గురజాడ సాహిత్యంలో దార్శనికత
-తొలి సంచిక
ఆధునిక కవిత్వానికి అడుగుజాడ గురజాడ. ఈయన
కవిత్వం రసజ్ఞతతో కూడిన దార్శనిక శక్తితో త్రికాల
యుక్తమై రక్తికడుతూ అలరారుతుంది. అలతి అలతి పదాలతో
లోతైన భావాలను పండించిన సాహిత్య విప్లవానికి వెన్నుదన్నై
నిలిచిన నవయుగ వైతాళికుడు. వాడుక భాషకు వన్నె
చిన్నెలద్దిన, మెత్తని తెలుగుపలుకులకు వెలుగులద్దిన విశిష్ట
కవితాస్రష్ట. సామాజిక రుగ్మతలను చర్మచక్షువులతో మాత్రమే
కాకుండా రసచక్షువులతోను తిలకించి ఆత్మావలోకనంతో
అక్షరమై సాగిన వాడు. ఆస్తికతను, నాస్తికతను హేతుదృష్టితో
పరిశీలించి సహేతుకమైన కవిత్వాన్ని అందించిన ఆధునికుడు.
వీరి సాహిత్యంలో కవి విషయప్రపంచములో మునకలేచిన అనుభవం కనిపిస్తుంది.
క్రాంతదర్శిగా, దార్శనికునిగా, వినూత్నరీతిలో పయనించి, చేపట్టిన సాహిత్య ప్రక్రియలన్నిటిని అద్భుతంగా పండించిన వైనం కవిపండితుల్లో వినిపిస్తుంది. వీరి కవిత్వంలో పదప్రయోగం సంక్లిష్టతకంటే విశిష్టతకే పెద్దపీట వేయబడినది. వీరి
కలంనుండి జాలువారిన నాటకము, గేయము, వ్యాసము, కథానిక సామాజిక
సంస్కరణలకు ఊపిరిలూదుతూ రసపుష్టి, చమత్కృతులతో సాగిపోయిన తీరు
గమనించవచ్చును. ఈయన దార్శనికతే ఈయన సాహిత్యానికి సజీవతను
సంతరించిపెట్టింది. కందుకూరి వీరేశలింగం సాంఘిక విప్లవాన్ని, గిడుగురామ్మూర్తి
భాషా విప్లవాన్ని అవగాహన చేసుకుని తనదైన ముద్రతో సాహిత్య విప్లవాన్ని సృష్టించిన
ద్రష్ట. అస్పృశ్యంగా పడివున్న వ్యావహారిక భాషకు అందాలద్ది అందలమెక్కించిన మేధావి.
ఈయన కవిత్వం పదునెక్కడానికి స్పష్టత, సూటిదనం, భావాల్లో మేళవింపజేస్తూ
నిర్భయత్వంతో కూడిన వ్యక్తీకరణకు వేగుచుక్కై నిలిచాడు. కవిత్వం భోగవస్తువు కాదు,
ఉపయోగవస్తువుగా భావిస్తూ, సాహిత్యపు నిర్బంధాలను వెక్కిరిస్తూ, సంక్షుభిత జీవితపు
నిశ్శబ్ద ఘోషలను వినిపించాడు.
గురజాడ ఆంగ్ల సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయటం వలన కొత్తగాలిని
పీల్చుకున్నాడు, సరికొత్త చైతన్యాన్ని తనలో నింపుకోగలిగాడు. ఆ ఫలితంగానే 8921 లో
కన్యాశుల్కం నాటకము 1910లో ముత్యాలసరాలు రచనలు చేశాడు. ఆస్తికతను,
నాస్తికతను హేతుదృష్టితో పరిశీలించి సహేతుకమైన కవిత్వాన్ని అందించిన ఆధునికుడు.
‘కొత్తపాతల మేలు కలయిక / కొమ్మెరుంగుల జిమ్మగా’ తేటైన మాటలతో ముత్యాల
సరములు గేయాల్ని’ 1910, జూలైలో రాశారు. ఆంగ్ల పరిజ్ఞానమున్న గురజాడ లోతుగా
ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేసి తెలుసుకున్న సత్యం ‘కన్నుకానని వస్తుత్వము/