అభినవ వాల్మీకి
– తొలి సంచిక
సీ. ముత్యాల సరములన్ పూర్ణమ్మనే జూపి
కవుల మన్నన గొన్న ఘనత నీది!
‘దిద్దుబాటు’ ను జూపి పెద్దగా నిలబడి
కథకునిగా గొన్న ఖ్యాతినీది!
మాండలికానికి మాన్యత కల్పించి
ప్రజలమన్నన పొందు ప్రతిభ నీది!
దేశభక్తిని దశదిశలకు వినిపించి
గొప్పను వడసిన మెప్పు నీది!
తే. విశ్వకీర్తిని గొన్నట్టి విమలచరిత!
ఆధునిక కవి పూజ్యుడా! అగ్రగణ్య!
విజయ నగరానికే గొప్ప వెలుగునీవ!
ప్రథిత! అభినవ వాల్మీకి! భవ్యచరిత!
అందుకో! గురజాడ! మా వందనములు!
‘ఏరుల జన్మంబు ఎరుగ నగునే’ అంటారు – నన్నయ. అలాగే మహాకవుల కవితాసృష్టిని విశ్లేషిస్తున్న కొద్దీ ఇంకా ఉండనే ఉంటుంది. ఎంత మంది ఎన్ని విధాల పరిశీలించినా పరిశోధించినా అంతుబట్టదు. అలాంటివారి కోవలోకి చెందిన వారే
మహాకవి గురజాడ వేంకట అప్పారావుగారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో
పుంఖానుపుంఖంగా గురజాడపై ఎందరో ఎన్నో వ్యాసాల పరంపరలు వెలిబుచ్చారు.
ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంతే ఆసక్తిగా సాహితీప్రియులు వాటన్నిటినీ