శకుంతల సభలోకి వచ్చి దుష్యంతునితో తమ కలయికను గుర్తు చేస్తున్నప్పుడు
దుష్యంతుడన్నట్లుగా ఈ శ్లోకం-
స్త్రీణా మశిక్షిత పటుత్వ మమానుషీషు
సందృశ్యతే కిముత యాః ప్రతిబోధవత్యః
ప్రాగ న్తరిక్ష గమనాత్స్వమపత్యజాత
మన్యైర్ద్విజైః పరభృతాః ఖలు పోషయన్తి.
ఎవరూ నేర్పకుండానే తెలివిగా ప్రవర్తించడం పశుపక్ష్యాదుల్లోనే ఉన్నప్పుడు
మనుష్యుల్లోవేరే చెప్పాలా? కోకిల తన పిల్లలు ఎగిరేవరకు కాకిగూడులోనే గుడ్లుపెట్టడం
చూడలేదా! ఈ భావాన్ని గురజాడ ఇలా చెప్పాడు.
మానిసులు గాని యింతుల
తా నేర్చని నేర్చు చెలగు తరి జెప్పంగా
జ్ఞానవతుల కగునె పికము
దాని శిశువు బెంచు నెగురుదాక నొరు చేన్.
కాశ్యాం మరణాత్ ముక్తిః అంటారు. ఇదే భావంగల ప్రసిద్ధ శ్లోకాన్ని గురజాడ ఇలా
తెలుగుచేశాడు.
కాశి జచ్చెనేని కలుగదు జన్మంబు
కలిగెనేని నుదుట కలుగు కన్ను
సిరసు నందు చిన్న సిరి తోడు బుట్టవు
కంఠసీమ వెలయు గరళ చిహ్న
కాశ్యా మవశ్యం త్యజతాం శరీరం
శరీరిణాం నా స్తి పునశ్శరీరం
యద్యస్తి కంఠే గరళం లలాటే
విలోచనం చంద్రకళాచ మౌళౌ.
బంగారానికి పరీక్షాస్థానం అగ్ని. ఈ విషయాన్నే ధనంజయే హాటక సంపరీక్షా
అన్నారు. అంతేకాదు ఇంకా దానికి నాలుగురకాల పరీక్షలున్నాయన్నారు.
యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే
నికర్షణచ్ఛేదన తాప తాడనైః
తథాచతుర్భిః పురుషు పరీక్ష్యతే
కులేన శీలేన గుణేన కర్మణా.