హాస్య-వ్యంగ్య ప్రకాశిక
పొగడ్తల పురాణం
– తొలి సంచిక
వీపు దురద పుట్టినప్పుడు ఎవరైనా గోకుతుంటే ఎంతో
హాయిగా ఉంటుంది. అలాగే కొంతమందికి ఎవరైనా
పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. “కీర్తి కండూతి’ అన్నమాట ఉండనే ఉంది. తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనే ఉబలాటం చాలామందికి ఉంటుంది. పొగడ్త, ప్రశంస, కీర్తించడం, స్తుతించడం, శ్లాఘించడం ఇవన్నీ
స్టూలదృష్టికి ఒకటే అయినా సందర్భాన్ని బట్టి, స్థాయిని బట్టి పేర్లు మారుతుంటాయి.
పొగిడితే బుట్టలో పడనివాడెవడు? కన్యాశుల్యం
నాటకంలో అందరిమీదా మండిపడే అగ్నిహోత్రావధాన్లు “తమరేనా నులక అగ్ని
హోత్రావధాన్లుగారు? యీ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్ర వరంలో మావాళ్లనుకునేవారు. మా మేనమామ రామావధాన్లు యీ దేశబ్బోగట్టావొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తుంటారండి” అని గిరీశం అనగానే చప్పున చల్లారిపోయాడు.
మనుషులకే కాదు, దేవతలకూ పొగడ్తలు కావాలి. విష్ణువు అలంకారప్రియుడు, శివుడు
అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడుఅంటారు గాని ఆడా మగా తేడాలేకుండా
దేవుళ్లందరూ స్తోత్ర ప్రియులే. అందుకే, అష్టోత్తరాలు శతనామాలు, సహస్రనామాలు –
అపారమైన స్తోత్రవాఙ్మయం.
దేశభక్తి కవులు మాతృభూమిని పొగుడుతారు. మంచిదే. “పొగడరా నీ తల్లిభూమి
భారతిని” అన్న వాక్కు ఎప్పుడూ అనుసరణీయమే. దేవతాస్తోత్రాల్లో భక్తి, శరణాగతి,
పారమార్థిక చింతన, పశ్చాత్తాపం మొదలయినవన్నీ ఉంటాయి. దేశాన్ని ప్రస్తుతించడంలో
జాతి సంస్కృతి, చరిత్రల పట్ల గౌరవం పుట్టిన నేలపై ప్రేమ ఉంటాయి. ఎటొచ్చీ మనుషుల్ని
పొగడ్డంలోనే వస్తుంది తంటా.
పూర్వం రాజుల కొలువుల్లో “వంది మాగధులు” ఉండేవారు. “వంది” అంటే
స్తుతించేవాడని అర్థం. కవులు, పండితులు వచ్చి రాజుల్ని కీర్తిస్తే మణులు, మాన్యాలు,
అగ్రహారాలు లభించేవి.
ఒక్కోసారి స్తుతించేవారికి ఇబ్బందికర పరిస్థితులూ ఎదురయ్యేవి. ఒకసారి
తిరుమలరాయలు అనే సామంతరాజును ఒక కవి దర్శించాడు. రాజుకు కవులచేత
పొగడించుకోవాలని కోరికైతే ఉందిగాని, అందుకు తగిన అర్హతలేవీ లేవు. పైగా