9.8 C
New York
Monday, November 25, 2024

అమృత భారతికి ఆశాంజలి

– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు

    స్వతంత్ర భారతికి 75 వసంతాలు నిండిన సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న భారతీయులందరికి శుభాభినందనలు. ఒకసారి 75 సంవత్సరాల పంచాంగం సింహావలోకనం చేసుకుంటే సాధించిన అపారమైన అభివృద్ది కరతలామకంగా కనిపిస్తుంది. అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకి దిక్సూచిగా, మార్గదర్శిగా నిలిచే పథంలో భారత్‌ మంచి ప్రగతిని సాధించింది. ఎన్నో రంగాలలో వురోగమించి అంతర్జాతీయ ప్రగతి వటంలో తళుక్కుమనేలా పురోగమిస్తోంది. 200 సంవత్సరాలు దాస్యంలో మగ్గిన భారతావనికి స్వయం పాలనలో 75 సంవత్సరాలు వురోగమనాన్ని కొలవడానికి అంత పెద్ద వ్యవధి కాదు. గడచిన 75 సంవత్సరాలలో ఎన్నో రంగాలలో సాధించిన అభివృద్దికి గర్వపడుతూ, ప్రగతి యానంలో ఎదురైన అవరోధాలని నెమరు. వేసుకుని, భవిష్యత్తులో వాటిని ఎదుర్కొనే ప్రణాళికలు వేసుకునే తత్వం అవసరం ఎంతైనా ఉంది. ప్రగతి నిరంతరం సాగే ప్రయాణం. గమ్యం కాదు. 250 సంవత్సరాలకి పైబడి ఏర్పడ్డ అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం సాధించిన ప్రగతి తక్కువ కాదు. ముఖ్యంగా సర్వ మానవ సమానత్వాన్ని బోధించి మార్గ దర్శకం చేసిన మహాత్మా గాంధి, అంబేత్కర్‌ లాంటి మహనీయులు ఉండడం భారత దేశానికి కలిగిన అదృష్టం.

    భారతావని 75 సంవత్సరాల అవూర్వ, అపురూప ప్రగతి వథంలో పాలుపంచుకున్న వారికి, నడిపించిన నాయకులకి నీరాజనాలు తప్పక సమర్పించాలి. 75 సంవత్సరాలలో జరిగిన అభివృద్ది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క దశాబ్దంలోనో జరిగినది కాదన్నది సత్యం. ఎప్పుడు, ఎంత ఏ ఏ రంగాలలో అభివృద్ది జరిగిందనే గణాంకాలు పొందటం అంతకష్టం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో రూపొందించిన విధానాలు,
    వ్యవస్థలు, నంస్థలు భారత ప్రగతికి బీజం వేశాయనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అన్ని అగ్ర రాజ్యాలలోనూ భారతీయులు మంచి ఉద్యోగాలలో విరాజిల్లుతున్నారంటే, ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. లాంటి ఉన్నత విద్యా సంస్థల స్థాపన, విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం, అందరకి అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విద్యా సంస్థల స్టాపన కొన్ని ముఖ్య కారణాలు. వీటితో పాటు, శాంతి కాముక, లౌకిక సమాజంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందడం తక్కువ విషయం కాదు. మనతో పాటే స్వాతంత్ర్యం సాధించిన పొరుగు దేశం గడించిన ప్రగతి, అంతర్జాతీయంగా సాధించిన గుర్తింపుతో పోల్చుకుంటే భారత దేశ వురోగతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సైద్దాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా, వాస్తవాన్ని అంగీకరించే వారెవరికైనా
    నిజాంకాలు ఈ సత్యాన్ని నిరూపిస్తాయి. 1950 ప్రాంతంలో నాటిన ఆదర్శ, పురోగామి, సమానత్వ విత్తనాలు మొలకెత్తి, పంటనిచ్చి, విస్ఫృతి చెంది నిరంతరం ఫలితాలను ఇచ్చే అక్షయ పాత్రలుగా వెలుగొందడం కళ్ళముందు కనిపించే సత్యం. ఆ విత్తనాలు నాటినవారు నెహ్రూ, గాంధీ కుటుంబ
    సభ్యులు కావచ్చు. వారు వామపక్ష వాద సానుభూతి పరులు కావచ్చు. ప్రగతికి రాజకీయ రంగులతో వనిలేదు. పురోగతికి పార్టీ జెండాల ఆసరా అవసరం లేదు. చరిత్రని వక్రీకరించకుండా భారతదేశం సాధించిన అభివృద్దిలో పాలువపంచుకున్నవారిని స్మరించుకోవడం సంస్కారం, అది
    సనాతన ధర్మ నియమం, రామాయణ సందేశం.

    గాంధీ, నెహ్రూ వంశానికి వెలుపల నుండి ప్రాధేయపడకుండా వచ్చిన పదవిని చేపట్టి క్లిష్ట భారతిని “సంక్షేమ” భారతిగా రూపొందించిన ప్రతిభామూర్తి శీ పి.వి నరసింహారావు గారిని తలవని, సముచితంగా గౌరవించని అమృతోత్సవం స్వకుచ మర్దనం లాంటిది. చేసిన మేలు మరిచే జాతి జీవం లేని జవం లాంటిది. వారసత్వం, ఓటు బ్యాంక్‌, నంస్టాగత మద్దతు లేని పి. వి.కి జాతి రుణపడి ఉంది. ఈ భారత రత్నాన్ని అమృతోత్సవాల సందర్భంగా గుర్తించడం ఎంతైనా అవసరం.

    గతంలో జరిగిన ప్రగతిని బేరీజు వేసుకుంటూ, భవిష్యత్తు ప్రణాళికని రూపొందించగల నైవుణ్యం ఉన్న వారే నాయకులు. ప్రగతి మాత్రమే కాక, లోటు పొట్లని గుర్తించి సవరించుకోగల విజ్ఞత ఉన్నవారే మహా నాయకులు.

    “మౌన ముని” గా ముద్ర వేయబడిన ప్రధాని విశ్రమించి సుమారు ఎనిమిది సంవత్సరాలు అయింది. ఈ ఎనిమిది సంవత్సరాలలో జరిగిన నిజమైన అభివృద్ది, నినాదాల వెనుక దాగిన నిష్కియాపరత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశం భారత ప్రజల ముందు ఉంది. వాగ్దానాలను నెరవేర్చడంలో సఫలం అయ్యారా లేక వాగ్దానాలకే పరిమితం అయ్యారా అన్నది రోజు వారి కూలీతో జీవితం గడీపే అధిక జనం నిర్ణయించగల పరిస్టితి లేదు. వారు ఎన్నికల సమయంలో వచ్చే “ఈనాము”లకు గులాములు. కనీస అవసరాలు తీరి, ఆలోచించగల జాగృతిగల వారు ఈ విషయాల మీద ఆలోచించి వది మందిని జాగృతం చేయవలసిన అవసరం ఉంది.

    ఏ ప్రజాస్వామిక దేశమైనా ప్రగతి వథంలో మనుగడ సాగించాలంటే వటిష్టమైన, స్వయంతవ్రతివత్తి గల, పారదర్శకంగా, జవాబుదారీతో, వ్యవహరించే వ్యవస్థలు, సంస్థలు అవనరం. రాజకీయ వ్యవన్దలో నైతిక విలువలని వునరుద్దరించి పరిరక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన వ్యానం ప్రకారం, 2019 లో పార్లమెంటుకి ఎన్నికైన 539 సభ్యులలో 233 మందికి నేర చరిత్ర ఉంది. ఈ సంఖ్య 2009 గణాంకాలతో పోలిస్తే 44శాతం ఎక్కువ. ఇకరాష్ట్ర చట్ట సభల సంగతి ఊహించవచ్చు. నేర చరిత్ర ఉన్నవారు సామాన్య ప్రజల జీవితాలని ప్రభావితం చేసే చట్టాలు చేస్తూ ఉంటే ఆ చట్టాలకి విలువ ఏముంటుంది? అనలు చట్టం మీద గౌరవం లేని వారికి చట్ట నభలకి పోటీ చేసే అర్హత ఉండాలా? చట్టనభలకి, ఎన్నికైన వారికి చట్టం చుట్టంగా మారి, వారికి ప్రత్యేక హక్కులు కల్పిస్తోంటే, కేనుల నుంచి రక్షించుకోడానికి నేరస్తులు నేతలుగా మారడంలో ఆశ్చర్యం ఏముంది? పలు కేసులు చిరకాలంగా ఎదుర్కొంటున్న నేరస్తులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అధికారం చెలాయిస్తూ.
    నేర సామ్రాజ్యాలని విస్తరిస్తోంటే, చట్టాలకి, చట్టనభలకి విలువ ఏముంటుంది ? ఆర్దిక నేరస్తుల విచారణ నత్వరం, ఒక్క సంవత్సరంలోనే వూర్తయ్యేలా వ్రత్యేక కోర్టులు నెలకొల్పుతామన్న ఉద్దాటన మరో నినాదంగానే మిగిలినట్టుగా అనిపిస్తోంది. రాజకీయ వ్యవస్థ మరింత దిగజారితే
    ఆ వ్రభావం సమాజంలోని అన్ని వ్యవస్థలమీద, అన్ని వర్గాల మీద వడుతుందన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ వ్యవస్థని ప్రక్షాళణం చేసేదెవరు? బుద్ద జీవులా? విసిగెత్తిన సామాన్య జీవులా? శ్రీలంకలో జరుగుతున్న వరిణామాలు మితిమీరిన రాజకీయ, ఆర్దిక అవినీతి పేరుకుపోతున్న దేశాలకి కనువివు కలిగించాలి.

    వ్యక్తులకి గానీ, సంస్థలకి గానీ అన్యాయం జరిగినవ్పుడు న్యాయస్టానాలని ఆశ్రయించడం రివాజు. రాజకీయ వదవులలో ఉన్న వారు కేసుల విచారణకి కోర్టుకి హాజరు కాక పోయినా, న్యాయస్థానాల తీర్పుని ధిక్కరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేని స్థితిలో న్యాయ వ్యవస్థ ఉండడం బాధాకరం. రాజకీయ పదవులు నేరస్తులకి రక్షణ కవచాలు కాకుండా, వారిమీద ఉన్నకేనులని నత్వరం, నిర్దిష్ట వ్యవధిలో విచారణ చేసి శిక్షలు అమలు జరిగేలా చూసే బాధ్యత న్యాయవ్యవస్థ మీద, ప్రధాన న్యాయమూర్తుల మీద ఉంది. కోర్టు ధిక్కరణ కేసులలో వడే శిక్షలని, అమలు చేయడానికి ఒక వ్రత్యేకపోలీసు బలగం ఉండడం ఎంతో అవసరం.

    ప్రభుత్వంలో _ భాగమైన శానన శాఖ నిర్వహించే రాజకీయ నాయకత్వం మారుతూ ఉంటుంది కానీ కార్యనిర్వాహక శాఖ నిరంతరంగా ఉంటుంది. కార్యనిర్వాహక శాఖలో పనిచేసే ఉన్నతాధికారులు రాజ్యాంగానికి కట్టుబడి, నిర్భయంగా, నిజాయితీగా పనిచేయాలి. అలా వనిచేసే అధికారులు లేకపోలేదు. ప్రభావవంతమైన శాఖలలో అలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది.ఐ.ఏ.ఎస్‌. అధికారులకి ఉద్యోగ భద్రత ఉంది. రాజకీయ నాయకులు వారిని అవాంఛనీయ వ్రదేశాలకి బదిలీ చేయవచ్చు గానీ ఉద్యోగంలోంచి తొలగించలేరు. కానీ, ఐ.ఏ.ఎస్‌.లు ఎన్నో వ్రలోభాలకీ, వత్తిళ్లకి తలోగ్గడం ఎక్కువగా చూస్తున్నాం. దురదృష్ట వశాత్తూ, మంత్రుల వత్తిడితో చేసిన నిర్ణయాలకి న్యాయస్థానాలు కొన్ని రాష్ట్రాలలో కొన్ని శాఖల అధికారులకి జైలు శిక్షసయితం. విధించడం ఈ మధ్య చూస్తున్నాం. ఈ దుస్థితి పూర్తిగా సయం కృతమే. ఈ మధ్య ఒక టీవీ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక మాజీ వ్రధాన కార్యదర్శి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో అయినా ఐ.ఏ.ఎస్‌. అధికారుల లో కనీసం ఇరవై శాతం మంది నియమాలకి లోబడి, మంత్రుల వత్తిడిని వ్రతిఘటించ గలిగితే నాయకుల ఆగడాలకి అడ్డుకట్ట వడుతుందని, ఆ వ్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు. ఎంతో కష్టవడి ప్రవేశ పరీక్షలలో నెగ్గి, ఉన్నత ఉద్యోగాలు, నంపాొదించిన ఐ.ఏ.ఎస్‌.లు ఆదర్శాలతో కాక, అధికారం, హోదాల వెంట వడడం దురదృష్టం. నిజానికి, పెద్దగా జీతంరాని ఉద్యోగానికి అహర్నిశలూ ఎందుకు కష్టపడతారు? ఆదర్శవంతమైన ప్రజాసేవ చేయడానికేనని అందరూ చెబుతారు. ఉద్యోగంలోకి చేరాక ఆదర్శాలు అవనరాలకి, హోదాకి తలోగ్గుతాయా? ఐ.ఏ.ఎస్‌.ల ఎంపిక విధానం సమాజ హితం కోరేవారు, సమాజ సేవాతత్పరత కలవారిని గుర్తించే విధంగా లేదు. వివిధ అంశాల గురించిన సమాచారం, కొన్ని విషయాల మీద కొంత అవగాన ప్రాతివదికన ఎంపిక జరుగుతుంది. వ్యక్తిత్వ వరీక్ష మౌఖిక పరీక్షలో పరిమితంగా ఉంటుంది. సమాజ సేవాతత్పరతకి ప్రాముఖ్యం ఉండదు. చదువుకునే రోజుల నుంచి సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనడం ఐ.ఏ.ఎస్‌. ల నియామకాలకి ఒక ప్రాతివదికగా ఉంటే బాగుంటుంది. నిరూపించగల, ప్రభావవంతమైన సమాజ సేవ చేసిన వారికి వ్రవేశ పరీక్షలో కొన్ని మార్కులు కేటాయిస్తే సేవాతాత్సరత గల వ్యక్తులు ఐ.ఏ.ఎస్‌. లు గా వచ్చే
    అవకాశం ఎక్కువ ఉంటుంది.

    ప్రజాస్వామ్య వ్యవస్థ వటిష్టం గా ఉండడానికి నిస్పాక్షికంగా, స్వేచ్చగా వ్యవహరించగల వార్తా వత్రికలు, ప్రసార మాధ్యమాలు చాలా అవసరం. నుమారు మూడు దశాబ్దాల వూర్వం వరకు, ప్రభుత్వ అధీనంలో నడిచే దూరదర్శన్‌ ద్వారా మాత్రమే వార్తలు ప్రజలకి అందేవి. అందులో నిస్సాక్షికతకి ఎక్కువ ఆస్కారం ఉండేది కాదు. ఇవ్పుడు ప్రైవేట్‌ రంగంలో నడిచే ప్రసారమాధ్యమాలు పార్టీల వారీగా విడిపోవడం, పార్టీలకి అనుబంధంగా నడిచే కొన్ని ఛానెల్స్‌ ఉండడంతో రంగులు లేని వార్తలు, విశ్లేషణలు కొరవడుతున్నాయి.

    దురదృష్ట వశాత్తు, అగ్ర రాజ్యంతో సహా, చాలా ప్రజాస్వామ్య దేశాల పాలకులలో నిరంకుశ ధోరణులు పెరుగుతున్నాయి. అలాంటి వారికి మద్దతు ఇచ్చే ప్రజల సంఖ్య కూడా పెరుగుతోంది. అలాగే, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యం అవడం కూడా వ్రపంచ వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవి పొంచి ఉన్న ప్రమాద సూచికలు.

    దేశ నర్వతోముఖాభివృద్ధికి యువత నడుంకట్టడం ఎంతైనా అవసరం. భారత జనాభాలో యువకుల నంభఖ్య ఎక్కువ. హేతుబద్ధంగా ఆలోచించడం అలవరచుకుని, ప్రతీ అంశాన్ని నిశితంగా విశ్లేషించి అభిప్రాయాలు ఏర్పరుచుకోవాలి. భారత యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి, లోక నాయకులుగా ప్రకాశించాలి. అదే భారత మాతకి ఇవ్వగల నిజ నీరాజనం.

    5/5 - (1 vote)
    Prakasika
    Author: Prakasika

    Related Articles

    Latest Articles