కన్యాశుల్కం నాటకంలో
ఆనాటి దేశ రాజకీయాలు
– తొలి సంచిక
దేవుడికి వందనం అనే స్థితి నుంచి, దేశానికి వందనం అనే స్థాయికి భారతీయులను మళ్లించిన వాడు బంకించంద్ర చటర్జీ. దేశమంటే మట్టికాదనీ, మనుషులనీ అంటూ, తన దేశభక్తి గీతంద్వారా స్వదేశీ భావనను రగిలించి తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన వాడు గురజాడ.
1905లో మొత్తం దేశాన్ని కదిలించి వేసిన వందేమాతరం
ఉద్యమంలోంచే స్వదేశీ ఉద్యమం పుట్టింది. “జల్దుకొని కళలెల్ల నేర్చుకు/దేశి సరుకులు నించవోయి” అనే వాక్యాలు గురజాడ స్వదేశీ ఉద్యమానికి తార్కాణాలు.
“నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వొదులుకోలేను” అని తన డైరీలో 1911 మార్చి, 27న గురజాడ రాసుకొన్న మాటలు ఆయనను నవయుగ నిర్మాతగా భాసిల్లచేశాయి.
“విద్యలనెరయ నించిన యాంగిలేయులు” (1912) అనీ, “కన్నుకానని వస్తుత్త్వము
కాంచనేర్పరు లింగిరీజులు; కల్ల నొల్లరు; వారి విద్యల కరచి సత్యము నెరసితిన్” అనీ
ఆంగ్లేయులను మెచ్చినప్పటికీ, ఆంగ్లేయ సంస్కృతి పట్ల గురజాడ విముఖతే ప్రదర్శించారు.
“పాశ్చాత్య నాగరికత కొన్ని అంధవిశ్వాసాలను పోగొట్టుతున్న మాట యదార్థమే
అయినప్పటికీ, అది ప్రబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. ఇది సంపూర్ణ
స్వాతంత్ర్యము కాదు, నామమాత్రమైనది.” ( గురజాడ డైరీ1901-, పుట215/సం:
అవసరాల).
“శతాబ్దాల తరబడి రాజకీయ బానిసత్వం వలన మరుగు పడి ఉన్న ఉదాత్త జాతీయ
మనః ప్రవృత్తిని విద్యావంతులైన హిందువులకు బహిర్గతం చేసి, వారిలో ప్రభావానికి
లోనౌతున్న వ్యక్తులలో అట్టి వృత్తినే కలిగించటానికే ఇది దోహద పడును” (గోమఠం
శ్రీనివాసాచార్యులు గారి హరిశ్చంద్ర నాటకం ఇంగ్లీషు అనువాదానికి గురజాడ పీఠిక)
స్వదేశీ ఉద్యమం గురించి చెప్పిన ఈ వాక్యాలు గురజాడ వారి నిబద్ధతను చాటుతాయి.
గురజాడ స్వహస్తంతో వ్రాసిన ‘దేశభక్తి’ గీతం చిత్తుప్రతిలో “నిన్నవచ్చా రింగిలీషులు/
మొన్నవచ్చిరి ముసల్మను; లటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి, వేరులు