రాజరాజపుత్రి – రాజ్ఞినప్పలకొండ
యాంబ బ్రోచుగాత – నధిక సౌఖ్యములిచ్చి
-గురజాడ ఈ పాటలో కూడా ఉదకమండల సౌందర్యాన్ని వర్ణించారు. మొదటిరెండు
చరణాల్లో ప్రకృతి శోభను వర్ణించి మూడవ చరణంలో శివుడు అప్పలకొండయాంబను
రక్షించి, అధిక సౌఖ్యాలను ప్రసాదించాలని కాంక్షించారు.
కర్పూరవృక్షాలు స్తంభాలుగా, ఆకాశమే పందిరిగా, మెరుపులే దీపాలుగా, అందమైన
పచ్చికబయళ్ళు అప్సరసలు దిద్దిన రంగవల్లులుగా గురజాడ భావించిన తీరు
ప్రశంసనీయంగా ఉంది.
గురజాడ నీలగిరి పాటల్లో మరొకటి చమత్కారయుతంగా సాగింది. ‘నాటిమాట’
పేరుతో ఈ పాట ఉంది.
నాటిమాట :- రాగము – అఠాణా, తాళము – రూపకము
పల్లవి : నాటిమాట మరచుట యే
నాటికైన మరవ వశమ
అనుపల్లవి : బోటి ప్రాణమీవంటి, ము
మ్మాటికినిను విడనంటి
చరణములు:
1.మాటమూటగట్టుకొని
పాటిదప్పితనుట నా పొర
పాటుగాక, మాటననే
పాటిర నీ సాటి దొరకు
2. బ్రతుకునందు లేని స్థిరత
వెతకనేల భాషయందు
నతుకువేషభాషకోడు
నతివలదే తప్పుగాక
3. సాటిలేదు నాకంటి వా
మాట నిజము నేడుగంటి
సాటికలదెనమ్మి భంగ
పాటుపడిన పడతికెందు
4. మేటిపైన నీయెద మొగ
మాటమెటులబాసె, నొక్క