ఆస్వాదిస్తునే ఉన్నారు.
నాకు, ఇటీవల తే2016-01-10దిన ‘గురజాడ స్ఫూర్తి రత్న’ పురస్కారాన్ని గురజాడ
సంస్థ (అమెరికా) వారు (అరుణా గురజాడగారు) గురజాడ కుటుంబ సభ్యులు (శ్రీ
రవీంద్రుడు గురజాడ మొదలగువారు) విజయనగరం, గురజాడవారింట్లో ఇచ్చారు. ఈ
సందర్భంలో మరోసారి గురజాడ వారిని చూశాను. నాకు వారిలో ఓ వాల్మీకి
దర్శనమిచ్చారు. అందుకే ‘అభినవ వాల్మీకి’ అన్నాను. అంతకు ముందు ఈమాటెవరైనా
అన్నారా అని ఆరా తీసినప్పుడు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారన్నారని విన్నాను. కాని
వారేమన్నారో, ఎలా సమన్వయించారో మాత్రం ఇప్పటికీ నాకు తెలియదు. కానీ
నేననుకున్నది, వినిపించాలని ఆ సభలో రేఖామాత్రంగా అన్నాను. దాన్నే ఇప్పుడు
అక్షరరూపంలో అంటున్నాను.
(అ) గురజాడ పద్యం :
ఆధునికాంధ్ర సాహిత్యానికి
మార్గదర్శకుడై, మలుపు తిప్పిన మహాకవి,
పద్యాలు రాయలేదా? రాస్తే ఎలా ఉన్నాయి?
చూద్దామని అనిపించింది. అయితే గురజాడ
పద్యం సరళంగా, సందేశాత్మకంగా సాగి
సామాన్యులకు కూడా ఇట్టే అర్థమైనట్టు
ఉంటుంది. మచ్చుకు రెండు మూడు
చూద్దాం.
సుభద్ర ఇతివృత్తంగా సాగిన
పద్యకావ్యంలో ఈ పద్యం చూడండి.
“ధర్మముండుచోట దైవ బలంబుండు
కలుగ దైవబలము కలుగు జయము”
ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ దైవం
ఉంటాడు. దైవం ఎక్కడ ఉంటే తప్పక జయం కలుగుతుందని ఎంత సరళంగా, సందేశాత్మకంగా పద్యం నడిచిందో నేను చెప్పక్కరలేదు.
అలాగే అర్జునుణ్ణి వర్ణిస్తూ,
“ఏడు లోకంబుల నెనలేని విల్లుకా
డెవ్వడెటెనంగ గవ్వడియట
సాటి వారల పట్ల సౌహార్దమొనరించు
మేటి ఎవడన కిరీటియనగ
నెనరు నేర్పులు గల్గు నెఱజాణుడెవడన్న