5.5 C
New York
Monday, November 25, 2024

గురజాడ సంప్రదాయ కవిత్వం

ప్రసక్తి తీసుకురావడం ప్రాచీన శృంగార
కావ్యరచనలో కొత్త పోకడకు పూనికలా
కనిపిస్తోంది. ఇది పూర్తిచెయ్యక పోవడమే
కాదు, మధ్యను పూరించకుండా వదిలి
పెట్టిన భాగాలూ వున్నాయి.
బలరాముని అమాయకత్వం, అర్జునుని ధర్మోపదేశం ఎంతో చమత్కారంగా నడిచాయి. “కావ్యభాష ప్రాచీనమైనదై ననూ, కవి హృదయమాధునికమే! పద్యములలో అన్వయము, భావము, ధార నవీనములు. కొన్ని ఘట్టములలో భాషా నిర్బంధము కలిగినట్లు యధేచ్ఛ ముగా స్వతంత్రించి వాడిన ప్రయోగములు కలవు. “…. ఒకొక్క పద్యమందొక్కొక్క రసము బోధించి పద్యావళి వ్రాసి నటుల స్పష్టపడుచున్నది.” (రా.వి.స. పీఠిక. తేదీ 1.4.1939)”
గురజాడ సంప్రదాయ కవితలు ఐదు ఉన్నాయి. (1) సుభద్ర, (2). సత్యవ్రతిశతకము,
(3) పుష్పలావికలు, (4) మాటల మబ్బులు, (5) మెరుపులు.

  1. సుభద్ర: – అర్జునుడు తీర్థయాత్రలలో ద్వారకకు చేరుకోవడం, (శ్రీకృష్ణుడు
    యతివేషంలో ఉన్న అర్జునుని రైవతకాద్రిపై చాతుర్మాస్యదీక్షావ్రతంగా ఉండ మనడం,
    చెల్లెలు సుభద్రను మునిసేవకై బలరాముని అంగీకారముతో ఉంచడం, ఈ విషయం
    రుక్మిణికి తెలిపి రహస్యంగా ఉ౦చమని చివరకు అర్జునుడు సుభద్రను గాంధర్వవివాహం
    చేసుకోవడం, బలరామునికి నచ్చజెప్పి శ్రీకృష్ణుడు వారి వివాహం జరిపించడం ఇలా
    నడుస్తుంది కథ.
    అంధ్ర మహాభారతంలో ఆదిపర్వం అష్టమాశ్వాసంలో 168 నుండి 210 పద్యాల
    వరకు నన్నయ్య రచనగా ఈ కథ అందగించింది. దక్షిణాంధ్ర యుగంలో ప్రముఖ కవిగా
    పేరుగాంచిన చేమకూర వెంకటకవి ప్రత్యేకంగా విజయవిలాసం ప్రబంధంలో ఈ ఘట్టం
    ప్రతిపద్య చమత్కృతితో అలరారుతోంది.
    గురజాడ ఈ సుభద్ర కథను పూర్తిగా వివాహం వరకు వర్ణించలేదు. అర్జునుడు
    రావడం, బలరామ శ్రీకృష్ణులతో సంభాషణ, బలరాముడుఅర్జునుని రైవతకంపై ఉండమని
    సుభద్రను పరిచర్యకై నియోగించడం, సుభద్ర యతిరూపం లోని అర్జునుణ్ని చూసి
    అర్జునభావంతో కొంత మనసుపడి తేరుకొని అతని సేవలకు వెళ్ళననడం, రుక్మిణి
    సుభద్రకు కొంత బోధ చేయడంతో రచన సమాప్తమవుతుంది.
Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles