నెండదాడికోడి సీతుకొండ వట్టెనేయనగ
నిండుకొలువు హేమంతముండియిచట వెలసెను (ఊటి)
వెన్నుని సిగన మరియున్న వేల్పుతరుల విరుల మాడ్కి
సన్నసన్నవెండి మబ్బుచరియలంటగా
మిన్నుబాయ సంజకాడు మేళవించురంగులనగ
వన్నె వన్నెపూలగములు వనము గ్రమ్మిమెరయును (ఊటి)
గురజాడ తెలుగుపదాల ప్రయోగం ఈ పాటలో వీనుల విందుగా సాగింది. పద
ప్రయోగంతో పాటు ఆలంకారిక ప్రతిభను కూడ గురజాడ ఈ పాటలో ప్రదర్శించారు.
శివుని జటాజూటంలోని గంగలాగా కోట హృదయంలో జలం కొమరి ఉందని పోల్చటం
సముచితంగా ఉంది. ఎండదాడికి భయపడి సీతువు కొండపట్టెనేమో అనటంలోని ఉత్ప్రేక్ష
గురజాడ ఊహాశక్తిని ప్రదర్శిస్తున్నది. సన్నసన్న వెండిమబ్బులు వెన్నుని సిగలో
అలంకరించబడిన కల్ప వృక్ష పుష్పాలను పోలి ఉన్నవని గురజాడ చెప్పిన తీరు బాగుంది.
మొదటి రెండు గేయాల్లోనూ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించిన గురజాడ మూడవ గేయంలో
ఉమాపతి యర్చన గావిస్తూ తన ప్రతిభను ప్రదర్శించాడు.
ఉమాపతియర్చన : రాగము – భైరవి తాళము – చాపు, మిశ్రజాతి
పల్లవి : ఉదకమండలమున – నుమాపతియర్చన
కోటిగుణితమై – కోరిక లీడేర్చును.
అనుపల్లవి : వెల్లనౌమబ్బులు -విరిసి వెన్నెలగాయ
వెండికొండని సురలు – వేడ్కతోరాగ
చరణములు :
1.కర్పూరతరువులు – కంబములైతోప
మిన్నుపందిరిబోల – మించుదివ్వెలుగా
బచ్చల హసియించు – పచ్చికపై విరు
లచ్చరలిడు మ్రుగ్గు – టచ్చున వెలయగ
2.దేవదారుతరులు – దివ్యగంధములీన
యక్షగానముమీరి – పక్షులు పలుక
రసితమల్లదే శంఖ – రావమై చెలగంగ
దీవలేమలుపూలు – తిరముగ గురియగ
3.ఆశ్రితవరదు – డంబికా రమణుడు
బాలచంద్రమౌళి – భక్తికినెదమెచ్చి