తేలుతుంది.
రకరకాల అంశాల మీద గురజాడ తనలో తాను తిప్పుకొంటున్న ముడి ఆలోచనలను
‘మై ఓన్ థాట్స్’ అనే శీర్షిక కింద వ్రాసిపెట్టుకొన్న నోట్స్ రచనా కాలం జీవితకాలమే తప్ప
నిర్ధిష్టంగా లేదు. ఆ నోట్స్ లో ప్రేమ గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. మానవాత్మ
యొక్క కాంతిమంతమైన పుష్పం ప్రేమ అంటాడు. ప్రేమ అంటే పిచ్చీకాదు, తీవ్రమైన
భావావేశమూ కాదు. ప్రేమ అంటే అందమైన స్వభావం నుండి ప్రకాశమానం అయ్యే
సౌందర్యాన్ని, స్ఫటిక స్వచ్ఛత గల అనురాగమయ ఆత్మలను, దయను, శాంతాన్ని,
ప్రశాంతతను ఆరాధించటం అని భావించాడు.
సౌదామిని నవల వ్రాయటానికి వ్రాసుకొన్న నోట్స్ కూడా నిర్ధిష్టమైన రచనా కాలం
లేనిదే. ఇందులో ప్రేమ దానంతట అది, అంతకన్నా అధికమైనదానితో రూపాంతరం
చెందుతుందని, అందులోని ప్రమాదాలనూ గుర్తిస్తుందని, ప్రేమలో దోషాలు సైతం సౌందర్యాన్ని
పొందుతాయని, అజ్ఞానం కూడా సుగుణమే అవుతుందని చెప్పాడు. ప్రేమ అంటే ఎటు
వంటి ఆరోపణ లేకుండా మనుషులను ఆమోదించే అత్యున్నత మానవ తత్వంగా
గురజాడ ప్రతిపాదించినట్లు కనబడుతుంది. (గురుజాడలు, పు;909)
సౌదామిని నోట్స్ లోనే మరొక చోట “ప్రేమించటం అంటే స్నేహం చేయటం.
అంతకన్నా ఎక్కువ మరేమీ ఆశించకపోవటం. ప్రేమిస్తున్నవ్యక్తికి హాని కలిగించకపోవటం”
అని కూడా చెప్పాడు గురజాడ. ( గురుజాడలు, పు;912) గురజాడ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన 159 మందిలో (గురుజాడలు, మనసు ఫౌండేషన్,2012) ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం
ఒకడు. ఆయన విజయనగరం కాలేజీ విద్యార్థి. గురజాడ సహాయ సహకారాలతో చదువు
పూర్తి చేసుకొన్నాడు. గురజాడ సాహిత్య వ్యాసంగాన్ని సన్నిహితంగా చూస్తూ
అభిమానించాడు. అతను బిఎ పూర్తి చేసుకొని స్వస్థలం నెల్లూరు వెళ్ళిపోయిన తరువాత
1909 నుండి వాళ్ళిద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. గురజాడ వ్రాసిన లేఖలు
అనేకానేక సాహిత్య సామాజిక కళా శాస్త్ర విషయాలు చర్చిస్తూ సుదీర్ఘంగా సాగాయి. అట్లా
చర్చించబడిన విషయాలలో ‘ప్రేమ’ కూడా ఒకటి.
గురజాడ ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి 1909 మే 21 న వ్రాసిన ఉత్తరంలో
‘సాహిత్యం కేవలం స్త్రీపురుష శారీరకవాంఛలు, కామప్రవృత్తితోనే ఎందుకు నిండి
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు