గురుజాడల ఆశారేఖలు
గురజాడవారి లేఖలు.. – తొలి సంచిక
మహాకవి గురజాడ అప్పారావు గారి విభిన్న
సాహితీప్రక్రియలలో లేఖాసాహిత్యం ఒక వినూత్న
ఒరవడి సృష్టించిందనడం అతిశయోక్తి కాదు.
అంతకుపూర్వం ఉన్న ప్రముఖ సాహితీస్రష్టల లేఖా
సాహిత్యంలో పొడసూపని భావసాంద్రత గురజాడవారి
లేఖలలో ప్రస్ఫుటంగా ఉన్నట్లు భాషాకారుల అభిప్రాయం. ఆ మహాకవి రచనలు శిష్టవ్యవహారంలో అక్షరరూపం సంతరించుకోవడంతో ఆయన సమకాలిక సాహిత్యకారులలో ఒక విశిష్టస్థానం దక్కింది. “నా ఉద్యమం ప్రజా ఉద్యమం.
సంస్కృతీపరుల భావసంపద నాకు అండగా ఉంది. అంటూ ఆధునిక వ్యావహారిక భాషోద్యమానికి సంబంధించిన వారి ఆలోచనలు, అనుభవాలను లేఖల రూపంలో తన మిత్రులతో పంచుకున్నారు.
11 మార్చి 1909న. తన శిష్యుడు ఒంగోలు మునిమాణిక్యం గారికి రాసిన లేఖలో ఇలా అన్నారు- ‘నాతో కలసిమెలసి మెసలడం వల్ల నా సాంగత్యం ఫలితంగా నీకు
సారస్వతాభిరుచీ, అభినివేశం కలిగాయని నువ్వు చెబుతున్నావు. సరే…సంతోషం. అయితే
వొక్క మాట. నీతో పరిచయం కలగడం వలన రానున్న తరంలో యువకులు మాకన్న
ఎక్కువ సాహిత్యకృషి చేయగలరన్న విశ్వాసం నాకు కుదిరింది. యువకుల పట్ల
ఆప్యాయత, అభిమానమూ కలిగాయి. నీ పరిచయం వల్ల మళ్ళీ నా స్వయంవ్యక్తిత్వాన్ని
నేను పొందగలిగాను.’
ఈ లేఖలో భవిష్యత్ యువతపై తనకున్న ఆశావాహ దృక్పథం వ్యక్తం చేయడం ఆయన
దార్శనికతకు అద్దం పడుతోంది.
కవిగా తనకుతానుగా స్వీకరించిన సామాజిక బాధ్యతను ఆ మహాకవి ఎన్నడూ
విస్మరించలేదు. 1909 మే 21 న మునిసుబ్రహ్మణ్యం గారికి రాసిన లేఖలో…’ కవితా
న్యాయం ఒకప్పుడున్నట్టుగా ఇప్పుడు లేదు. నేను జీవితాన్ని చిత్రిస్తాను. కళ నాకు అధికారి
అయినప్పటికీ సమాజం పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంది.’ అని సాహితీకృషీవలునిగా తన
నిబద్ధతను లోకానికి ప్రకటించారు.
1911 నవంబర్ 22 తేదీన మునిమాణిక్యం గారికి రాసిన మరో లేఖలో ‘ఒక వాక్యం
వ్రాయని, ఒక పుస్తకం వ్రాయని పండితులు మనలో అనేకమంది ఉన్నారు. సృజనాత్మక
శక్తికి, పాండిత్యానికి భేదం చాలా వుంది. ఒక కళాశాలలోనో, ఒక పాఠశాలలోనో
పండితుడుగా ఉన్నంత మాత్రాన తానొక వచన రచయితననో, కవిననో భావించడం మన
దౌర్భాగ్యం. మనదేశంలోని పాఠశాలలోని పండితులు సాధారణంగా అలాగే