7.2 C
New York
Monday, November 25, 2024

నీలగిరి పాటల సౌందర్యం

నీలగిరి పాటల సౌందర్యం

డా. గుమ్మా సాంబశివరావు , Gumma Sambashivarao
డా. గుమ్మా సాంబశివరావు , Gumma Sambashivarao

– తొలి సంచిక

ఆధునికాంధ్ర సాహిత్యానికి యుగకర్తగా ప్రసిద్ధిపొందిన
గురజాడ అప్పారావు పుట్టి 158 సంవత్సరాలైనా
ఇప్పటికీ ఆంధ్రసాహిత్య ప్రపంచంలో ఆయన సాహిత్యాన్ని
గూర్చి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గోష్ఠుల నిర్వహణ
సాగుతూనే ఉంది. గురజాడ అప్పారావు మహాకావ్యాలు
రాయకపోయినా మానవతా దృక్పథాన్ని ప్రబోధించాడు.
సంస్కరణ దృక్పథాన్ని వెల్లడించారు. ఆంగ్లాంధ్ర రచనలు
సాగించాడు. గురజాడ దేశభక్తి గీతం విశ్వభక్తి గీతంగా
ప్రశంసలందుకొంది.
గురజాడ బహుముఖ ప్రతిభావంతుడనటానికి ఆయన
రచనలు సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రారంభదశలో పద్యాలు రచించాడు. ఆంగ్ల రచనలు
గావించాడు. అయితే సామాజిక అవసరాన్ని గుర్తించి తన రచనాపథాన్ని మార్చుకొని
సాహిత్యలోకానికి మేలు చేశాడు. కథాగేయరచనం, కథానికా రచనం, ముత్యాల సరాల
సృష్టి, వ్యావహారికంలో నాటక రచన గురజాడను మహారచయితగా నిలబెట్టాయి.
ఆంగ్లగ్రంథాలనెన్నిటినో చదివిన గురజాడ పాశ్చాత్య సాహిత్య ధోరణులతో పరిచయం
పెంచుకొన్నాడు. కొత్త ఆలోచనలతో రచనలు వెల్లడించాడు.
ప్రజల దగ్గరకు సాహిత్యం వెళ్ళినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించిన
గురజాడ ప్రజలభాషలో రచనలు చేశాడు. గేయరూపంలో సందేశాన్ని అందిస్తే అది
త్వరగా ప్రజల్ని చేరుతుందని గేయరచన గావించాడు. సాహిత్య ప్రక్రియల్లో నాటకానికున్న
బలాన్ని గుర్తించి వ్యావహారికంలో, మాండలికంలో ‘కన్యాశుల్కము’ నాటకాన్ని
రచించాడు. ఆనాటి సమాజాన్ని ప్రతిబింబింపచేశాడు. గురజాడలో అద్భుతమైన భావుకత,
సంగీతవైదుష్యం ఉన్నదని చెప్పటానికి ఆయన రచించిన నీలగిరి పాటలు నిలువెత్తు
నిదర్శనాలు. గురజాడ నీలగిరి పాటల సౌందర్యాన్ని వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
విజయనగర సంస్థానం మీద దాయాదులు తెచ్చిన దావాని నడిపించటానికి, సంస్థాన
సంబంధమైన ఇతర విషయాల్ని పర్యవేక్షించటానికి శ్రీ అలక రాజేశ్వరీ మహారాణీ వారి
కుమార్తె మహారాణీ అప్పలకొండయాంబ సహాయం చేస్తూ ఉండేది. అలక రాజేశ్వరీ
మహారాణి వారు మరణించిన తర్వాత భారమంతా అప్పలకొండయాంబమీద పడింది.
గురజాడ అప్పారావుగారు మహారాణీ అప్పలకొండయాంబ ఆంతరంగిక కార్యదర్శిగా

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles