చందు శివన్న
పసిదాన్ని ఏనుగు అంబారి ఎక్కించుకున్నప్పుడే
నాన్నగా ఓటమి మొదలైంది
ఒక్కకసారిగా నాన్న గుర్తొచ్చాడు
వాన్నగా నాన్న ఓడిపోవడం ఎప్పుడు మొదలైంది
వాన్నవలస పాదాలను కుట్టించుకున్నప్పుడు
మొదటిసారి ఓడిపోయిన జ్ఞాపకం
పెద్దకాపుల పెద్దరికాన్ని నిలబెట్టడానికి
స్వేదపంద్రమైన నాన్న పగిలిపోవడం గుర్తు
ఎన్ని ఓటములకు పురావస్తు ఆధారం నాన్న
ఎన్ని కన్నీటి సంఘటనల రూపాంతరం నాన్న
జీవిత రంగస్థలంమీద నాన్నదెప్పుడూ పరాజితుని పాత్రే
స్కూల్‌పరీక్ష ఫీజు కట్టక
మాస్టారు బయట నిలబెట్టినప్పటి అవమానాన్ని
ఇంటికొచ్చి నాన్న మీద దులిపివప్పుడు
నాన్నగా నాన్న ఓడిపోయాడనకున్నాడేమో
ఆ రాత్రంతా
వాన్న దు:ఖపు వాసనేసాడు
మంచి మార్కులొచ్చాయి పెద్ద చదువులు చదివించమని
అయ్య వార్డు మందలించినప్పుడు
నాన్నగా నాన్న ఓడిపోయాననుకున్నాడేమో
ఆ వారమంతా
నాన్న చెట్టు ఆకులన్ని రాల్చి మోడై పోయింది
అప్పులొల్లు
ఉన్నరెండెడ్లను తోలుకుపోయినపుడు
అలవాటైన నిస్సహాయ యోగముద్ర లోబంధీయై
నాన్నగా వాన్న ఓడిపోయాననుకున్నాడేమో
ఎద్దుల గిట్టలకెల్లి కన్నీరై పారాడాడు
నాన్నకు ఓటమి అనే ఒక్క ఆసనం ఏమిటి
ఆకలైనప్పుడు తువ్వాలను
కడుపుకు బిగించుకొని బోర్లా పడుకునే ఆపనం
గొడ్డుకారంతో పెట్టిన విద్య
రెడ్డిముందు చెవుల్లో మోకాళ్ళను
ఇరికించుకొని దిగాలుపడి కూర్చునే
బోధిస్తత్వువి ఆసనం
సముద్రాన్ని కళ్ళల్లోనే కాదు
సకల రోమరంధ్రాల్లోంచి నిరంతరంగా పారించే
ఆసనం
చివరకు
ఆకాశపు చిలక్కొయ్యకు గొంతును వేలాడదీసి
గంటల తరబడి శ్వాస మీద ధ్యాసను నిలిపే ఆసనం
విజంగా
మనం గెలవడం కోసం
కన్నీటి కడవలను సముద్రానికి అప్పిచ్చినవాడు నాన్న
సత్యంగా చెప్పండి
గెలిచినవారందరూ నాన్నముందు ఓడిపోలేదూ
మిరాశి = వ్యత్తిగాయకులకు వారసత్వంగా వస్తున్న హక్కుపత్రం