సాహితీ సమరాంగణ సార్వభౌముడు తన ఆముక్తమాల్యదలో పుష్పలావికల విటుల
మధ్య సరసోక్తులను ఇలా వర్ణించాడు-
వెలది! యీ నీ దండ వెలయెంత? నాదండ
కును వెలబెట్ట నెవ్వనితరంబు
కలువదావులుగాన మవి కదంబకవేణి
కలువతావులు వాడకయకలుగునె!
కడివోదు నాకిమ్ము పడతి యీ గేదంగి
నన గడివోమి ముందరికి జూడు
జాతులేవంబుజేక్షణ! పద్మినులు సైత
మునునున్నయెడ జాతులునికి యరుదె!
యనుచు, దొలినుడి నభిలాష లెనయమూగి
పలుకుతోడనె నర్మగర్భంబుగాగ
నుత్తరము పల్లవశ్రేణి కొసగు చలరు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున. (1ఆ. 19)
వివరణ చాలా వుంది కాబట్టి సహృదయులు మూలగ్రంథాన్ని చూస్తారని ఆశిస్తాను.
అంతా శ్లేష చమత్కృతి నడుస్తుంది.
రామరాజ భూషణుడు వసుచరిత్రలో-
“పొన్న పూవొడినేల పొదవితేచెలి!
యది పొడమె బల్ దీవిపై పొదువలదె” (1-109)
చేమకూర:
ప్రాయపు నాయకుల్ వెలనెపాన నెగాదిగచూడ నేర్పులౌ
రాయవి, దండమీద గొసరం దొరకొంటిరి మంచిసాములే
పో, యటులైనచో సరముల్గద మీకిపుడంచు నప్పురిన్
కాయజు తూపులమ్ముదురు కందువమాటల పుష్పలావికల్ (1-79)
ఈ నేపథ్యంలో గురజాడ పుష్పలావికల్ని చూద్దాం.
వెన్నెల గాయు కుందములు వేళ నెరుంగక బూయు కల్వలున్
జున్నులు జూరగా గుడిపి చొక్కుల నెక్కుడు తేల్చు తమ్ములున్
జెన్ను వహించె నీ కడను చేరగ నిమ్మిక యన్య మేలనే
వెన్నుని యాన యిచ్చెదను వేడిన నండ్రు కామినుల్.