అనుకుంటున్నారు. పనికిమాలిన పాండిత్యంతో కవిత్వం మీద విరుచుకుపడుతున్నారు.’
అంటూ ఆనాటి సాహిత్య స్థితిగతులను విమర్శించిన తీరు గురజాడవారి తులనాత్మక
విమర్శను స్పష్టం చేస్తోంది.
మునిమాణిక్యం గారికి రాసిన మరోలేఖలో వేశ్యజాతి పట్ల తన నిశ్చితాభిప్రాయాన్ని
ఇలా ప్రకటించారు. “వేశ్యలో మానుషత్వాన్ని మరచిపోకండి. ఆమె సుఖదుఃఖాలు
మీవిగాని, నావిగాని అయిన సుఖదుఃఖాలకు ప్రాముఖ్యత లో తీసిపోవు. సంఘంలో
లెక్కలేని వ్యభిచారులైన భర్తలు, భార్యలూ వున్నారు. స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే
వేశ్య వారందరికన్నా అధమురాలెట్లా అవుతుంది?” అని సూటిగా సమాజంపై ప్రశ్నాశరం
సంధించిన ధీరోదాత్తుడాయన.
6 డిసెంబర్ 1912 న కళాప్రపూర్ణ బిరుదు ప్రథమ స్వీకర్త,నెల్లూరు మండలవాసివేదం
వేంకటరాయశాస్త్రి గారి ‘ప్రతాప రుద్రీయం’ నాటకాన్ని మెచ్చుకుంటూ గురజాడవారు
రాసిన లేఖ ఇలా సాగింది…‘‘పెక్కు విషయాలలో నేను మిమ్ము మెచ్చుకొనుచున్నాను.
ముఖ్యంగా ప్రతాపరుద్రీయంలో మీరు చూపిన భాషాతత్పరతకునూ, దేశభక్తికినీ,
చారిత్రక వాతావరణముతోడి కథానిర్మాణమునకు మీరు పాత్రలను, సంస్థలను ఆదర్శ
ప్రాయంగా సృష్టించినారు.’’ విమర్శకులమని స్వయంగా ప్రకటించుకునే వారిలో దానిని
గ్రహింపగల సంస్కారం ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు.
గురజాడవారు స్వతహాగా వ్యావహారిక భాషావాది. భాషాపరమైన విభేదాలు ఉన్నా
పెక్కు విషయాలలో వేదం వేంకటరాయశాస్త్రి గారిని, ప్రత్యేకించి ప్రతాప రుద్రీయం
నాటకాన్ని ప్రశంసించడం అప్పటి సాహితీ, చరిత్ర భాషాకారులలో విశేష చర్చకు
దారితీసింది. 1912 డిసెంబర్ 16 న గున్నయ్య శాస్త్రిగారికి రాసిన లేఖలో అప్పారావుగారు
తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించడం గమనార్హం. “తెలుగు కవిత్వం లో నేను
కొత్త ‘ఎక్స్పెరిమెంటు’ ఆరంభించాను; నా ముత్యాల సరాల రీతిని గమనించినట్లయితే
మీకీ విషయం బోధపడుతుంది; నేను తలపెట్టిన మార్పు స్పష్టపడుతుంది. వాటి
శబ్దవిన్యాసంలో భేదం కనపడక పోదు. ఛందోపద్ధతిని బట్టి శబ్దాల అమరిక ఏర్పడుతుంది.
ఛందోరీతుల ఇమిడికవల్ల ఒక్కొక్కప్పుడు శబ్దాలు కొద్ది కొద్దిగా మారడం కద్దు. మన
తెలుగుభాషలో యూరోపియన్ల భాషకంటే అధికం. బెంగాలీ కవులు సులభమైన
ఛందోరీతులను స్వీకరిస్తారు. అయినా పదములను పొడిగించి వాడుతూ ఉంటారు.’’
పద్యాల కల్పనలో నవీనరీతులకు మార్గం సుగమం చేసినకారణంగానే గురజాడవారు
తెలుగుసాహితీ ప్రపంచంలో నవయుగకవితా చక్రవర్తిగా ప్రశంసలు అందుకున్నారు.
ఒక సందర్భంలో విజయరామగజపతి మహారాజా వారికి రాసిన లేఖలో మహాకవి
ప్రస్తావించిన అంశాలు నేటికాలానికి వర్తిస్తాయనడంలో అనౌచిత్యం ఏమాత్రం లేదు.
గురజాడవారి మాటల్లోనే ఒకసారి పరికిద్దాం-‘‘తెనుగున గ్రంథప్రచురణమనేది పీకులాట
పంచాంగం. కృత్యాద్యవస్థ. యూరపులోనో లేదా కనీసం బెంగాలులోనో వున్నట్లు
తెలుగుదేశంలో పుస్తకవ్యాపారమనేది లేదు. గ్రంథకర్త తన పుస్తకాన్ని తానే అచ్చు
ఒత్తించుకోవాలి. ముద్రాపకుడు, ప్రకటనకర్త, ప్రచురణకర్త అన్నీ అతనే! అచ్చు ఒత్తించిన
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు