విమర్శ చేశారు. గురజాడను కవిగా వారు భావించలేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని
ముందు తరం కవులకు వెనుకతరం కవులకు కవిత్వమంటే ఏమిటో చెప్పాడు గురజాడ.
‘మెచ్చనంటావీవు: నీవిక / మెచ్చకుంటేమించి పాయెను / కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
/ కోమలుల సౌరెక్కునా?’ అంటారు.
కవికర్తవ్యాన్ని అపూర్వమైన రీతిలో గుర్తుచేస్తూ, కవులు కవిత్వం రాయడమే కాదు,
ఆయుధం కూడా పట్టాలి, ఉద్యమాల్లోముందుండాలి అనేవాదం నేడు వినిపిస్తుంది. దీనికి
సమాధానంగా కవి బాధ్యతలేమిటి ఎంతవరకు సమాజానికి తోడ్పాటివ్వాలి, అనే భావనతో
‘ఆకులందున అణగిమణగీ / కవిత కోకిల పలకవలెనోయ్ / పలుకులను విని
దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్’ అంటారు. కవి ఏ పరిస్థితుల్లో ఎక్కడవున్నా
చైతన్య గీతికలు వినిపించాలి రచించాలి. ఆ కవితాసారం చైతన్యాన్ని రేకెత్తించాలి. జనాన్ని
మున్ముందుకు నడిపించాలి అనేది కవి భావన.
గురజాడ 1910లో రాసిన ‘లవణరాజుకల’ లో కులాన్ని గురించి ప్రస్తావిస్తాడు.
‘మాలల్ని ‘అంటరానివారిగా భావిస్తూ అగ్రకులస్థులు వివక్షత చూపేవారు. దాదాపు 110
సంవత్సరాల క్రితం ఎంతో దార్శనికతతో కులం కంటే మనిషికి గుణం ప్రధానం అనే
భావాన్ని వ్యక్తీకరిస్తాడు కవి. ‘లవణరాజు’ చేత పలకరిస్తాడు. ‘మలిన వృత్తులు మాలవారని
/ కులము వేర్చిన బలియు రొకదే / శమున కొందరివెలికి దోసిరి / మలినమే, మాల’ –
మాలలు పశుమాంసం తింటారని, పశువులను హింసిస్తారని వారిని ఊరికి దూరంగా
పెట్టారు. కాని మనుషుల్ని హింసించేవారిది పెద్దకులంగా భావిస్తారని సమాజాన్ని
ప్రశ్నిస్తాడు గురజాడ. ‘కులము లేదట వొక్కవేటున / పసరముల హింసించువారికి
కులము కలదట నరులవ్రేచెడి / క్రూరకర్ములకున్’ అంటారు. సమాజానికి ఇంకా
విప్పిచెప్తూ మంచిచెడ్డలు మనుజులందున / యెంచి చూడగ రెండు కులములు /
మంచియన్నది మాలయైతే, మాల నే అగుదున్’ ‘మనుషుల్లో మంచి, చెడు అనే రెండు
వర్గాలు ఉంటాయి, ‘మంచి’ మాలకులం అయితే, నేను కూడ మాలవాడినే’ అంటాడు కవి.
ఆ రోజుల్లోయింత నిర్భీతిగా ధైర్యసాహసాలతో బ్రాహ్మణ కులజుడైన గురజాడ ఈ
మాటలనడం ఎంత గొప్ప ఆదర్శవాదో దార్శనికుడో తెలియజేస్తాయి ఈ భావనలు.
‘కన్యక’ కవితలో దౌర్జన్యపూరితమైన రాచరిక వ్యవస్థ దుర్మార్గాన్ని సమాజంలో
అండలేని స్త్రీదుస్థితిని అద్భుతంగా ఆవిష్కరించాడు. ‘కన్యక’ నిస్సహాయస్థితిలో రాజును
శాపనార్థాలు పెడుతూ కాసులుంటేనే సరికాదు కనీసం మానవత్వం ఉండాలి మనిషికి అని
చెప్తూ ‘కాసువీసం కలిగి వుంటే / చాలుననుకొని / వీర్యమెరుగక, విద్యనేర్వక /
బుద్ధిమాలినచో / కలగవా యిక్కట్లు?’ అంటుంది.
యింకా అంటుంది :‘కండకావరమెక్కినీవీ / దుండగము తలపెట్టినందుకు /
వుండడా వొక దైవమంటూ / వుండి వూర్కొనునా?’ అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ గురజాడ
ప్రశ్నించే తత్త్వాన్ని బాధితుల్లోరేకెత్తించడం ఈయన గొప్పతనం. ముందు ముందు
అన్యాయాల్ని అక్రమాల్ని సామాన్య జనం సైతం ప్రశ్నిస్తారు అనే భావనే దార్శనికత.
‘కన్యాశుల్కం’ నాటకంలో గురజాడ, ఆనాడు బ్రాహ్మణ సమాజంలో బహుళంగ
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు