యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజెస్లో లెక్చర్లు యంత మాత్రం కార్యం లేదు…”
“(దేవుణ్ణి ఉద్దేశించి) యిలాంటి చిక్కులు పెట్టావంటే, హెవెన్లో చిన్న నేషనల్
కాంగ్రెస్ లేవదీస్తాను”
“అన్ని మతాలూ పరిశీలించి వాటి యస్సెన్స్ నిగ్గుతీసి ఒక కొత్తమతాన్ని ఏర్పాటు
చేశాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలింప చేస్తాను” లాంటివెన్నో ఆనాటి రాజకీయపక్షుల
మీద వ్యంగ్యాలు కన్యాశుల్కంలో కనిపిస్తాయి.
“దేశాభిమానం నాకు కద్దని/వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్/పూని యేదైనాను ఒక
మేల్/కూర్చి జనులకు చూపవోయ్” దేశభక్తి గీతంలోని ఈ చరణంలో వొట్టి గొప్పలు
చెప్పుకోవద్దంటూ పెట్టిన వాత ఎవరిని ఉద్దేశించో తెలియాలి.
నేషనల్ కాంగ్రెసుకు ఆ తొలినాళ్లలోనే అంతగా వాతలు పెట్టటానికి బలమైన కారణాలే
ఉన్నాయి. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్ర విభజనకు నిరసనగా బెంగాలీలు విదేశీ
వస్తు బహిష్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో వందేమాతరం గీతం
బెంగాలంతా ప్రతిధ్వనించింది. అది వందేమాతరం ఉద్యమంగా ప్రసిద్ధి పొంది దేశం
అంతా వ్యాపించింది.
1906 కలకత్తా కాంగ్రెస్ ‘స్వరాజ్యం, స్వదేశీ, జాతీయ విద్య’ ఈ మూడు అంశాలు
లక్ష్యాలుగా కొన్ని తీర్మానాలను ఆమోదించింది. బ్రిటీష్ అనుకూలత ద్వారా దేశానికి మంచి
సాధించుకోవాలనే ధోరణిలో నేషనల్ కాంగ్రెసును నడుపుకొస్తున్న సర్ ఫిరోజ్ షా
మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి
సీనియర్ కాంగ్రెస్ నాయకులు ‘బోయ్కాట్’ లాంటి పదజాలం పట్ల వ్యతిరేకత
కనపరచారు. లాలాలజపతి రాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాలు ప్రభృతుల
నాయకత్వంలో కొందరు అతివాదులు ఈ మార్గాన్ని వ్యతిరేకించి, బ్రిటీష్ వారి పైన
పోరాటానికి సిద్ధపడ్డారు. ఈ ముగ్గురినీ లాల్ బాల్ పాల్ త్రయంగా పేర్కొంటారు. వీళ్లని
అతివాదులనీ, చేంజర్స్ అనీ పిలవసాగారు.
ఆ మరుసటి సంవత్సరం 1907లో సూరత్లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో
అతివాదులకూ, మితవాదులకూ తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. మితవాదులు
రాస్ విహారీ ఘోష్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచించగా, అతివాదుల పక్షాన లాలాలజపతి
రాయ్ని పోటీకి నిలబెడుతున్నట్టువేదిక మీదనుంచి తిలక్ ప్రతిపాదించాడు. ఆయన అలా
ప్రసంగిస్తూ ఉండగా జనం లోంచి ఒక బూటు వచ్చి వేదికపైన ఉన్న ఫిరోజ్ షా మెహతా
చెంపకు తగిలి, పక్కనేఉన్న సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడింది.
బూటుని మెహతా, బెనర్జీల వర్గం వాళ్ళు తిలక్ మీదకు విసిరితే అది గురి తప్పి
సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడిందో…లేక తిలక్ వర్గీయులే మెహతా బెనర్జీల మీదకు
విసిరారో ఎవరికీ తెలియదు. బూటు వచ్చి తగిలింది. నువ్వంటే నువ్వని కారణాన్ని
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు