కనబడుతూ, ఆశించినది లభించలేదన్న అసహనంతో ప్రేమ పేరుమీద జరుగుతున్న
యాసిడ్ దాడులు, నరికి చంపటాలు వంటి ఘాతుక చర్యలు పెచ్చు పెరుగుతున్న
వర్తమానంలో గురజాడ వివరణలు గుర్తు చేసుకోవలసి ఉంది. ప్రచారం చేయవలసివుంది.
అలాగే కులమత విద్వేషాలతో మనుషులపై అధికారం, దౌర్జన్యం నెరిపే దుష్టసంస్కృతి
ప్రబలుతున్న కాలంలో అసహనం హద్దులు దాటి హత్యలకు, అత్యాచారాలకు కారణ
మవుతున్న పాడుకాలంలో మననం చేసుకోవలసినది గురజాడ ప్రేమతత్వాన్నే.
‘మై ఓన్ థాట్స్’ లో మంచితనం అంటే దేవుడు అనిచెప్పి మంచితనం పై ప్రేమలో
పడటమే ప్రేమను దైవంగా మార్చే వాస్తవ శక్తి అని పేర్కొన్న గురజాడ ఆ క్రమంలో ఆత్మ
చెడు నుండి విముక్తం అవుతూ సుగుణాలను పెంచుకొంటూ దైవత్వాన్ని పొందుతుంది అని
భావించాడు. నాగరికతతో పాటు ప్రేమ అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు.
(గురుజాడలు, పు; 830) అట్లా మనుషులు ప్రేమను అభ్యాసం చేస్తూ దైవత్వం వైపు
చేయవలసిన ప్రస్థానాన్ని నిరూపించటం కొరకే గురజాడ సాహిత్య సృజనకారుడయ్యాడు.
సమాజంలో, మానవ సంబంధాలలో ప్రేమకు అవరోధంగా ఉన్న శక్తులలో కులం
ఒకటి. దానిని గుర్తించాడు కనుకనే 1909 నవంబర్ లో బరంపురంలో జరిగిన భిన్న
కులాల సహపంక్తి భోజనానికి వెళ్లి వచ్చాడు. “వర్ణభేదములెల్లకల్లై/ వేలనెరుగని
ప్రేమబంధము” దృఢపడాలని ఆకాంక్షిస్తూ కవిత్వఁ ముత్యాలసరము, 1910 జులై)
వ్రాసాడు. అదే సంవత్సరం నవంబర్ నెలలో ప్రచురించిన ‘లవణరాజు కల’లో ‘మలిన
వృత్తుల, మలిన దేహుల మాలలని సమాజము నుండి ఉపాంతీకరించి మలిన చిత్తులకు
అధిక కులమును కట్టబెట్టిన వర్ణధర్మం అధర్మ ధర్మం’ అని నిర్ద్వంద్వం గా ప్రకటించాడు.
మంచి, చెడు అనే విలువల వ్యత్యయమే తప్ప అధిక,హీన అనే కుల వ్యత్యయం ఉండరానిదని
తేల్చి చెప్పాడు. మంచి, చెడు రెండే మానవకులాలు అని “మంచి యన్నది మాల యైతే /
మాలనేయగుదున్” అని ప్రకటించాడు. అదే సంవత్సరం ఆగస్టునెలలో ప్రచురితమైన
‘కాసులు’ గేయం ‘ప్రేమ విద్దెకు ఓనమాలు’ దిద్దబెట్టింది. సందర్భం భార్యాభర్తలకు
సంబంధించిందే అయినా “ప్రేమ పెంచక పెరుగునే” అన్న ప్రశ్నను వేసి ధనం కన్నాప్రేమ
అభివృద్ధి చేసుకోవలసిన జీవిత విలువ అని నిర్ధారించి చెప్పాడు గురజాడ. ‘ప్రేమ కలుగక
బ్రతుకు చీకటి’ అని తేల్చి చెప్పాడు. వయసుతో మరలిపోయే మరులకు భ్రమపడరాదని
హెచ్చరించాడు. మగువలకు, మగవారికి ఒకేరకంగా వర్తించే ప్రేమ మాత్రమే మాయ
మర్మము లేని నేస్తంఅని, సమానత్వం దాని మూల విలువ అన్న ఎరుకతో చెప్పాడు.
“ప్రేమనిచ్చిన, ప్రేమవచ్చును/ ప్రేమనిలిపిన, ప్రేమ నిలుచును” అని పరస్పరం
మనుషులమధ్య వినిమయం కావలసిన ప్రేమ గురించి చెప్పాడు. “మగడు వేల్పన
పాతమాటది; ప్రాణమిత్రుడ నీకు” అని చెప్పటంలో ప్రేమకు స్నేహం, సమానత్వం
ప్రతిపాదికలని చెప్పినట్లయింది.
డామన్ పితియస్( 1910, సెప్టెంబర్ ) లో స్నేహం, త్యాగ సంసిద్ధత, విలువల కోసం
నిలబడటం, ప్రేమ సంపదలో భాగం అని నిరూపించాడు. దాని ముందర రాజ్యం.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు