– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
ఈ నంచికలో, నమాజంలోని అసమానతలని, వేదనలని ఎత్తిచూవుతూ ఉద్వేగభరితంగా రాసిన కవితల ఉద్యమాల గురించి వివరంగా, విశ్లేషణాత్మకంగా రాసిన చక్కని వ్యాసాలు ఉన్నాయి. కవిత్వోద్యమాల ద్వారా ప్రజా నమన్యల్ని జనబాహుళ్యాణికి తెలియచేస్తూ పరిష్కారాలు వెదికే దిశగా ఉత్తేజపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనుకోకుండా, గూగులయ్య దయవల్ల దొరికిన ద్వానా శాస్త్రిగారి వ్యాసం కవిత్వోద్యమాల గురించిన విహంగ వీక్షణంలా వ్రకాశించింది.
కమ్యూనిజం, సోషలిజం స్ఫూర్తితో అభ్యుదయ, వివ్లవ కవిత్వాలు రాసినవారు ఆ వ్యవస్థలు నిజంగా అభ్యుదయ సమాజానికి ప్రతీక, ప్రతినిధి అని నమ్మి రాసారు. రష్యా, చైనాలు కమ్యూనిజాన్ని వదిలి పెట్టుబడిదారీ వ్యవస్థని అనుసరించి రాజ్య విస్తరణాకాంక్షతో విశృంఖలంగా విజృంభిస్తోంటే అలనాటి కమ్యూనిజం ఇచ్చిన ఉత్తేజంతో ఉరకలెత్తిన కవులు కొంతమంది ఇంకా అదే మత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పటి కమ్యూనిష్టు రాజ్యాలయిన చైనా, రష్యాలలో మనుషులు పాలకుల చేతిలో ఊచకోతకి గురవుతూ ఉంటే, ఆ దేశాలలో అధికారంలో ఉన్నవారు సంవదని కొల్లగొడుతూ ప్రజలని అణగా దొక్కుతోంటే అదే స్ఫూర్తితో కవితలు రాయడం కష్టం కదా. అనుచితం, అసంబద్ధం కూడా. ఇజాలకతీతంగా మానవుల దుస్థితిని నిరసిస్తూ, సమసమాజ నిర్మాణ న్ఫూర్తి వైపు పౌరుల మనోస్థితిని సమాయత్తం చేయడం అభ్యుదయ, విప్లవ కవిత్వాల ఉద్దేశం, ధ్యేయంగా ఉండాలి.
అభ్యుదయ భావాలని పద్యరూపంలో చెప్పిన వేమనని ప్రజా కవిగా అభ్యుదయ కవిగా పొగుడుతున్నాం. అదే పద్య ప్రక్రియలో అభ్యుదయ, విప్లవాత్మక భావాలని వెదజల్లిన జాషువా, కరుణశ్రీ ల వంటి కవులని మాత్రం ఆ కోవలో జమకట్టి గౌరవించలేకపోతున్నాం. అభ్యుదయ తత్వం కమ్యూనిజం మూసకి మాత్రమే పరిమితి అయ్యేలా నిర్వచించడం వల్ల ఆ కవిత్వ ధోరణి విస్త్రుతి నియంత్రించబడింది. కమ్యూనిజం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సన్నగిల్లడంతో అభ్యుదయ కవిత్వ ఉద్యమం నీరుగారిందనిపిస్తోంది. ఇప్పటికీ, వ్రపంచవ్యాప్తంగా ప్రజల సమస్యలు, సమాజ స్థితిగతులూ దైన్యంగానే ఉన్నాయి. ఎవరిని నిందిస్తాం? ఏ వ్యవస్థని నిరసిస్తాం? రాతలలో కమ్యూనిజం, సోషలిజం వెల్లువిరిసినా, వాస్తవ జీవితంలో పెట్టుబడిదారీ, పెత్తందారీ వ్యవస్థలకి ప్రతినిధులుగా వ్యవహరించే కొంతమంది కవుల తీరు వారి స్ఫూర్తిదాయకమైన పలుకులకి విలువ తగ్గిస్తోంది అనిపిస్తోంది.
నిరసన ప్రాతిపదికగా కాకుండా ప్రజా సమస్యలని వెలుగులోకి తెస్తూ, సమాజం లోని లోపాలు ఎత్తిచూపే విధంగా, వ్రజల దృష్టిని ఆకర్షిస్తూ ప్రభావవంతంగా రాయగల కవిత్వం ఏదైనా అభ్యుదయ కవిత్వమే. ఏ సిద్ధాంతాన్నయినా నమ్మి, ఆచరించి రాసే ఏ మాటయినా అభ్యుదయ గీతమే అవుతుంది. “చిత్తశుద్ది లేని శివ వూజాలేలయా” అన్నట్టు రాసే దానికి, చేసే దానికి పొంతన లేని రచయితలు నమాజంలో ప్రభావశీల పాత్ర వహించలేరని నా నమ్మకం. కొన్ని సంవత్సరాలు మాటల ద్వారా వ్రభావితం చేసినా చరిత్ర లో చిరకాలం నిలవడం కష్టమే. ఈ సందర్భంగా నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పి ఆచరించిన మహానుభావులు కందుకూరి వారిని తలుచుకుంటూ ఒక వ్యాసం కూడా వేస్తున్నాం.
అభ్యుదయ కవిత్వ రచన ఒక వృత్తి కాదు. అభ్యుదయ భావాలు మన ప్రతీ పనిలోనూ, ఆలోచనలలోనూ, ప్రతి మాటలోనూ ఉన్నప్పుడే అభ్యుదయ భావనలు వేనంగి లో మల్లెల పరిమళంలా, ఉక్కపోతకి గురవుతున్న సమాజంలో నువాననతో కూడిన ఒకతాజా “సువాసనాలోచనలని”, ఆశలని మొలకెత్తిస్తాయి.
ఈ సంచిక లోని వ్యాసాలు భావి విద్యార్థులకీ, పరిశోధకులకీ ఉపయోగకరంగా ఉంటాయని నమ్ముతున్నాను.