కాంచనేర్వరు అంగిలీజులు / కల్లనొల్లరు; వారి
విద్యల/ కరచి సత్యము నరసితిన్’.అంటారు.
తెలుగుసాహిత్యం హేతుబద్దం గాని అంశాలను
భక్తిరూపంలో వ్యక్తీకరించడం మూఢనమ్మకాలను
ప్రోత్సహించడమే అవుతుంది అనేది గురజాడ
భావన.
అందుకే అంటారు ‘కవుల కల్పన కలిమినెన్నో/
వన్నెచిన్నెలు గాంచువస్తువు/ లందు
వెర్రిపురాణగాధలు / నమ్మజెల్లునె పండితుల్’. కవి
పండితులు సాహిత్యంలో సత్యాసత్యాలను
తెలుసుకోవాలి. గ్రుడ్డిగా పురాణాల్లో ఉన్న
అంశాలను నమ్మరాదు అనే భావన గురజాడ
దార్శనికతను పట్టిస్తాయి.
వీరి ఆలోచన ఎంత దార్శనికమైనదో, ధర్మబద్ధమైనదో ఎల్లరిలోను సౌభ్రాతృత్వ వాంఛ
రేకెత్తించేదో తెలియజేస్తుంది. ఈ పద్యాలు ‘యెల్లలోకము వొక్క యిల్లై / వేడుకలు కురియ’
అనడం విశ్వమానవతా భావం ఎత్తిచూపడమవుతుంది. సర్వమతాల సమానత్వాన్ని
ఆకాంక్షిస్తూ, మతముతో ఎవ్వడూ నిలిచి వెలగలేడని, జ్ఞానముతోనే మనిషి
పూజింపబడతాడనే భావాన్ని వ్యక్తపరుస్తూ ‘మతములన్నియు మాసిపోవును /
జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును / అంత స్వర్గసుఖంబులున్నవి / యవని విలసిల్లన్’
అంటారు. సహపంక్తి భోజనాలతో సర్వులు వివక్షత వీడి విలసిల్లుతారనే భావనతో ‘మొన్న
పట్టమునందు ప్రాజ్ఞులు / మొట్టమొదటిది మెట్టు, యిదియని / వెట్టినారొక విందు,
జాతుల / జేర్చి వినవైతో?’ అంటారు.
మనిషిని మనిషిగా చూడలేని మనిషితనాన్ని ప్రశ్నిస్తాడు కవి. 1912 లో ‘మనిషి’
శీర్షికతో రాయబడిన కవితలో ప్రాణంలేని శిలలకు మ్రొక్కుతూ ప్రాణమున్న మనిషిని
రాయిరప్పల కంటే హీనంగా చూడడాన్ని ఎత్తుచూపుతూ ‘మనిషి చేసిన రాయి రప్పకి /
మహిమ కలదని సాగిమొక్కుతు / మనుషులంటే రాయిరప్పల / కన్న కనిష్టం’అంటారు.
కన్ను తెరిచి, మనసుబెట్టి చూచినట్లయితే ‘బ్రతికి, చచ్చియు ప్రజలకెవ్వడు / బ్రీతిగూర్చునో,
వాడె ధన్యుడు/’ అంటారు ‘డామన్, పితియస్’ అనే కవితలో వ్యవహార భాషలో,
సుతిమెత్తగా మందలిస్తూ ప్రబోధాత్మకంగా చెప్పిన దేశభక్తి గేయాల్లో…. ‘దేశమును
ప్రేమించుమన్నా / మంచి అన్నది పెంచుమన్న / వొట్టిమాటలు కట్టిపెట్టోయ్ / గట్టిమేల్
తలపెట్టవోయ్’ అంటూ దేశాన్ని ప్రేమించడం, మంచితనాన్ని పెంచుకోవడం,
నిష్ప్రయోజనమైన మాటల్ని కట్టిపెట్టడం, గట్టిప్రయత్నంతో మేలు తలపెట్టడం మనిషి
లక్ష్యం లక్షణంగా చెప్పాడు కవి. ఈనాడు జగం ఘోషించేదదే!
మానవ సమైక్యత ఆవశ్యకతని చాటిచెబుతూ, కులమత భేదాలను వివక్షతను వీడి
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు