ఉండేవారు. ప్రతిసంవత్సరం వేసవికాలంలో అప్పలకొండయాంబ ఉదకమండలం
వెళుతూ ఉండేవారు. గురజాడ వారు కూడా ఆమెతోపాటు ఉదక మండలంలో ఉండేవారు.
ఉదకమండలంలోని నీలగిరి సౌందర్యాన్ని పరిశీలించిన గురజాడలో విశిష్ట భావాలు
కలుగుతూ ఉండేవి. ఆయన భావనలకు అక్షర రూపాన్ని కలిగించి మహారాణీ వారికి
వినిపించేవారు. ఆంగ్లకవి ‘వర్డ్స్ వర్తు’ రచనల్ని పరిశీలనాత్మకంగా చదివిన గురజాడ మీద
ఆయన ప్రభావం ఎంతో ఉంది. ప్రకృతిని పరిశీలించి ‘వర్డ్స్ వర్తు’ గేయాలు రచించినట్లుగానే
గురజాడ కూడ నీలగిరి సౌందర్యాన్ని పరికించి ఎన్నో గేయాలు రచించారు. ఈ గేయాల్ని
గమనించినప్పుడు గురజాడ వారికి గల సంగీత పరిజ్ఞానం కూడా స్పష్టమవుతుంది. నీలగిరి
పాటలుగా ప్రస్తు ం ఆరుమాత్రమే లభిస్తున్నాయి. గురజాడకు శబ్దార్థాల పట్ల గలిగిన
శ్రద్ధను, ఆయనకు గల పరిశీలనాత్మక దృష్టిని నీలగిరి పాటలు ప్రతిబింబిస్తున్నాయి.
నీలనగము : నీలగిరి సౌందర్యాన్ని వర్ణిస్తూ అక్కడి దృశ్యాల్ని పాఠకుల కళ్ళ ఎదుట
నిలబెడుతున్న గురజాడగేయం ఈ విధంగా సాగింది.
‘రాగము సురట, తాళము – ఆది.
పల్లవి : సుందరతరమీనీలనగము – దీని
యందము హృదయానందకరము – దీని
చందము హృదయానందకరము
అనుపల్లవి : నందనవనమిదె – నాతిరోవింటివె
బృందారకముని-బృంద సేవితము
చరణము :
1 ఎచ్చట జూచిన – బచ్చిక పట్టులు
పొదపొదరొదలిడు – పొలుపగుపిట్టలు
వింతవాసనలు – వీచెడుచెట్టులు
కుదురురధ్యగల – కొలకుల గట్టులు
2 నిచ్చలనగముల – నీటగుతోటల
విచ్చలవిడిచను – నచ్చెపు మొగుళుల
నచ్చరగేరెడు – మచ్చెకంటులిట
మించుతీవలను – మించిచరింతురు
3 పాదఘట్టనకు – బర్వుచక్రములు
మంత్రమహిమనగు – జంత్రపురధములు
పందెము వారెడు – పలుజవనాశ్వము
లందముగానిట – గ్రందయి తోచును.