ప్రపంచమంతా డబ్బుతోనే ఉందనుకుంటాడు. డబ్బు కక్కుర్తితో పిచ్చిపనులు చేసేవాడు.
రామప్పపంతులు లాంటి టక్కరి మోసగాడు, స్త్రీలోలుడు, స్వార్థపరుడు, కోర్టుపక్షి, డబ్బుకు
అమ్ముకుపోయినవాడు, తగవులు పెంచి బ్రతికేవాడు. నీచుడు, బైరాగిలాంటి సమాజ
చీడపురుగులు, బుచ్చమ్మలాంటి ఏమీ తెలియని అమాయకురాలైన వితంతువు,
మీనాక్షిలాంటి వితంతువు, బుచ్చమ్మ – మీనాక్షి ఇద్దరూ సాంఘిక దురాచారాలకూ,
ఛాందస భావాలకూ బలి అయిన, బాల వితంతువులు, పూట – కూళ్ళమ్మలాంటి స్వశక్తితో
బ్రతికే బాలవితంతువు, కరటక శాస్త్రిలాంటి కార్యశీలుడు, శక్తిమంతుడు, అనుకున్నపని
సాధించిన ధీశాలి. లౌక్యం నేర్చినవాడు, భీమారావు, నాయుడు లాంటి డబ్బుకు దాసోహం
అయిన దొంగలాయరులు, వేంకటేశం – మహేశం
లాంటి యుక్త వయస్సులో వున్న భావి పౌరులు,
సౌజన్యరావు లాంటి సత్ పురుషుడు. వేశ్యావిముఖుడు,
సంఘ సంస్కరణాభిలాషి, ఇలాంటి వాళ్ళు అందరూ
మన సమాజంలో కోకొల్లలు. అందుకే కన్యాశుల్కం
సజీవ నాటకమైంది.
సమాజంలోని అవ్యవస్థను చూసి గురజాడ చాలా
మానసిక సంక్షోభానికి గురి అయ్యాడు. ఆనాటిసాంఘిక
పరిస్థితుల్ని చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన
వంతు సమాజానికి ఏమి చేయగలనా అని
మదనపడ్డాడు. సంఘ – సంస్కరణ కోసం సాంఘిక
నాటకం గురజాడ రాశారు. సంఘంలోని ఛాందసుల్ని
చూసి బాధపడ్డారు. అమాయకులైన బాల వితంతువుల్ని
కళ్ళారా చూసి మనస్తాపం చెందారు. వేశ్యల జీవితాన్ని
చూసి తీవ్రంగా కలత చెందారు. తప్పుడు పనులు చేసే
మనుషుల్ని చూచి దుఃఖించారు. దొంగ లాయరుల్ని
చూసి ఆవేదన చెందాడు. మనిషిలో మానవత్వం లేమిని
గ్రహించాడో సమాజంలోని నీతిని గూర్చి, నిజాయితీ
గూర్చి, మానవ విలువల గూర్చి తెలుసుకొని నాటకకర్త అవాక్కయ్యారు.
అందువల్ల తనవంతుగా సమాజంలో మానవతా విలువల్ని వికసింప చేయడానికీ,
మనుషుల్లో మానవతా విలువల్ని పెంపొందింపచేయడానికీ నాటకం రాశారు.
కన్యాశుల్కంలో ప్రతీ పాత్ర నిత్యజీవితంలో ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో
మనకు కన్పిస్తూనే వుంటుంది. ఆనాటి సమాజంలో దుష, ్ట నీచమైన సంప్రదాయాలు,
ఆచారాలు, నమ్మకాలు ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఈ సమస్యలపైనే నాటకకర్త
కలాన్ని కత్తిగా దూసారు. అలాంటి అవ్యవస్థను కూకటివేళ్ళతో పూర్తిగా పెకలించడానికే
నాటకం రాశారు. అందుకే ప్రముఖ సంఘ సంస్కర్త అయ్యారు.