కవితా ధోరణులతో నిండి వున్నాయి. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఏ
అంశంలోనూ కొత్తదనం లేదు. అంతేకాదు భాష కూడా గ్రాంథికమే. ఇది ఎవ్వరూ
కాదనరాని నగ్నసత్యం. ఎటువంటి ముందుచూపులేని, సామాజిక స్పృహలేనీ, సామాజిక
దృష్టి లేనీ, కేవలం అమలిన శృంగారానికే పరిమితమైన భావకవి అయిన రాయప్రోలు
సుబ్బారావు గారిని గురజాడ వారికి సమ ఉజ్జీగా నిలిపి, యుగకర్తృత్వాన్ని ఇద్దరికీ పంచడం
నూటికి నూరుపాళ్ళు తప్పు.
ప్రాచీన సనాతన సంప్రదాయాల్ని, పాతభాషను,
పాత ఛందస్సును, పాత భావజాలాన్ని బూజుపట్టిన
నమ్మకాల్ని గౌరవిస్తూ రచనలు చేసిన రాయప్రోలువారికీ,
భాషలోనూ భావంలోనూ, ఛందస్సులోనూ, వస్తువు
లోనూ, సాహిత్యంలోనూ అన్ని అంశాల్లోనూ
ఆధునికతను ప్రవేశపెట్టిన గురజాడ సామాజిక విప్లవ
పథానికి చాలా తేడావుంది. ఈ విషయం ఇద్దరిలోనూ
చాలా స్పష్టంగా అందరికీ కన్పిస్తుంది. ఇంతకూ అసలు
విషయం ఏమంటే భావకవులు సామాజిక మహాకవులా?
మార్గదర్శకులా? రెండూ కాదు కదా! ఒకమాటలో
చెప్పాలంటే భావ కవిత్వంలో వస్తువు, వ్యక్తి స్వార్థానికి
పరాకాష్ఠ. అటువంటి వ్యక్తుల్ని యుగకర్తలుగా
నిర్ధారించడం సమంజసంగా లేదు.
భావకవులు తమ భావనతో ఇతర లోకాల్ని
సృష్టించారు. అందులో స్వేచ్ఛగా విహరించారు. వీళ్ళు
యుగకర్త ఎలా అవుతారు. భావకవుల దృక్పథం,
అస్తిత్వానికి చెందినదని విమర్శకులు తీవ్రంగా
ఖండించారు కూడా. భావకవులు తమ చుట్టూ ఒక
అద్భుతమైన వాతవరణాన్ని సృష్టించుకున్నారు. ఆ
లోకంలోనికి తమ ప్రేయసికి తప్ప ఇతరులకు చోటు
లేకుండా చేశారు. వీళ్ళకు విశాల దృక్పథం లేదు. ఇంకా వీళ్ళకి సామాజిక దృక్పథం
ఎక్కడిది? వీరు తమ స్వార్థం కోసం చూసుకున్నారు. ఏకాంతంలోనే వుండడానికి
ఇష్టపడ్డారు. సామాన్య మానవుని కోసం వీరు కనీసం ఆలోచించలేదు. సామాజిక
అవగాహన లేని కవులు తెలుగు సాహిత్యంలో ఎవరైనా వున్నారంటే భావకవులే.
భావకవులు సొంత రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సొంత రాజ్యం ప్రేమ రాజ్యం. ఆ
ప్రేమలో మునిగి, తేలుతూ ఆనందంలో విహరించారు. భావకవులు కేవలం తమ స్వార్థం
కోసం కవిత్వాన్ని సృష్టించారు. ఇటువంటివాళ్ళు యుగకర్తలుగా ఎలా అవుతారు? కాబట్టి
భావకవి అయిన రాయప్రోలు సుబ్బారావుగారు నూటికి నూరుపాళ్ళు యుగకర్త అవడానికి
అర్హతలు లేవు.