బెట్టుకోకోయి” అనే చరణం ఉంది. దీన్ని కొందరు గురజాడ ప్రదర్శించిన
ఆంగ్లేయానుకూలతగా భావిస్తారు. నిజానికి ఇది అన్ని కులాల, మతాల వారికీ దేశమే
దేవత అనే భావన బలపడుతున్న దశలో అందుకు ప్రతిబంధకంగా నిలిచే వారికి చేసిన
హెచ్చరిక. హిందూ శబ్దాన్నిదేశీయులనే అర్థంలో గాక, మతస్థులనే అర్థంలో ప్రయోగించి,
ఈ దేశంలో అన్యమతస్థులకు తావులేదని వాదించే వాళ్ళకి ఇది అంటించిన చురక.
గురజాడకు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధాలు బాగానే నడిచాయి. తన డైరీలో
1887 అక్టోబరు,27న విజయనగరం కాంగ్రెస్ సభలో తాను పాల్గొన్నట్టు రాసుకున్నారు.
కానీ, కాంగ్రెస్లోని మితవాద ధోరణులపట్ల ఆయన తన విసుగుదలని కన్యాశుల్కంలో
ఎన్నో పాత్రల ద్వారా ప్రదర్శిస్తారు.
“తమ్ముడూ! గిరీశంగారు గొప్పవారష్రా?” అని బుచ్చమ్మ అడిగితే, వెంకటేశం
“గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేమిటీ? సురేంద్రనాథ్ బెనర్జీ అంత
గొప్పవారు” అంటాడు, “అతగాడెవరు?” అనడిగితే, వాడికి ఏం చెప్పాలో తెలియక
బుర్రగోక్కుని, “అందరికంటే మరీ గొప్పవాడు” అనేస్తాడు. దేశాన్ని గిరీశంగారు “యెలా
మరమ్మత్తు చేస్తున్నార్రా?” అనడుగుతుంది. దానికి వెంకటేశం చెప్పిన సమాధానం ఇది:
“నావంటి కుర్రాళ్లకు చదువు చెప్పడం, (నెమ్మళంగా) చుట్టనేర్పడం, గట్టిగా నాచ్చి
కొశ్చన్ అనగా సానివాళ్ల నందరినీ దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్
అనగా దివాన్గిరీ చెలాయించడం ఒహటి. ఇప్పుడు తెలిసిందా…?” అని సమాధానం
చెప్తాడు వెంకటేశం. ‘నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం’ అని ఈనాటకంలో
ఒక బొడ్డూడని కుర్రాడే అన్నప్పటికీ, అది గిరీశం అభిప్రాయంగానే కన్పిస్తుంది. అందుకే
మరో సీనులో, గిరీశమే అంటాడు: “ఒక సంవత్సరం గానీ నాకు దేవుడు దివాన్గిరీ యిస్తే,
భీమునిపట్టణానికి పాల సముద్రం, విశాఖపట్టణానికి మంచినీళ్ళ సముద్రం,
కళింగపట్టణానికి చెరకు సముద్రం తెస్తాను” అని, ఇక్కడ దివాన్గిరీ అంటే కాంగ్రెస్ పదవి.
“పొలిటికల్ మహాస్త్రం అంటే, “ఒకడు చెప్పిందల్లాబాగుందండవే! సమ్మోహనాస్త్రం అంటే
అదే కదా…!”, “ఒపీనియన్లు అప్పుడప్పుడు చేంజి చేస్తూంటే గానీ పొలిటీషియన్
కానేరడు” లాంటి సంభాషణల్లో కనిపించే నాటి పొలిటీషియన్ నాటి నేషనల్ కాంగ్రెస్
వాడే! దేశంలో రాజకీయ సంస్థ ఆనాడు అదొక్కటే కాబట్టి!
“మొన్న బంగాళీవాడు (బహుశా బిపిన్ చంద్రపాల్ కావచ్చు) ఈ ఊర్లో
లెక్చరిచినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ…?”
“పెళ్ళి ఆపడానికి బ్రహ్మ శక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చి చెప్పినా
మీ తండ్రి వినడు”
“మొన్న మనం వచ్చిన బండి వాడికి నాషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు
లెక్చరు ఇచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్ల ఊరు హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెసు వారు
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు