యుగకర్త గురజాడ
-తొలి సంచిక
నాటకకర్తగా, కవిగా, కథకుడుగా, రచయితగా,
వ్యాసకర్తగా, శాసన పరిశోధకుడుగా, చరిత్ర
పరిశీలకుడుగా, వ్యావహారిక భాషా ప్రయోక్తగా,
ప్రతిభావంతుడైన పండితుడుగా, విద్యావేత్తగా, సంఘ
సంస్కర్తగా, సామాజిక శాస్త్రవేత్తగా, రాజకీయ విశ్లేషకుడుగా,
హేతువాదిగా, అభ్యుదయవాదిగా, మానవతావాదిగా,
స్నేహశీలిగా, సౌజన్యమూర్తిగా, సహృదయుడుగా,
హాస్యప్రియుడుగా, దేశభక్తుడుగా, జాతీయవాదిగా,
విధేయతకు మారుపేరుగా, మార్గదర్శకుడుగా, నవయుగ
వైతాళికుడుగా – ఇలా ఎన్నో లక్షణాలు ఒకే వ్యక్తిలో వున్న
మహాకవి, యుగకర్త, మేధావి, మార్గదర్శి గురజాడ వేంకట అప్పారావు గారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజల పక్షాన గట్టిగా నిలిచి, ప్రజల మనిషిగా గురజాడవారు ఆధునిక సాహిత్యంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు గడించారు.
వేయి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో 800 సంవత్సరాల సాహిత్యం ‘ప్రాచీన సాహిత్యం’. 200 సంవత్సరాల సాహిత్యం ‘ఆధునిక సాహిత్యం’. ఆధునిక సాహిత్యాన్నే ‘ఆధునిక యుగం’ అని అంటారు. దీన్నే ‘గురజాడయుగం’ గా పిలుస్తారు. ప్రాచీన
సాహిత్యంపై సంస్కృత ప్రభావం, ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం చాలా స్పష్టంగా
కన్పిస్తుంది. సాహిత్య చరిత్రకారులు వేయేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రను తమ తమ