9.8 C
New York
Monday, November 25, 2024

కులవివక్షపై గురిపెట్టిన అస్త్రం – మహా విద్వాంసుడు

కవితశ్రీ

మేటి కథలు-లోతు వ్యాఖ్యలు

ఆచార్య తుమ్మల రామకృష్ణ గారి “మహా విద్వాంసుడు” కథ చదివితే కులం కారణంగా గురుముఖం ద్వారా విద్యకు నోచుకోలేకపోయిన ఏకలవ్యుడు గుర్తొస్తాడు. ఆ కులం కారణంగానే తన విద్య పనికిరాకుండా అతని బొటనవేలిని బలిగొన్న పాలకమన్యుల కుటిలనీతి, ప్రాణానికి ప్రాణం లాంటి బొటనవేలిని కోల్పోయిన ఏకలవ్యుని దైన్యం గుర్తొస్తాయి. అదే కులం కారణంగా తన అస్త్రవిద్యా ప్రదర్శనకు నోచుకోక అవమానం పాలైన కర్ణుడు గురొస్తాడు. అదే కులం కారణంగా మహర్షిత్వం పొందిన నేరానికి స్వయానా అవతారపురుషులుంగారి చేతే అసువులు కోల్పోయిన శంబూకుడు గురొస్తాడు. “నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపు రేఖా కమనీయ వైఖరులు గాంచి, భళీభలళి అన్నవాడె మీదే కులమన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచిపోవుచో బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్‌” అని వాపోయిన కవికోకిల జాషువా గారి మాటలు గురొస్తాయి.

విద్యలకు, కళలకు, క్రీడలకు,కులంతోటి, వర్ణంతోటి, మతంతోటి, జాతితోటి ఎలాంటి అవినాభావ సంబంధం లేదు. అవి ఫలానా వారికి అబ్బుతాయి అని గానీ, ఫలానా వారికి అబ్బవు అని గానీ చెప్పడానికి వీలుపడదు. కాకపోతే అనువంశికంగా ఒక కళను ఆశ్రయించిన వారిలో ఆ కళ రక్తంలో ఇంకిపోవడం వలన వారి వారసులకు కొంతవరకూ వారసత్వంగా సులువుగా అబ్బవచ్చు. కొందరికి కళ సాధన ద్వారా పట్టుబడుతుంది. మరికొందరికి సహజంగా జన్యువుల్లో, శరీరావయవ నిర్మాణంలో అలాంటి సానుకూల లక్షణాలు ఉండటం వలన, దానికి సాధన తోడు కావడం వలన వారు ఆయా కళల్లో సమున్నత స్థానాలను చేరుకోవచ్చు. ఎంత మొద్దు మనిషి అయినా సాధన ద్వారా విద్యలు, “కళలు, క్రీడలపై పట్టు సాధించవచ్చు. అంతేగాని వాటితోటి ఏ సామాజిక వర్గానికి కూడా అవినాభావ సంబంధం లేదు. శరీర నిర్మాణంలో ఉన్న సానుకూలత తోటి సాధన చేస్తే అవి పట్టుబడతాయి. సాధన లేని కళాకారుడికి ఎంత ప్రతిభ ఉన్నా అతని కళ రాణీంచదు. అయితే దురదృష్టం కొద్దీ మన దేశంలో విద్యలకు, కళలకు, క్రీడలకు కులకళంకం అంటుకున్నది. ఈ దేశంలో మొదట అక్షరజ్ఞానం వంటబట్టిన బ్రాహ్మణ సామాజిక వర్గం దాన్ని ఇతరుల పరం కాకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంది. వీద్యలు, కళలు, క్రీడలు అన్నీ తమ వద్దే అట్టి పెట్టుకోవడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. (మనుస్మృతి నిస్సిగ్గుగా బ్రాహ్మణుడికి సర్వాధికారాలను కట్టబెట్టింది) అందుకుగాను ఎంతో కఠినమైన నియమావళులను స్మృతులను సృష్టించుకున్నది. ఆ స్మృతులను సెంటిమెంట్లుగా, భయాలుగా మార్చి యథాతఢథస్థితిని నిరాఘాటంగా కొనసాగిస్తున్నది. & ప్రస్తుతం తెలుగు ప్రాంతాల్లో రెడ్లు, కమ్మలు, కాపులు విద్యలు కలళలను కొంతవరకు తమ వశం చేసుకున్నా ఇప్పటికీ క్రీడల్లో క్రికెట్‌, కళల్లో సంగీతం బ్రాహ్మణ సామాజిక వర్గం చేతుల్లోనే బందీలుగా ఉన్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి రాజకీయాలను రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు; సినిమా రంగాన్నీ కమ్మ, కాపు సామాజిక వరాలు లాగేసుకోవడం ఒకే రకంగా ఆరోగ్యకరమైన పరిణామమే కానీ వాటికీ వారసత్వపు కంపు బలంగా అంటుకోవడం, రాజకీయ పార్టీలు అచ్చమైన కులసంఘాలుగా రూపాంతరం చెందిపోవడం విషాదం. ఈ నేపథ్యంలో సంగీతకళలో కుల వివక్షని నిరసిస్తూ వచ్చిన మహా విద్వాంసుడు కథని లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం వుంది.

మహా విద్వాంసుడు కథ బహుజన అస్తిత్వవాద ఉద్యమ నేపథ్యంలో వెలువడ్డ రచ్చన. దేశ జనాభాలో పేరులోనే ఉన్నట్టు బహుజనులు సుమారు 52 శాతం మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ రాజ్యాధికారానికి ఆమళ్ళదూరంలోనే ఉన్నారు. ఇప్పుడు దేశ ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత స్థానంలో ఒక బహుజనుడున్నాడని, అది అతిగొప్ప విషయమని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. కానీ యంత్రాంగంలో ఎవరున్నా వాళ్ళలో ఉన్నది మాత్రం పక్కా క్యాపిటలిస్ట్‌ బ్రాహ్మణవాద భావజాలం మాత్రమేననేది ఎవరూ కాదనలేని చేదునిజం. ఈ దేశంలో వలస ఆర్యులు అడుగుపెట్టిన నాటినుండి, వాళ్ళు వ్యూహాత్మకంగా స్థానికమైన ద్రవిడ సంస్కృతిని కూకటివేళ్ళతో సహా తొలగించి ఆర్య సంస్కృతిని నెలకొల్పడం మొదలు పెట్టిన నాటినుండి, నాటి బహుజనుడైన వాల్మీకి నుండి నేటి బడుగవర్గాలకు చెందిన సివిల్‌ సర్వీసు అధికారుల వరకూ కులవర్ణాలకు అతీతంగా అందరూ సదరు బ్రాహ్మణవాద భావజాలంలోనే ఆలోచిస్తున్నారు. రామాయణం రాసిన వాల్మీకి బహుజనుడే కానీ ఆయనకు తన సామాజిక
వర్గానికి కింద ఉన్నపంచమవర్గ్ణ పేదల కష్టాలు పట్టలేదు. తన సామాజికవర్గం ఉన్న శూద్రుల బాగోగులు పట్టలేదు. వ్యవసాయం చేయించి పదిమందికీ అంత కడిపెట్టే వైశ్యుల అగచాట్లు పట్టలేదు. చివరకు దేశ సంరక్షణ చూసే క్షత్రియుల పడుబాట్లు పట్టలేదు. ప్రజలపై ప్రభువులపై ఆర్య బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని సుస్తాపితం చెయ్యడం, వాళ్ళ ఆదర్శమైన (ద్రవిడ సంస్కృతిని సర్వనాశనం చేసి డేశంలో ఆర్య సంస్కృతిని అందలం ఎక్కించడం మాత్రమే పట్టింది. కన్నులుండి చదివితే రామాయణం నిండా ఇదొక్కటే కనబడుతుంది. మరో బహుజనుడు వ్యాసుడు రాసిన భారతంలో కూడా ఇదే కనబడుతుంది. అంటే ఈ దేశంలో ఎవరైనా సరే తమ సొంత అస్తిత్వంలోంచి కాకుండా బ్రాహ్మణవాద అజెండాలోంచి మాత్రమే ఆలోచిస్తారు. నేటి తరం మేధావులు, రచయితలు అందులో కూడా స్వల్పసంఖ్యాకులు మాత్రమే దాన్ని గుర్తించి బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారిలోకి తుమ్మల రామకృష్ణ లాంటి రాజ్యవ్యవస్థలోని వ్యక్తి వచ్చిచేరడం ముదావహం.

కన్నదాసు అనే మంగలి కులస్థుడు తనలో ఉన్న సహజ ప్రతిభతో గ్రామంలోని పదిమందిని చిన్నతనంలోనే ఆకట్టుకోవడం, శేషశాస్త్రి ప్రోత్సాహంతో అతని తండ్రి సాంబయ్య తనని తమిళనాడులోని ఒక సంగీతవిద్య నేర్పే గురువు (గురువు పిచ్చప్ప. ఇంకెవరు? బ్రాహ్మణుడే అయ్యుంటాడు. కానీ అతడు కులపట్టింపులు లేకుండా కన్నదాసుని చేరదీయడం, తనని కొడుకులా చూసుకోవడం, తన సంగీత వారసుడు కన్నదాసేనని ప్రకటించడం ముదావహం) వద్దకి పంపడం, తను భక్తి శ్రద్ధలతో సంగీతాన్ని అభ్యసించి గొప్ప సంగీత విద్వాంసుడు కావడం, కచేరీలు చేసి పేరుప్రఖ్యాతులు గడించడం, అవి చేకూరగానే సంగీతప్రపంచంలో అతని కులంపై ఆరాలు తీయడం ప్రారంభం కావడం, జనాలు అతని కులం తెలుసుకుని దాని కారణంగా అతన్ని, అతని సంగీత విద్యని తక్కువచేసి మాట్లాడ్డం, లోకుల ఆ కులపిచ్చితో విసుగుచెంది కన్నదాసు ఇక సంగీతం జోలికేపోనని ప్రతిజ్ఞ చేసుకోవడం, తను కులవ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడ్దానికి కృతనిశ్చయుడు కావడం – ఇది మహా విద్వాంసుడు కథలోని ఇతివృత్తం. కులవ్యవస్థని, కళల్లో ఉన్న కులపిచ్చిని ఖండించడం, కులవ్యవస్థని రూపుమాపడానికి పాఠకుణ్ణి సన్నద్ధం చెయ్యడమే ఇందులోని కథావస్తువు. మహా విద్వాంసుడు కథ రాయడానికి తుమ్మలవారికి సాధికారత ఉంది. ఆ సాధికారత తన గ్రామీణ కుల నేపథ్యం నుండి వచ్చి అబ్బింది. విద్యావ్యవస్థలో తనకు ఎదురైన చేదు అనుభవాల నుండి వచ్చింది. సంగీతంపై పాటపై తనకున్న పట్టువల్ల అబ్బింది. ఆ మాటకు వస్తే కథలోని నాయకుడైన కన్నదాసు రచయిత రామకృష్ణ కావచ్చు. కాకపోతే కులవ్యవస్థ నుండి కన్నదాసు పొందిన జ్ఞానం సంగీత ప్రపంచానిది కాగా, రామకృష్ణ గారు పొందిన జ్ఞానం విద్యా వ్యవస్థది. మరుగు కొంచెమే. కన్నదాసు తన పూర్వీకుల నాదస్వరాన్ని కొట్టిడీలో చూసినప్పుడు దాని గురించి చెప్పిన గతస్కృతుల్లో రచయిత రామకృష్ణ గారి సంగీత పరిజ్ఞానం, గ్రామీణ సంస్కృతి పట్ల ఆయనకున్న అవగాహన, తెలుగు గ్రామాల్లోని కులవివక్షల పట్ల తనకున్న అనుభవం, కులం కారణంగా తన పూర్వీకులు అనుభవించిన
అవమానాలు, నాదస్వరం దాని విడిభాగాలపై వారికున్న పట్టు కొట్టొచ్చినట్టు కనబడతాయి.

రామకృష్ణ గారికి కులవ్యవస్థ యొక్క అనుపానులు తెలుసు. ఆ తెలిసింది. ఏ కంఠస్వరంలో నుంచైనా తెలుసు. శేషశాస్త్రి ఏదో గ్రామానికి పోయి అడపం చేతబట్టుకుని వస్తున్న సాంబయ్యని పిలిచి తాను కన్నదాసు పాట విన్నానని, అతనిలో గొప్ప ప్రతిభ ఉన్నదని, అందువల్ల తనని ఎవరైనా గురువు వద్దకి పంపి సంగితం నేర్పించమని చెబుతాడు. ఆ చెప్పడంలో కొన్ని మాటలు చూడండి. “మా ఇళ్ళల్లో అలాంటి పిల్లోడు పుట్టింటే దాని కతే అలాదు. నా మాటిని వాణ్ని మనూర్లో పెట్టద్దు. మీ వోత్ళ మధ్యలో వుంటే చెడిపోతాడు. వాణ్ని మంచి విద్వాంసుని దగ్గర్‌ వొదిలిపెట్టు… వానికి నీ మాదిరి నాదస్వరం గీదస్వరం నేర్పించవద్దు. నేర్పిస్తే వాడూ నీ మాదిరి చావు మేళాలు, సమర్త మేళాలు వాయించి బతకాల్సిందే. పిల్లోడు ఎర్రగా బొద్దుగా ఉన్నాడు. చెక్కిన బొమ్మలా ఉన్నాడు. అచ్చం బాపనోళ్ళ పిల్లోడులా ఉండాడు. వానికి గాత్రం నేర్పించు. నేను సచ్చి ఏలోకానున్నా మా వూరి సాములోరు మేలు చేశాడని తలచుకుంటావు” అంటాడు. ఈ మాటల్లో కులవ్యవస్థ స్వరూపం బయటపడుతున్నది. ఈ నేలలో ప్రతిభావంతుడు రాణించాలంటే బ్రాహ్మణ కులంలోనే పుట్టాలి. ఇతర కులాల్లో పుట్టితే వాణ్ని పైకి ఎదగనీయరు. బ్రాహ్మణేతరుల్లో పుట్టడమే శాపం. బ్రాహ్మణవాదంలో (శ్రామిక కులాల్లో పుట్టడం, ఒళ్ళొంచి శ్రమించడం, పదిమందికీ కడి పెట్టే ఉత్పత్తి కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం చెడిపోవడమే(?). ఏ పనీపాటా చెయ్యకుండా పదిమంది నెత్తి మీదా చెయ్యిపెట్టి ఉద్దరకూడు తింటూ పరాన్నభుక్కులుగా మిగిలిపోవడమే చెడిపోకుండా బాగుపడిపోవడం. మన పూర్వ బ్రాహ్మణ కవులు రాసిన కావ్యాల్లో “కడుపులో చల్ల కదలకుండా బతకడం” అనే మాట విరివిగా కనబడుతుంది. బ్రాహ్మణవాదమే అలాంటిది. తెలివిగలవాడు ఎవడు కంటబడినా వాడినీ శ్రమకి దూరంచేసి చెడగొట్టాలని చూస్తుంది బ్రాహ్మణవాదం. అందుకే కన్నదాసుకు నాదస్వరం గీదస్వరం వద్దన్నాడు శేషశాస్త్రి. చావు మేళాలు, సమర్త మేళాలు వాయించడం నామోషీ ఐతే అలాంటి సంప్రదాయాలను సృష్టించింది. ఎవరు? ఎందుకు? ద్రావిడార్య జాతులు ఒకచోట చేరినప్పుడు వాటి కలయిక (ఆ కలయికల్లో ఆర్యజాతి పురుషులు ద్రవిడజాతి స్త్రీలని బలవంతంగా లోబరుచుకున్నవే అధికభాగం అని వేరే చెప్పనక్కర్లేదు. అలా పుట్టిన సంతానాన్ని తమలో చేర్చుకోకుండా చప్పన్నారు కులాలను సృష్టించారు) వల్ల పుట్టిన మనుష్యుల్ని మనుషులుగా వదిలెయ్యకుండా వర్ణాలుగా, కులాలుగా విభజించిందెవరు? కొన్ని కులాలకు సాధికారతని, కొన్ని కులాలకు నీచమైన సేవల్ని అంటగట్టిందెవరు? అందంగా పుట్టితే బ్రాహ్మణుల్లోనే పుట్టాలా? ఇతర కులాల్లో అందంగా పుట్టకూదడా? అందానికీ బ్రాహ్మణత్వానికీ ఉన్న ఆ అవినాభావ సంబంధం ఏమిటి? అసలు అందమంటే ఏది? ఇలా ఈ సందర్భం సవాలక్ష ప్రశ్నలను లేవనెత్తుతోంది వీటన్నిటికీ బ్రాహ్మణవాదం వద్ద సమాధానాలు లేవు. శేషశాస్త్రి సాంబయ్యకి ఉచిత సలహా ఒకటి పడేయడంలో కన్నదాసు ప్రతిభ మీద అక్కరకంటే కూడా అతడు బాగుపడితే చచ్చినా తనని తలచుకుంటారనే యావ ఎక్కువగా ఉంది. శేషశాస్త్రి పిలిచినప్పుడు సాంబయ్య అతనికి నాలుగడుగుల దూరంలోనే నిలబడ్డాడు. బ్రాహ్మణులు ఒక్క దలితుల్నే కాకుండా అంటంటూ, ముట్టంటూ, అసింకమంటూ బహుజనుల్ని కూడా దూరం పెట్టడం ఇప్పటికీ కొనసాగుతున్నది. శేషశాస్త్రి “ఈ మధ్య ఊర్లో ఉండావా? ‘లేవారా?” అని సాంబయ్యని ప్రశ్నించడంలో అతని కులదర్శం స్పష్టంగా తెలుస్తుంది. “ఏదో కడుపాత్రం స్వామి. కర్నాటక దిక్కు పోయింటి” అని సాంబయ్య ‘బదులియ్యడంలో కులవ్యవస్థకీ షే పేదరికానికీ ఉన్న అవినాభావ సంబంధం కూడా కనబడుతుంది. ఇలా ఉంటుంది కులవ్యవస్థ స్వభావం. దాన్ని ఈ కథలోని కథనం బట్టబయలు చేసింది.

దేశంలో కులవ్యవస్థ ఎంతగా జనాల రక్తంలో ఇంకిపోయిందంటే… .దాని వల్ల తమకు జరుగుతున్న అవమానాలు గానీ, అన్యాయాలు గానీ, కష్టనష్టాలు గానీ తక్కువ కులస్థులు గుర్తించను కూడా గుర్తించలేరు. ఇక ఉన్నత కులస్థులు ఇతర కులస్థుల అభిజాత్యాన్ని, అభిమానాన్ని తాము కించపరుస్తున్నామన్న ఎరుకలోకి రావడం, దిద్దుబాటు గురించి స్పృహలోకి రావడం సరేసరి. అందుకే శేషశాస్త్రి తనతో మాట్లాడినప్పుడు అతడు తన బిడ్డ కన్నదాసుని పొగిడినాడన్న ఒక్క సాంబయ్య. ఆ మాటల్లో దాగున్న కులదర్బం, తమ కులాన్ని, వృత్తినీ తక్కువచేసి మాట్లాడ్డం అతని బుద్ధికి స్ఫురించనే లేదు. పైగా శేషశాస్త్రి నాలుగేళ్ళుగా అదో ఇస్తా… ఇదో ఇస్తా. .నని కూతురి పెళ్ళికి మేళం వాయించిన డబ్బులు ఇవ్వకపోయిన సంగతి మరిచేపోయాడు సాంబయ్య. ఇలా మార్క్సిస్టు విమర్శకులు మాత్రమే గుర్తించగలిగిన కథనం చెయ్యడం అసలైన సాహితీవేత్త లక్షణం. అలా చెయ్యడం వల్ల అతడు వట్టి సాహితీకారుని స్థాయి నుండి కళాకారుని స్థాయికి చేరుకుంటాడు. సాంబయ్యకు కొడుకుపై ఉన్న ప్రేమని వర్ణించడంలో, అతని ఎదుగుదలని చూసి తండ్రి మురిసిపోవడంలో, పాఠకుని కళ్ళు చెమ్యగిల్లేలా చెయ్యడంలో రచయిత నేర్చరితనం తన స్థాయికి తగ్గట్టుగా ఉంది.

మహా విద్వాంసుడు కథలో కాలాన్ని ముందు వెనుకలకు పరుగులెత్తించడంలో, కథనంలో, కథనశిల్పంలో తుమ్మలవారి స్థాయి గడుసుదనం స్పష్టంగా కనబడుతుంది. కన్నదాసు దేశం నలుమూలలా పోయి కచేరీలు చెశాడు. అతని కళా విలాసాన్ని కళ్లారా చూసి, చెవులారా విని పరవశించినవాళ్ళు అతన్ని పొగిడినవాళ్ళే అతని గురించి ఆరా తీయడం ప్రారంభించారు. అపచారం జరిగిపోయినట్లు బాధపడ్డారు. ఆ
మాత్రం వంటావార్పు చేసుకునేవాళ్ళు కూడా పాడగలరని తీసిపారేశారు. కన్నదాసు సంగీత ఆరాధనోత్సవాల్లో (వివాదాలకు భయపడి కాబోలు అవి ఏ ఆరాధనోత్సవాలో రచయిత చెప్పలేదు) పాడాలని నిష్టగా సిద్ధమయ్యాడు. అతను అక్కడ చేసిన కచేరీని వర్ణిచడంలో రచయిత సంగిత జ్ఞానం తెలిసొస్తుంది. కచేరీ సంగీత ప్రియుల్ని ఆనందసాగరంలో ఓలలాడించింది. విన్నవాళ్ళు “ఇంత అద్భుతమైన గాత్రం ఎక్కడా వినలేదు. ఆ రాగాలాపన నభూతో నభవిష్యతి” అన్నారు. అంతలో ఎక్కడి నుండి వచ్చాడో సుడిగాలిలా వచ్చి పరబ్రహ్మశాస్త్రి మైకు అందుకున్నాడు. “కన్నదాసు బాణి గాత్ర సంగీత
బాణి కాదు, అతని తాతముత్తాతలెవరో నాదస్వర విద్వాంసులై ఉండాలి. ఆ జన్మ సంస్కారం కన్నదాసుకు అబ్బి ఉండాలి. మేము బైరవి పాడితే ఒక్క గోలిగుండు తార్రోడ్డు మీద దొర్లించినట్లుంటాది. కన్నదాసు ఈ రోజు పాడిన భైరవి ఒక లారీ గోలిగుండ్లు సిమెంటు రోడ్డు మీద దొర్లించినట్లున్నాయి” అని తనని అతడు పొగిడినాడో తెగిడినాడో ఎవరికీ అర్ధం కాకుండా అన్యాపదేశంగా అతని కులాన్ని, సంగీత ప్రతిభని ఎగతాళిచేసి ముగించాడు. కన్నదాసు గుండె బద్ధలైపోయింది. ఎందరు ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా వినిపించుకోకుండా అక్కడి నుండి వచ్చేశాడు. ఈ దేశంలో సంగీతానికి కూడా కులం, మతం ఉన్నాయని తెలిసి తల్లడిల్లిపోయాడు. పలురకాలుగా పలవరించిపోయాడు. బతికుంటే పాట పాడకుండా ఉండలేడు. పాడితే అది ఎంగిలిపాట మంగలిపాట అంటారు. అందుకే అతడు ఇకపై పాడకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అందరూ శేషశాస్త్రి చనిపోయిన హడావిడిలో ఉంటే తాను మాత్రం కులం కంపులో కుల్ఫీ కంపుకొడుతున్న శవాలను నిద్రలేపే ఆలోచనలో పడ్డాడంట. అది కన్నదాసు ఆలోచన. రచయిత ఆకాంక్ష. అది కార్యరూపం దాల్పాలని కోరుకుందాం.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles