తన కొక మేలు చేకురగ తక్కినవారికి గీడు సేయుటల్
మనమున లేని భక్తి యభిమానము మాటలలోనె చూపుటల్
గొనకెటు లాభముల్ గలుగు? గొంకక నాటక మాట సాగుటల్
ధనమునకు న్మహోన్నతికి దారులు రాజ గృహాంతరంబులన్.
కెంజిగురుల కోయిల, సుమ
మంజరులన్ దేటి గముల-మనుజ ఖగములన్
మంజుల ఫలముల, చూతమ!
రంజించెద వితర తరులు రా వాదుకొనన్.
విధి వశమున నీ చెంతకు
మధుపము రా హేళనంపు మాటాడకుమా
మధు వొలుకు జలజ కులముల
కధికపు నెయ్యుడగు కుటజమా! తెలియు మెదన్.
మొదటి పద్యంలో అధికారుల మాయమాటల స్వభావాన్ని రెండవ పద్యంలో
రాజగృహాల్లోకి దారులను, మూడవ పద్యంలో చూతవృక్ష విషయాల్ని, నాల్గవ పద్యంలో
పుష్పాన్నుద్దేశించి తుమ్మెదవస్తే రావద్దనకుమా అనడంలో అన్యాపదేశంగా ఇలా
లోకరీతుల్ని పేర్కొన్నాడు.
5.మెరుపులు:
ఆరు పద్యాలున్న ఖండిక. ఇది సూక్తిముక్తావళిలా గోచరిస్తుంది. ప్రాచీన కవుల
సుభాషితాలకు వివరణగా సాగిన తెనుగు సేత ఇది.
“దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా!
అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజాగుణాః॥
ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని గురజాడ ఇలా తెలిగించాడు.
ఈవియు దియ్యని మాటయు
భావంబున జేయ తగిన పని తెలియుటయున్
ఠీవియగు ధైర్య భావము
రావు సుమీ యొకని వలన రావలె తనతోన్.
కాళిదాసు అభిజ్ఞానశాకుంతలంలో దుష్యంతుడు దుర్వాసుని శాపవశంగా
కణ్వాశ్రమంలో శకుంతలను గాంధర్వవివాహం చేసుకొన్న సంగతిని మరిచిపోతాడు.