ఉండాలి’ అని ప్రశ్న వేసాడు. ‘ప్రేమ యౌవనంలో ఉన్న ఆడదానిమీదే తప్ప చీకాకులతో
జీవితంలో వొడలిపోయిన యాభైఏళ్ల ముసలి దానియందు ఎందుకు కలగదు’ అని తర్కిం
చాడు. ప్రేమ యౌవనాన్ని ఆశ్రయించుకున్నది అయితే అది చాలా సంకుచితం అని
గురజాడ భావం. ‘తన కాల పరిమితులకు లోబడి క్రీస్తు ఏ మానవ ప్రేమ గురించి చెప్పాడో,
బుద్ధుడు తన జీవితకాలంలో ఏది నమ్మి బోధించాడో, షెల్లీ దేనిని కళావిలాసం, కవితాత్మక
సత్యం అని వ్యాఖ్యానించాడో- అది నిజమైన ఆదర్శ ప్రేమ అవుతుంది.’ అని గురజాడ
అభిప్రాయ పడ్డాడు.
క్రైస్తవం ప్రకారం ప్రేమ అంటే భగవంతుడు మనలను ప్రేమించినట్లు, మనకోసం సర్వం
వదులుకొన్నట్లు మనం కూడా అందరినీ ప్రేమించటం, అందరికోసం బాధలు పడటానికి
సిద్ధంగా ఉండటం. ప్రేమ షరతులు, నిబంధనలు లేనిది. ద్వేషానికి, అగౌరవానికి
వ్యతిరేకంగా మనుషులను కలిపి ఉంచే బంధం. మనుషులను సాధికారులుగా, మహోన్నత
మానవులుగా మార్చే శక్తి.
బౌద్ధం ప్రకారంస్వార్థ స్పర్శ లేకుండా మరొక జీవికి ఇచ్చేది అసలైన ప్రేమ. ఇతరులకు
మన వల్ల ఏమాత్రం కష్టం లేకుండా చూసుకొనటం, వాళ్లకు సంతోషాన్ని కలిగించటానికి
ప్రయత్నించటం అనే రెండు పార్శ్వాలు ఉంటాయి దానికి. స్నేహం, కరుణ, సంతోషం,
ఉపేక్ష(ఎవరేమి చేసినా అందరినీ ఆమోదించటం) అనే నాలుగు మౌలిక అంశాలు
ప్రేమలో కీలకమైనవి. బౌద్ధాన్ని తుడిచిపెట్ట ం ద్వారా భారతదేశం మత విషయకంగా
ఆత్మహత్య చేసుకొన్నదని గురజాడ అన్నాడంటే దేశం నిజమైన విశ్వమానవ ప్రేమ
స్వభావాన్ని కోల్పోయిందని సూచిస్తున్నాడన్న మాట. పరిణామంలో అది విద్వేష
రాజకీయంగా వికృతరూపాన్నితీసుకొనటం వర్తమానంలో మనం చూస్తున్నాం.
షెల్లీ ప్రేమకవి. ప్రేమను అనేక రంగులలో దర్శించినవాడు. లైంగిక,కాల్పనిక ప్రేమ,
విశ్వమానవ ప్రేమ. మానవుల అంతిమ గమ్యం అదే.( shelley; a poet of love css
forums.. ఇంటర్నెట్ సోర్స్) మానవజాతికి సంబంధించిన సమస్త బాధ్యతలను
స్వీకరించటం ప్రేమ. ప్రేమను ఆరాధించటం మానవుల పాపాలన్నిటినీ మాయం
చేస్తుంది. సమాజంలో మనుషుల మధ్య సంబంధాన్ని దృఢతరం చేసి సామరస్యం ద్వారా
సంతోషాన్ని పొంద టానికి ఉపయోగ పడుతుంది అన్న షెల్లీ భావాలను గురజాడ
ఉటంకించాడు. ఈరకంగా గురజాడ ప్రేమతత్వం ఈమూడు మూల శక్తుల నుండి
అభివృద్ధిచెందింది. అదే సంవత్సరం జూన్ 2 న ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికే వ్రాసిన
ఉత్తరంలో ప్రేమ ఒక్కటే సాధారణ మానవజీవన సూత్రం అని, ప్రేమ మనిషిని మరీమరీ
సంతోష పెడుతుందని, మనం సాటి వాళ్ళపట్ల చూపే ప్రేమ మనకు ప్రేమను సంపాదించి
పెడుతుందని చెప్పాడు గురజాడ. ప్రేమ అంటే గురజాడ దృష్టిలో సాటి మానవుల
సుఖదుఃఖాలకు స్పందించి వారికి ఏమాత్రమైనా ఊరట కలిగించటానికి చూసే
మానవీయ ప్రతిస్పందన అన్నది స్పష్టం.
ప్రేమ అంటే పిచ్చిగా, తీవ్రమైన భావావేశంగా, స్త్రీనుండి ఏమేమో ఆశించటంగా