ఆశ్చర్యపోతాము. ఒకవైపు
లిపిపరంగానూ, మరోవైపు శాసనం
వేయించిన రాజుపరంగానూ,
కాలంపరంగానూ సాగించిన చర్చా,
విశ్లేషణా, తీర్పు – గురజాడ
గవేషణాధిషణకి అద్దం పడతాయి.
‘ఆధునిక ఆంధ్రవచనరచన’ అనే
వ్యాసమూ గురజాడకి గల సత్యాన్వేషణ
నిబద్ధతకి దర్పణంగా నిలుస్తుంది.
విజ్ఞాన చంద్రికా మండలి వారి
ప్రచురణల గురించీ, అందునా
ప్రత్యేకించి ‘విజయనగర
సామ్రాజ్యము’ అనే నవల గురించీ – నిష్కర్షగా, నిజాయితీగా లోపాల్ని చెప్పి నిగ్గుతేల్చారు.
వ్యక్తిగా గురజాడ కష్టజీవి : చిన్నతనం నుంచీ కూడా తన శక్తికి మించిన శ్రమకు
అలవాటు పడినవాడు. అనేక బాధ్యతల్నీ, బరువుల్నీ నెత్తికెత్తుకునే తత్వం. అవన్నీ
స్వీకృతాలూ, స్వీయకృత్యాలే! ఆయన దినచర్యని పరిశీలిస్తే ఎన్నో అబ్బురపరిచే అంశాలే
గోచరిస్తాయి. ఒక్క సంగతి చూడండి. అతి విస్తృతమైన పుస్తకపఠనం, ఐదువందల పేజీల
గ్రంథాన్నైనా – అతివేగంగా రెండుమూడు రోజుల్లో ఆకళింపు చేసుకోగల ధీధిషణలు. అవీ
వయసుకు మించిన శక్తియుక్తులు. చదివిన విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని,
సాధికారికతతో, ఉటంకింపులతో సహా ఆ విషయాన్ని మళ్ళీ స్పష్టీకరించే ప్రజ్ఞ ఆయనది.
ఫిలాసఫీ చదివిన తాను ‘వేదాంతులకే తత్వోపదేశం చేయగలరని’ ఆయన చెప్పుకుంటూ
వుండేవాడని – గురజాడ కుమారుడు రామదాసు గారు గుర్తు చేసుకున్నారు. అలాగే,
ఆయనకి ఇంగ్లీషు, కన్నడం, బెంగాలీ, పారశీకం, గ్రీకు, లాటిన్ భాషల్లో అపారమైన
అభినివేశం ఉంది. ఎఫ్.ఏ చదువుతూ వుండగానే ఇంగ్లీష్లో రాసిన ‘సారంగధర’
పద్యాలూ, వాటి వైశిష్ట్యం, సాహితీలోకానికి ఎఱుకే.
గురజాడ వ్యక్తిత్వమూ, సాహిత్యవ్యక్తిత్వమూ కలిసి మూడు రంగాల్ని తీవ్రంగా,
గాఢంగా, విస్తృతంగా ప్రభావితం చేశాయి. అవి – సామాజిక, భాషా, సాహిత్యరంగాలు.
గురజాడ అచ్చమైన ప్రజాస్వామ్యవాది.
‘నాది ప్రజల ఉద్యమము. దానిని ఎవరిని సంతోషపెట్టటానికైనా వదులుకోను’ అని
నిర్ద్వంద్వంగా ప్రకటించిన ధైర్యశాలి గురజాడ. అందుకే కిళాంబి రంగాచార్యులు
గురజాడని ‘ప్రజాసామాన్య రక్తధ్వజము నెత్తిన కవీంద్రుడాయన’ అన్నాడు.
సంస్కరణాభిలాషిగా, అభ్యుదయాకాంక్షిగా, నూతన ప్రక్రియా ప్రయోగశీలిగా,