గురజాడ సంప్రదాయ కవిత్వం
-తొలి సంచిక
పాఠశాలల్లో కఠిన గ్రాంథిక భాషకు బదులు సులభ
భాషను ప్రవేశపెట్టాలన్న ఉద్యమానికి ప్రతిఘటన
చెలరేగుతున్న సమయంలో గురజాడను, గిడుగును, జె. ఏ.
ఏట్సును, పి.టి.శ్రీనివాస అయ్యంగార్లను “దుష్టచతుష్టయం”
అని ‘పేరుపెట్టి తూలనాడడం జరిగింది. ఆ సందర్భంలో
గురజాడకు సలక్షణమైన తెలుగుభాష రాయడం చేతకాదు,
వాడుకభాషలో రాయడం అందుచేతనే! అన్నదో అభియోగం.
కోవెల సుప్రసన్నాచార్య “గురజాడ ఒక సాధారణ కవి”
అనే వ్యాసంలో నాలుగు అంశాలని చూపుతూ కవిత్వంలో
మార్గపద్ధతిలో సుభద్రాపరిణయం రచించినా అది
పరిపుష్టస్థాయికి చెందకపోవటం అన్నారు.
ముదిగొండ శివప్రసాద్గారు “విదేశీబానిసత్వమేనా! యుగకర్త లక్షణం” అనే వ్యాసంలో పూర్ణమ్మ గేయంలో ముడివేస్రి, చేప్రి, వంటి వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలుండటానికి కారణం ఆయనకు ఛందోవ్యాకరణాలపై పట్టులేకపోవడమే
అన్నారు. విచారమేంటంటే గురజాడపై విమర్శకులు ఏమేమి వ్రాసినా ఈ అంశాలపై సుభద్రవంటి మార్గకవిత్వ రచనల్లో గురజాడ ప్రావీణ్యాన్ని ప్రధానంగా చర్చించకపోవడమే.
ఇదే అంశాన్ని సెట్టి ఈశ్వరరావు తన సంపాదకత్వంలో ప్రచురించిన ‘గురజాడ కవితల
సంపుటిలో’ సుభద్ర కావ్యాన్ని ప్రచురిస్తూ ఇలా రాసారు- “‘సుభద్ర’ అసమగ్రం.
సంప్రదాయ కవిత్వం రాయడం చేతకాకపోవడం వల్ల దానికి పూర్తిగా భిన్నమైన కవిత్వం
గురజాడ రాస్తున్నారని ప్రచారం జరిగింది. దానికి ఖండనగా, గురజాడ ‘సుభద్ర’ ను
సంప్రదాయ పద్ధతిలో రాశారు. దీన్లో చక్కని నాటకీయత అడుగడుగునా ఎదురవుతుంది.
సుభద్ర అంగాంగ వర్ణనకు కావలసినంత అవకాశం వుంది. కాని గురజాడ ఆ చాపల్యానికి
లొంగక శృంగార ఘట్టాన్ని నిగ్రహంతో, హుందాగా నడిపారు. అర్జునుని ప్రేమించిన
సుభద్ర, తాపసి అర్జునుడని ఎరగదు. కాని తాపసి పైకి పోతున్న మనసును నిగ్రహించుకొన్న
ఘట్టం అమలినంగా నడిచింది. తాపసికి సదుపాయాలు చేసే పనికి తాను
పోకూడదనుకుంటుంది. అప్పుడు రుక్మిణి తన వివాహ ప్రస్తావన తెచ్చి, సుభద్రను
ఒప్పిస్తుంది. ఈ ఘట్టం ఎంతో బాగుంది. ఇక్కడితో అసంపూర్ణంగా యీ కావ్యం
ముగుస్తుంది. పండితులు దీని మంచి చెడ్డలు శ్రద్ధగా పరిశీలించినట్టు లేదుయింతవరకూ.
ఈ సుభద్రాకల్యాణ కథను కావ్య వస్తువుగా తీసుకోవడం, దానిలో రుక్మిణీ కల్యాణ