11.5 C
New York
Sunday, November 24, 2024

మేడే-నాడు, నేడు

డాక్టర్‌ దార్ల వెంకటేశ్వరరావు,
వరిష్ట సంపాదకులు, ప్రకాశిక

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక

నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి,
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా
సమర్చనంగా-
త్రిలోకాలలో
త్రికాలాలలో,
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని” చాటుతూ మహాకవి శ్రీశ్రీ “ప్రతిజ్ఞ పేరుతో ఒక గొప్పకవితను రాశారు. కార్మిక దినోత్సవంగా జరుపుకునే ‘మేడే’ రోజున అనేకమంది ఈ కవితను గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మే మొదటి తారీఖున ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దెశాల్లో ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. మే1వ తేదీ ని అమెరికాలో “‘Loyalty Day” గా దేశ స్వేచ్చ, వారసత్వాలను గుర్తించిన రోజుగా జరుపుకుంటారు. మే1వ తేదీన అనేక దేశాలు సెలవుదినాన్ని ప్రకటించి, కార్మికుల హక్కులు, వారి త్యాగాలు, సమకాలీన పరిస్థితుల్లో కార్మికుల స్థితిగతులు వంటి వాటిని చర్చించుకుంటూ చేసుకొనే. ‘ఒక పండగ’గా మారింది మేడే.

పనికి ఒక నిర్ణీతసమయాన్ని కేటాయించుకోవడం వల్ల ఆ సమయంలో లక్ష్యాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తుంటాం. అలా పనిచేయడానికి తగిన జీతం కూడా తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. యంత్రాలను కనిపెట్టకముందు చేసే పనికీ, అవి వచ్చిన తర్వాత చేస్తున్న పనికీ మధ్య ఎంతో వ్యత్సాసం కనిపిస్తుంది. పని సులభంగా కావడంతో పాటు, వేగవంతంగా జరుగుతుంది. నిర్లీతకాలానికి చేసే పనికి నిర్ణీతమైన జీతాన్ని కూడా ముందుగానే నిర్ణయిస్తున్నారు. దీనివల్ల యజమానికీ, శ్రామికునికీ మధ్య సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇరువురు సక్రమంగా ఉన్నంతవరకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. కానీ, వీరిలో ఎవరైనా తమ నిర్ణయానికి కట్టుబడకుండా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. పనికి తగన వేతనం ఇవ్వకపోయినా, వేతనానికి తగిన పనిచేయకపోయినా సమస్యలు మొదలవుతాయి. ఒక వేళ అదనంగా పనిచేస్తే, దానికి కూడా ఒక నియమం ప్రకారం వేతనాన్ని చెల్లించాలనే ఒప్పందం ఉంటుంది. పారిశ్రామిక యుగానికి ముందు ఇటువంటి ఒప్పందాలు పెద్దగా ఉండేవికాదు. అంటే అవి అమలు అయ్యేవికాదు. అందువల్ల శ్రామికునికీ- యజమానికీ మధ్య నిరంతరం సంఘర్షణలు జరుగుతుండేవి. పారిశ్రామిక విప్లవం తర్వాత యజమానుల్లోని ఫ్యూడల్‌ స్వభావం వల్ల శ్రమదోపిడీ మరింతగా బయటపడింది. దీనివల్ల కార్మికులు సంఘాలు “స్థాపించడం, కొన్ని ఒప్పందాలు జరగడం, వాటిని యాజమాన్యాలు అమలు “వేయకపోవడం వంటి వాటి వల్ల నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. కేవలం యాజమాన్యానికి చెందిన కుటుంబ సభ్యులంతా సుఖాల్లో _ తేలుతుంటే, _ కార్మికవర్గం శ్రమదోపిడికి గురవుతున్నట్లు భావించేవారు.ఈ నేపథ్యాన్ని చూస్తున్నప్పుడు ఒక తెలుగు కవి ఆత్రేయ వర్ణించిన పాట గుర్తుకొస్తుంది.

“కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దాన
బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరొ మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు వచ్చి నీకు చేరెను తెలుసుకో” అన్నారు సినీ కవి.

ప్రపంచమంతా వర్గస్వభావాన్ని ప్రతిబింబిస్తుందనే భావనతోనే కారల్‌ మార్క్స్‌ (1818-1883) “కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో” 1848లో వచ్చింది. దీనిలో శ్రమదోపిడీకి సంబంధించిన భావనలు ఎంతో వివరంగా ఉన్నాయి. దీనితో పాటు కార్మికుల ఐక్యత గురించి ప్రబోధాత్మకమైన వివరణలు ఉన్నాయి. ప్రపంచకార్మికులారా… ఏకంకండి.” “పోరాడితే పోయేదేమిలేదు బానిస సంకెళ్లు తప్ప!” వంటి వాక్యాలు కార్మికులకు నినాదాలయ్యాయి. మరొకవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ పనులు చేసేవాళ్ళకు నిర్ణీతమైన సమయాన్ని నిర్ణయించకుండా యజమానుల దయాదాక్షిణ్యాలపై పనిచేయించుకోవడం వల్ల కార్మికులు విపరీతంగా శ్రమదోపిడీకి గురయ్యేవారు. కొన్ని దేశాల్లో అయితే రోజుకి 16 నుండి 20 గంటలవరకు కార్మికుల చేత పనిచేయించుకొనేవారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు

“థమబజీవే జగతికి మూలం
చెమటోడ్చక జరగదు కాలం
రేపన్నది మనదే నేస్తం
థమశక్తే విశ్వ సమస్తం”

అని నమ్మి పోరాటాలు చేయడం ప్రారంభించారు. మొదట అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కార్మికుల పనిచేసే సమయాల్ని నిర్ణయించాలని ఉద్యమం ప్రారంభమైంది. అది కేవలం ఒక్క అమెరికాకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. కార్మికుల కోర్కెలు న్యాయసమ్మతమైనవని నమ్మిన వాళ్ళెంతోమంది ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. చాలా చోట్ల పరిశ్రమలను స్తంభింప చేశారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం 1839 సంవత్సరంలో రోజుకు 10 గంటల పనిదినాన్నీ శాసనబద్దం చేసింది. కానీ, ఈ శాసనాన్ని అమలు చేయకపోవడం, కార్మికులను తొలగించడం, వేదించం వంటి చర్యలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యమం సాధించిన ఫలితాల వల్ల ఇతర దేశాల్లో కూడా కార్మికుల మధ్య ఐక్యత పెరిగింది. వివిధ దేశాల్లో ఈ దిశగా ఉద్యమాలు విస్తృతమయ్యాయి.

చికాగో నగరంలో 1886 మే 1 వ తేదీన ‘హే’ మార్కెట్‌ లో జరిగిన ఆందోళనల్లో _ లక్షలాదిమంది కార్మికులు సమ్మెచేయడం, పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, కొంతమంది చనిపోవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఆయ ఆందోళనలో మరణించిన కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి యేడాదీ మే 1 వతేదీని ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’గా జరుపుకుంటున్నారు.

కార్మికుల పని గంటలు రోజుకు 8 గంటలుగా ప్రపంచంలోని సుమారుగా అన్నీ దేశాలూ అమలు చేస్తున్నా. ఈ నియమాలు సంఘటిత కార్మిక వర్గానికి మాత్రమే వర్తిస్తున్నాయి. నిర్లీత పనిగంటలు మాత్రమే కాకుండా, ఆరోగ్య భీమా, పనికి తగిన జీతం, స్తీ పురుషులకి సామాన వేతనం లాంటి ఎన్నో అంశాల మీద కూడా కార్మికులకీ. యాజమాన్యాల మధ్య ఘర్షణ చాలా రంగాలలో జరుగుతూనే ఉందీ. కార్మికులు సంఘటితం అయ్యే ప్రయత్నాలను అమెజాన్‌, స్టార్బక్స్‌ లాంటి అంతర్జాతీయ ఉనికి ఉన్న సంస్థలు ప్రతిఘటించడమే కాకుండా అలాంటి ప్రయత్నం చేసే కార్మికులను విధులలోంచి తొలగించడంతో పాటు ఎన్నో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయ సంస్థలలో పనిచేసే ఐటి రంగ నిపుణులు కాలపరిమితి లేకుండా పనిచేయడం చూస్తాం. ఉద్యోగ భద్రత లేని రంగాలలో యాజమాన్యాలదే పై చేయిగా ఉండడం కార్మికుల హక్కుల పరిరక్ష। ణకి అనువుకాని విషయం. కార్మికులు సంఘటితం అయ్యే విషయంలో ప్రపంచ వ్యాప్తం గా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. సోషలిస్ట్‌ దేశాలకీ, పెట్టుబడి దారీ విధానంలో నడిచే అమెరికా లాంటి దేశాలకీ చాలా తేడా కనిపిస్తుంది. ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న భారత దేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణకి ఎటువంటి విధానాలు అమలులోకి వస్తాయో వేచిచూడాలి.

హుందాగా పనిచేసే వాతావరణంతో పాటు జీవితాన్ని ఆస్వాదించగల అవకాశం శ్రమజీవులందరికీ దక్కాలని ఆశిద్దాం. శ్రమజీవుల చైతన్యం వారి హక్కుల పరిరక్షణకి శ్రీరామ రక్ష.



4.7/5 - (3 votes)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles