రామరావణ యుద్ధంలానే ఉంది. దేనికదే సాటి అని అర్థం. ఎంత సులభంగా
అర్థమయింది?..
సంగీత పరంగా : వాల్మీకి రామాయణం రాస్తూ ‘పాఠ్యే గేయేచ మధురం’ అన్నాడు.
రామాయణంపాడుకోవడానికి, చదువుకోవడానికి అనువైంది అన్నాడు. అందుకేగాంధర్వ
విద్యా మర్మజ్ఞులైన కుశలవులచే గానం చేయించినట్టు చెప్పుకున్నాడు.
గురజాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మగానీ, దేశమును ప్రేమించుమన్నా అన్నది కానీ ఏ
రాగానికైనా ఒదిగే స్వభావం కలిగి ఉండడం గమనించవచ్చు.
స్వరపరిచే వారికి రామాయణంగానీ, ముత్యాలసరంగానీ చక్కగా ఇముడుతాయి.
పాడేవాడి గాత్రానుగుణంగా అద్భుతంగా గానానుకూలంగా ఉంటాయి.
- అభిప్రాయపరంగా…
వాల్మీకిని స్తుతిస్తూ వాల్మీకిని కోకిలగా వర్ణించారు.
‘కూజన్తం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్’
గురజాడ
‘ఆకులందున అణిగి మణిగి
కవిత కోకిల పలకవలెనోయ్’
ఇద్దరూ కవితాకోకిలలే, ఇద్దరూ కవితాశాఖలపై నుండి సర్వజన సమ్మోహనంగా,
సకల లోక వశంకరంగా గానం చేశారు. - సందేశపరంగా…
‘విశ్వశ్శ్రేయః కావ్యం’ విశ్వానికి శ్రేయోమార్గం ఉపదేశించేదే కవిత్వం. అది శ్లోకంలో
ఉందా? పద్యంలో ఉందా? గద్యంలో ఉందా? ఏ ఛందస్సులో ఉంది? ఏ ఛందంగా ఉంది?
అనేది కాదు.
కాబట్టి, విశ్వ సందేశాన్ని అందించాడు. కాబట్టి వాల్మీకి జగద్వంద్యుడైనాడు. విశ్వ
వీధుల్లో నినదించాడు. కాబట్టే, గురజాడ మహాకవి అయినాడు.
అందుకే, ‘భక్త్యా భాగవతం జ్ఞేయం
భక్త్యా, యుక్త్యాచ భారతం’
అలాగే; ఇక మన గురజాడ ముత్యాల సరంలో
‘మేలిమి బంగరు మెలతల్లారా!
కలువల కన్నుల కన్నెల్లారా!
తల్లులగన్న పిల్లల్లారా!
విన్నారమ్మా ఈ కథను?’…..దీనికర్థమే చెప్పనక్కరలేదు.