హవల్దార్ పాత్ర – సారా కొట్టుసీను: “కుంపిణీ నమ్మక్ తిన్న తరువాత ప్రాణం
ఉన్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే
పించను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకి వెయ్యమా?”
“రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు?”
అని మునసబు రెట్టించి అడుగుతాడు. దానికి హవల్దారు, “మొన్నగాక మొన్న యింగిరీజ్
రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలాడా లేదా? అప్పుడేవైందో,
యిప్పుడూ అదే అవుతుంది. మా రాణి చల్లగా ఉండాలి…!”
“సీమరాణి ఆ కాళీమాయి అవుతారం కాదా?” అనడిగితే, “కాళీ గీళీ జాంతానై-ఆ
రాముడి అవతారం”.
నేషనల్ కాంగ్రెస్ మితవాదుల సగటు ఆలోచనాధోరణిని ఈ సంభాషణలు తేటతెల్లం
చేస్తున్నాయి. మనుషులు చేసిన దేవుళ్ళారా…! మీ పేరేమిటి? కథలో కనిపించే శైవ వైష్ణవ
భేదాలు కూడా ఈ సంభాషణలో ధ్వనిస్తాయి.
కన్యాశుల్కం నాటకంలో సార్వజనీనత, సార్వకాలీనతలు కొట్టొచ్చినట్టు
కనిపించటానికి గురజాడ ప్రదర్శించిన ఈ రాజకీయ చైతన్యమే కారణం. బ్రిటీష్వారితో
మంచిగా వ్యవహరిస్తూ, ఎదురు తిరక్కుండా నమ్రతగా ఉంటూ, దేశానికి స్వాతంత్ర్యాన్ని
బ్రతిమాలో బామాలో తెచ్చుకోవాలనే మితవాదుల ఆలోచనని ఏ మాత్రం
అంగీకరించలేదనటానికి ఈ నాటకంలో ఇలాంటి సంభాషణలు అనేకం సాక్ష్యం.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు