రె కొద్దిసేపటికే దూడను కన్నది. కన్న వెంటనే దాని ముర్రును నాకుతూ ఉంది. అది నిలబడడానికి ప్రయత్నిస్తుంది. దాని గిట్టల గోర్లు కొరికి నిలబడేందుకు సాయపడింది.

పాల కోసం పాల పొదుపు కోసం బిడ్డ వెతుకుతుంది సాయమ్మ బరై రొమ్మును దూడకు అందించడం చేస్తుంది. పాలు రాకపోవడం రొమ్ములు చీకడం వలన రొమ్ముల నుండి రక్తం కారడం ఆ దూడకు పాలు రక్తం అని వ్యత్యాసం తెలియక తాగడానికి ప్రయత్నించినప్పుడు తనకు తన గతం గుర్తుకు రావడం, నోస్టాలజీని గుర్తుకు తెస్తుంది. తాను మొదటి సారి పురుడు పోసుకున్నప్పుడు తన రొమ్ములను మంచపు సందుల్లో ఉంచి పాలు పిండిన స్ధితి, రక్తం కారిన తీరు గుర్తుకు వచ్చింది.

ఆ సమయంలో బిడ్డను కనడంలోనూ పాలు ఇవ్వడంలోనూ ఉందే బాధలు నొప్పులు కనే వారికి తెలుస్తాయి కానీ మగవారికి ముఖ్యంగా బిడ్డ పుట్టడానికి కారణమైన మగవారిని కానీ దున్నపోతుకు గానీ తెలియవని సత్యాన్ని రచయిత సాయమ్మ మాటల ద్వారా వెల్లడించారు. బర్రై దూడను ఈనింది. దూడ ఉల్లాసంగా తిరుగుతుంది కానీ మాయి వేయలేదు. ఆయాస పడుతూ ఉంది. గుడ్డ మాయి పడుతుందేమోనని సాయమ్మ భయపడుతుంది. దానికి కారణం మట్టి రంగులో తేడా ఉండడం. మట్టి కమలిపోయి ఉండడం సాయమ్మను లేపి గొడ్డలి చేతికిచ్చి బూరుగు చెక్క, ఉప్పు చెక్క వెంబడి తీసుకురమ్మని పంపింది. సాయన్న నిద్ర లేచి హడావిడిగా వెళ్లి వెతికితెచ్చాడు. దాన్ని బాగా ఉడికించి రసాన్ని గొట్టంలో వేసి తాగించింది. ఈ రసం ఏమాత్రం ఎక్కువైనా బర్రె చనిపోతుంది. తగిన మోతాదులోనే తాపుతేనే కడుపులో ఉన్న మాయి పడిపోతుంది.

సాయన్న వచ్చేసరికి జాజును, గంజిని కలిపి పెట్టింది. దీనిని నూనె మరింత భయపడి బరెకు పెట్టొద్దు అన్నాడు. సాయమ్మ వినక జుర్రుతున్న బర్రె ఆయాసం కళ్ళముందే కదిలింది. సాయమ్మ గొట్టంతో మందు బర్రకు పోసింది మందు కడుపులో పొడంగానే కోరుతున్న బర్రె కూల పడ్డది మొదలు సాపింది. కళ్ళు తేలేసింది గుడ్లు పైకి నిలిచాయి. నాలుగు కాళ్లను పాగదీసి నిరదొక్కింది. కడుపు ఉబ్బి ఎగపోత మొదలయ్యింది. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే బరై చనిపోవడానికి ముందు కనిపించే లక్షణాలు. ఏమాత్రం పశువులతో అనుబంధం ఉన్న ప్రతి మనిషికి అర్హమయ్యే జరగబోయే విపత్తులను సూచించేదే అయినా సాయన్న దగ్గరకొచ్చి దాని చెవులు ఇరిసిండు. తోక మటను గుంజుండు దవడలు సాఫీ చేతితో పెద్ద నాలుకను తడిమిండు. నాలిక ఉబ్బి చేతులలో ఇవ్వడం లేదు ఇద్దరు కలిసి బర్రైను లాబట్టిండ్రు. దొడ్డన దూరం జరిపిండ్రు. బర్రె నిలబడి ఒక దులుపుడు దునికేసరికి తట్టెడు మాయి కిందికి రాలింది.

ఊపిరి ఉగ్గు పట్టుకున్న సాయన్న గట్టిగా ఊపిరి పీల్చుకుంది. సాయన్నకు భయం పోయి మాయిని పోక్కలలో పాతి పెట్టిండు. సాయనమ్మ సంబరానికి పట్టపగ్గాలు లేవు ఉడుకు నీళ్లంతా బర్రెను కడిగింది. ఎల్లిగడ్డ రాసింది. తన కూతురు భర్త శంకరి బరై కోసం రాగా సాయన్న దుడ్దేను అల్లుని చేతిలో పెట్టి దాంతో దుద్దే కోసం బరై శంకర్ని అనుసరించి వెళ్ళింది. తల్లి లెక్క బిడ్డ రామంటరు. నిజమే బర్రె చూసినవా దొడ్డే ఎటు బోతుందో తన బిడ్డ మాయ ముంతను తల్లి గారి ఇంట్లో పార్టీ దొంగ బర్రె బిడ్డను దేవులాడుకుంటూ సాగిపోతుంది. అన్న వ్యంగ్యంతో కథ ముగిసింది.

ఈ కథ ద్వారా రచయిత మధ్యతరగతి, కిందిన్టాయి కుటుంబాలలోని మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలతోనే ముడిపడి ఉన్నాయని సత్యాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా మగ బిడ్డలు లేని కుటుంబాలలో అక్కాచెల్లెళ్ల మధ్య ఎలాంటి పొరపాట్లు, అసూయ, ద్వెషాలు ఏర్పడి వారి రక్త సంబంధాలు ఇలా పతనమవుతున్నాయో, నేటి కుటుంబ వ్యవస్థలోని ఒక సాంస్కృతిని ఆవిష్కరించే కథగా దర్శనమిస్తుంది. బిడ్డ మాట్లాడకపోయినా తన ఇంట్లో బర్రె తన చేనులో పడి, పంటను నాశనం చేసిన, పంట నష్టాన్ని లెక్కచేయక, దానిని తన సొంత బిడ్డ లాగా పశువును భావించి, దానిని చేతనైన సహాయం చేసి, దాన్ని కాపాడుకోగలిగిన ప్రేమ మూర్తిగా సాయమ్మ దర్శనమిస్తుంది. తన ఇంటి గొడ్డును, తన బిడ్డ లాగా చూసుకునే సంస్కృతి మన నిత్య జీవితంలో ఎప్పుడు భాగమై ఉండేదని, ఇది మన అచ్చమైన తెలుగు గ్రామ సంస్కృతిలో నిదర్శనం అనిభావించవచ్చు. పూర్తిగా తెలంగాణ మండలికంలో రాసిన కథగా, ఇందులో ఉపయోగించిన మాండలిక పదాలు గోగ్గోలు, గోజా, పొంటేజాము, దక్కలోడు, మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ కథానికల్లో కొంతమంది కథకులు పశువుల నేపథ్యంతో కొన్ని కథలు రాశారు.

అలా మన తెలంగాణలో కథానిక సాహిత్యంలో బరై మాయిముంత నేపథ్యంతో కథలు రాసిన వారిలో పెద్దింటి అశోక్‌ కుమార్‌ గారు ఒకరు… ఇది పశువుకు యజమానికి మధ్య ఉన్న అన్యోన్య సంబంధాన్ని తెలిపే కథగా పేర్కొనవచ్చు.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles