4. గట్టుల లోయల – గాజుచప్పరల
మట్టి గోలెముల – మడువుల నడవుల
నెల్లెడవిరియగ – వెల్లువులై విరు
లిక్షుధన్వుదొన – లక్షయమయ్యెను.
5. తప్పక భృత్యుల -నెప్పుడు బ్రోచెడి
యప్పల కొండయ – మంబాదేవిని
నొప్పగ బ్రోచుత – నప్పురదమనుడు
మెప్పగు వరముల – విప్పుగ గురియుచు
అప్పారావుగారి ఈ పాట పల్లవి, అనుపల్లవితో పాటు ఐదు చరణాలుగా సాగింది.
నీలగిరి అందాలను అద్భుతశబ్ద ప్రయోగాలతో అప్పారావు గారు వర్ణించారు. నీలగిరిని
నందనవనంగా భావించటంలో దాని ఆధిక్యాన్ని ప్రదర్శింపజేశారు. అది నందనవనం
కాబట్టి దేవమునుల చేత సేవించబడుతుందని చెప్పటం సముచితంగా ఉంది. నీలగిరిలోని
పచ్చికబయళ్ళు, పొదరిళ్ళు, సవ్వడిచేసే పిట్టలు, వింతసౌరభాలను వెలిజిమ్మే చెట్లు,
కుదురైన రాజమార్గంగల కొలనిగట్లు శోభాయమానంగా ఉన్నతీరును అప్పారావుగారు
వర్ణించారు. ఇంకా నీటైన తోటలు, మెరుపు తీగెల్లాంటి స్త్రీలు, యంత్రరథాలు, పరుగెత్తే
జవనాశ్వాలు అందాలను పంచుతుంటాయని గేయాన్ని రచించిన అప్పారావుగారు చివరి
చరణంలో భృత్యులను రక్షించే మహారాణీ అప్పలకొండయ మంబాదేవిని పురదమనుడు
రక్షించాలని కాంక్షించారు.
ఊటిచోద్యమేమిచెపుదు :- రాగము – పంతువరాళి తాళము – రూపకము గురజాడ
రచించిన నీలగిరి పాటల్లోరెండవది. ‘ఊటిచోద్యమేమి చెపుదు’ ఈ పాటలో ఊటి
అందాలను వర్ణించారు. ఊటిలోని మేడల్ని, రాత్రి సమయంలో పావకుడు ప్రతిఇంటిలో
దయను చూపుతున్న తీరును ఇలా వర్ణించారు.
పల్లవి : ఊటిచోద్యమేమిచెపుదునువిదవింటివే
అనుపల్లవి : సాటియేది యూటికెందు
స్వర్గమైన దీని క్రిందు
చరణములు :
1.వాటమైనతటములందు దోటలెంతొ సొంపుమీద
గూటములను సౌధరాజికుదిరి మెరయగా
మాటుమణగి శివుని జటాజూటమునను గంగపగిది
కోట హృదయములందు జలము కొమరియమరియుండును (ఊటి)
2.పండువెన్నెలచటి పవలు పావకుండు రాత్రులందు
దండనుండి యింటనింట దయను బ్రోవగ