9.8 C
New York
Monday, November 25, 2024

పొగడ్తల పురాణం

ఒంటికంటివాడు. తనను వర్ణించమన్నాడు కవిని. కవి రాజునుఎగాదిగాచూసి ఇలా పద్యం
చెప్పాడు.
“అన్నాతి గూడ హరుడవు
అన్నాతిని గూడ కున్ననసుర గురుండౌ
అన్నా! తిరుమల రాయా!
కన్నొక్కటి లేక యున్న కౌరవపతివే”
ఓ! తిరుమల రాయా! నువ్వు భార్యతో ఉంటే ముక్కంటివి. ఒంటరిగా ఉంటే
శుక్రాచార్యుడివి. ఆ ఒక్క కన్నూ లేకపోతే ధృతరాష్ట్రుడివి” అని భావం. ఒంటికన్నువాడనే
హేళన అర్థం కాని రాజు తనను గొప్ప వారితో పోల్చినందుకు ఆనందించి కవిని
సత్కరించాడు. ఒక్కోసారి ఒకర్ని పొగిడితే ఇంకొకరికి కోపంవస్తుంది. సద్యఃస్ఫూర్తితో
అలాంటి క్లిష్టపరిస్థితుల్ని అధిగమించిన కవులూ ఉన్నారు. శ్రీనాథుడు కొండవీటి
పెదకోమటి రెడ్డి ఆస్థాన విద్యాధికారి. సర్వజ్ఞుడనే బిరుదుంది. అతడికి ప్రబలవిరోధి అయిన
రాచకొండ సింగభూపాలుడికి అదే బిరుదుంది. శ్రీనాథుడు ఒకసారి సంగభూపాలుడి
కొలువుకు వెళ్లాడు. ఆ రాజును ప్రశంసించాడు.
“సర్వజ్ఞ నామధేయము
శర్వునకే, రావుసింగజనపాలునకే
యుర్విం జెల్లును, తక్కొరు
సర్వజ్ఞండనుట కుక్క సామజమనుటే”
అని ప్రశంసించేసరికి సింగభూపాలుడు ఉబ్బితబ్బిబైఘనసన్మానం చేసిపంపించాడట.
పద్యభావం ఏమిటంటే – సర్వజ్ఞుడనే పేరు శివుడికి, సింగభూపాలుడికి భూమ్మీద
చెల్లుతుంది. ఇంకెవరినైనా సర్వజ్ఞుడంటే అది కుక్కను ఏనుగనటమే. శ్రీనాథుడు కొండవీడు
వెళ్లాక అప్పటికే ఈ వైనం విన్నవేమారెడ్డి ఆగ్రహించాడు. శ్రీనాథుడు నవ్వుతూ “మహారాజా!
సింగభూపాలుణ్ని నేను పొగడలేదు. తిట్టిన పద్యం అది. ఆ రాజుకు అర్థంకాలేదు. సర్వజ్ఞ
నామధేయము శర్వునకే – రావుసింగ జనపాలునకేయుర్విం జెల్లును?” అని ‘‘కే’ ను
విడదీసి చదివి సర్వజ్ఞుడు శివుడేగాని సింగభూపాలుడికి ఏ భూమ్మీద చెల్లుతుంది?
ఇతరుల్ని సర్వజ్ఞడనటం కుక్కను ఏనుగనటమే! అని అర్థం చెప్పేసరికి వేమారెడ్డి
మెచ్చుకుంటూ శ్రీనాథుణ్ని సత్కరించాడు. ఇలాంటి ఆపద్ధర్మస్తుతులూ, ప్రశంసలూ
సాహిత్యలోకంలో చాలా కనిపిస్తాయి.
ఏ కాలంలోనైనా ప్రశంసలు అనివార్యంగా ఉంటాయి. కింది ఉద్యోగులు పై అధికారిని
పొగుడుతారు. పనులు కావలసిన వారు నేతల్ని స్తుతిస్తారు. రచయితలు తమ పుస్తకాలు

5/5 - (2 votes)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles