– డాక్టర్ చాగంటి కృష్ణ కుమారి
జెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని ప్రాగ్ (prague) నగరంలో గ్రెట్టి థెరిస్సా యూదుల యింట పుట్టింది. కర్ల్ ఫెర్దినండ్ కోరి జన్మస్థానమూ ప్రాగే. జర్మన్ యూనివర్సిటి ఆఫ్ ప్రాగ్ నుండి వైద్యశాస్త్రంలో డాక్టరేట్ ను వీరిరువురూ పొందారు. ఇద్దరికీ మంచి స్నేహం కుదరడంతో 1920లో వివాహితులయారు. తదుపరి పరిశోధనలన్నీ పరస్పరం సహకరించు కొంటూ కలసి కొనసాగించారు. 1947వ సంవత్సరపు నోబెల్ బహుమానంలో సగభాగం ఈ దంపతులకి దక్కగా మరో సగాన్ని ఆర్డెంటీనాకి చెందిన బెర్నాడో ఆల్ఫెట్రో హౌస్సె వేరొక పరిశోధనకు అందుకొన్నాడు.
గెట్టి కోరి సైన్స్ విభాగంలో నోబెల్ ని అందుకొన్న మూడవ మహిళగా వైద్యశాస్త్ర విభాగంలో దానిని చెజిక్కించుకొన్న _ తొలిమహిళగా నిలిచింది. ఈ రంగాలలో మహిళల సంఖ్య గణింప తగ్గదిగా లేదు కనక, వారు వివక్షతకు గురవుతూ వున్నారు కనక పరిశోధనాఫలితాల ఉతృష్టతకీ లింగానికీ సంబంధం లేకపోయినా,ఈ సంగతిని చెప్పుకోవలసి వుంది; ఎందుకంటే గ్రెట్టి కోరి కూడా అటువంటి వివక్షతను చవిచూసినదే!.
గ్లైకోజిన్ యొక్క ఉత్రేరక మార్పిడి చక్రీయ చర్యా తీరును కనుగొన్నందుకు కోరి దంపతులు నోబెల్ ను పొందారు. మనం తిన్న ఆహారం కండరాలలొ శక్తిగా మారుతుంది. ఈ మార్పును మన శరీరంలో కణాలు చక్రీయ పద్దతిలో నిర్వహిస్తాయని ఈ దంపతులు కనుగొన్నారు. ఈ చక్రీయ చర్య ‘కోరి చక్రం’ గా ప్రసిద్ది చెందింది.
మన శరీరంలో గ్లెకోజిన్ రసాయనము గ్లూకోజ్ ను నిలువ వుంచే ప్రధాన రూపము. ఇది ఒకి బృహదణువు. పొడవైన పలు ఉపశాఖలు కలిగిన గ్లూకోజ్ యూనిట్ ల తో కూడి వుంటుంది. దీని నుండే మనకు శక్తి లభిస్తుంది. దీనిని మనము. కార్బో హైడ్రేట్లు వున్న( పిండిపదార్థాలు) ఘన, ద్రవ అహార పదార్థాలద్వారా పొందుతాము. నాలుగు గ్లూకోజు “లతో ఏర్పడిన గై! గ్లెకోజిన్ టెట్రామర్ నూ, పలు శాఖోపశాఖలుగా రసాయన భందాలతో ఏర్పడిన గ్ల ్‌కోజిన్ బృహదణువు నిర్మాణాలను పటము -1,2 లలో చూడవచ్చు .
మన నెత్తురులో వుండే ఒక రకానికి చెందిన చక్కెర గ్టూకోజు. ఇదికణాలకు ప్రధాన శక్తి ఇంధనము. పరిగెత్తాలన్నా, బరువులు ఎత్తవలసి వచ్చినా, నడవాలన్నా, కనీసం నిలబడాలన్నా కూడా మనకి బలంకావాలి . ఈ బలాన్ని కండరాలు మనకిస్తాయి. బలాన్ని వాడాలంటే శక్తిని ఖర్చు చేయాలి. కండరాలు పని చేయాలంటే ఎటిపి (40 -ఇ4ల09106 చష్టు[౦0కన266) అవసరము. అస్థిపంజర కండరాలలో నిలవ వున్న గె గెకోజిన్ రసాయనం గ్లైకోజినొలిసిస్((స౦0క్రం200:509) అనే చర్యలో గ్లూకోజ్ గానూ, గ్టూకోజ్- పోస్ఫేట్ (౯0096-1 -గింకు[&66) గా విడిపోతుంది. పటము -32 , 0, 6) గ్జూకోజ్-1 పోస్సేట్ కోరి ఎస్టర్ గా కొరి దంపతుల పేరు మీదుగా పేర్కొంటారు. దీని అయోనిక్ రూపము (3-1, తటస్థ రూపము-3- 6) లను పటములో చూడవచ్చు. వీరు ఈ ఎస్టర్ ను తాయారుచేసి స్పటిక రూపంలోకి కూడా మార్చగలిగారు.
ఈ జీవరసాయన చర్య కాలేయకణాలలో నూ(hepatocytes) కండర కణాలలోనూ (myocytes) జరుగుతుంది. రెండు కీలకమైన ఎంజైములు (phosphorylase kinase and glycogen phosphorylase) ఈచర్యను క్రమబద్దీకరిస్తాయి.
మనం రోజూ చెసే కార్యకలాపాలలో కండరాలు గ్టూకోజ్, అమ్లజనిని ఉపయోగిస్తూ జరిపేచర్య పేరు గ్లైకాలిసిస్ (glycolysis). ఈ సామ్లజన చర్యలో (aerobic) రెండు యూనిట్ల ఎటిపి, రెండు యూనిట్ల పైరువేట్ (pyruvate) ( (పటము -4)ఏర్పడతాయి. ఎటిపి నేరుగా శక్తి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. తగినంత ఆక్సిజన్ అందుబాటులో వున్నప్పుడు పైరువేట్ కూడా సామ్లజనీయంగా (aerobically) విడిపోతూ శక్తిని మరింతగా ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు జీవ రసాయన క్రియా సమ్మేళనాలు(metabolic compounds) కణస్థాయిలో కండరాలకు శక్తిని ఇస్తూ కండరాలు పనిచేయడానికి తోడ్పడతాయి .
కానీ మనము విపరీత స్థాయిలో కడరాలను వాడుతూ పనిచేసినపుడు అందుకు తగ్గ కండరాలకు కావలసినంత శక్తి అవసరానికి సరిపడినంత లోనికి తీసుకొన్న ఆక్సిజన్ (0వ. 06218) లేనప్పుడు, ఆక్సిజన్ తక్కువైంది కనక గ్టూకోజు వాయురహిత జీవక్రియ లో (20ఇథం016 9662001190) విడిపోతుంది. పైరువేట్ లాక్టేట్ గా మారి నెత్తుటి ప్రవాహంలో కి చేరుతుంది. ఈ చర్య ఆక్సిజన్ తక్కువైనప్పుడు కూడా శక్తి ఉత్పత్తి కొనసాగడానికి తోడ్పడుతుంది. కానీ ఇది చాలా వేగంగా జరుగుతూ ఒకటి నుండి మూడు నిముషాల వరకే వుంటుంది. ఎప్పుడైతే నెత్తుటి ప్రవాహంలో లేక్టేట్ ప్రమాణం అధికమవుతుందో అప్పుడు మనము అలసటకు గురవుతాము.
కోరి చక్రం :
మనం ఇంకా శ్రమపడుతూ పనిని కొనసాగిస్తూవుంటే మన శరీరం ప్రత్యా మ్నూయ జీవక్రియా దారిని ఎంచుకొని తద్వారా లాక్టేట్ ని గ్లోకోజు గా మార్చు కొని ఆక్సిజన్ రహితంగా కూడా శక్తిఉత్పత్తి జరిగేలా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకొంటుంది. ఈ రకంగా శరీరం శక్తిని పొందడాన్నే కోరి చక్రం (Cori cycle) అంటాము. ఇదెలాగంటే, కండర కణాలలొ చేరిన లాక్టేట్ ను కాలేయం (లు) గ్రహించి గ్లోకోనియోజెనిసిస్ ( gluconeogenesis) అనే రసాయన చర్యావిధానంలో లాక్టే ట్ ను గ్జూకోజ్ గా మారుస్తుంది. గ్టూకోజ్ నెత్తుటి ప్రవాహంలోకి చేరగా అది పని చేస్తున్న కండరాలకు చేరవేస్తుంది. అదనంగా అవసరమైన శక్తిని అందిస్తుంది. తరువాత ఏర్పడిన లేక్టేట్ ను కాలేయం గ్రహించగా కోరి చక్ర విధానంలో చక్రీయంగా ఈ చర్యలు జరుగుతాయి. కోరి చక్రాన్ని పటము- విశదీకరిస్తుంది.
ఈ చక్ర ప్రతిపాదనను 1929 లో కోరి దంపతులు చిత్రాత్మకంగా నిరూపించారు. అవిధంగా ఈ చక్రీయ చర్యకు కోరి చక్రం అని పేరు పెట్టారు.
కోరి చక్రానికి పరిమితులు వున్నాయి. అది నిరంతరంగా జరగదు. కండరాలలో గ్లెకొసిస్ వల్ల రెండు యూనిట్ల ఎటిపి ని మాత్రమే తయారవుతుంది. కాలేయం గ్లోకోనియోజెనిసిస్ చర్యలో ఆరు యూనిట్ల ఎటిపి వాడుతుంది (చూడు పటము-5 ). అంతే కాదు కోరి చక్రములో చర్యలు మొదలవడానికీ ప్రారంభ ఆక్సిజన్ చేరి వుండాలి. ఆక్సిజన్ లేని పక్షంలో చక్రచర్య మొదలవదు. అందు చేత కండరాలకి తొలుతగా గ్లూకోజు, ఆక్సిజన్ లు సరఫరా అయి వుండకతప్పదు. అందువల్ల _ ఎప్పటికప్పుడు ఆక్సిజన్ గ్లోకోజులు శరీరానికి అందిస్తూ వుండడం తప్పని సరి. ఎక్కువగా శ్రమపడినప్పుడు కొద్ది సేపు మాత్రమే తాత్కాలికంగా ఈ చక్రీయ చర్య మనలను కాపాడుతుంది.
కోరి చక్ర పరిశోధన ఫలితం మధుమేహ వ్యాధికి చికిత్సా విధానాలను అభివృద్ది చేయడానికి బాట వేసింది.
గ్రెట్ట్ థెరిసా కోరి జీవరాసాయన శాస్త్ర జ్ఞురాలిగా ప్రసిద్ది చెందింది. జర్మన్ యూనివర్సిటి ఆఫ్ ప్రాగ్ మెడికల్ స్కూల్ లో చేరగలిగిన అతికొద్ది మహిళలో గెట్టి ఒకతె . అక్కడ చేరిన తొలి సంవత్సరం లోనే ఆమె కర్ల్ కోరి ‘ని కలిసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే వారు వియన్నాకు చేరుకొని వివాహితులయ్యారు. కర్ల్ కి యూనివర్సిటి ఆఫ్ వియన్నా తన మెడికల్ క్లినిక్, ఫార్మకాలజి విభాగంలో పనిచేయడానికి అహ్వానించి నియమించుకొంది. గ్రెట్టి స్తీకావడంవల్ల ఆమెను కరొ లినెన్ శిశు ఆసుపత్రిలో సహాయకురాలిగా మాత్రమే నియమితురాలైంది. 1922 లో కర్ల్ కోరి బఫెలొ లో న్యూయార్క్ లోని స్టేట్ యూనివర్సిటి ఆఫ్ మలిగ్నెంట్ డిసీజ్ లో పనిచేయడానికై బయో కెమిస్ట్రి విభాగంలో పదవి లభీంచింది. ఈ సారి కూడా గెట్టి అసిసిస్టెంట్ పాథాలజిస్ట్ గా దిగువ స్థాయి స్థానమే పొందింది. తన భర్తతో సమానమైన డిగ్రీ , పరిశోధనా అనుభవమూ కలదైనప్పటికీ కర్గ్ కోరి కి లభించిన స్థాయి ఉద్యోగం పొందలేకపోయింది. ఆతరువాత మూడు సంవత్సరాలకు వారు ఇద్దరు కలసి ఒకే సమస్యపై పరిశోధన చేయనారంభించారు. ఆసంవత్సరాలలో ఆమెను అసిసిస్టెంట్ బయో కెమిష్ట్ గా నియమించారు.1928 లో యుఎస్ పౌరసత్వాన్ని పొందాక ఈ దంపతులు కణుతుల జీవ ప్రక్రియపై (metabolism of tumours). పరిశోధించారు. అటుపిమ్మట కార్పొ హైడ్రేట్ జీవక్రియపై దృష్టి సారించి కోరి చక్రాన్ని కనుగున్నారు. శరీరం కఠోర పరిశ్రమలో శక్తిని ఎలా పొందుతుందన్న విషయం వైజ్ఞానిక ప్రపంచానికి వీరి పరిశోధన వలనే తెలియ వచ్చింది. 1936లోవారు గ్లూకోజ్ -1 -ఫోస్పేట్ ను కనుగొన్నారు. ఇది గ్లూకోజ్ యొక్క ఉత్పన్నము. ఈ రసాయనరూపములోనే గ్లూకోజు కండరాలలో నిల్వ వుంటుంది. ఇది ఒకానొక చక్కర రూపము . దీనిని కోరి ఎస్టర్ అని పిలుస్తున్నాము. కోరి చక్రం లో ఇది చాలా ముఖ్యమైన చక్కర రూపము. కోరీలు పోస్తో వ్పర్యేస్ అనే ఎంజైమ్ ని కూడా గుర్తించారు. ఈ ఎంజైమ్ గ్లెకొజిన్ న్ని కోరి ఎస్టర్ గా మారడానికి దోహదపడుతుంది.
గెట్ట్ నైపుణ్యానికి గుర్తింపు రాగా 1938లో సైంట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ ఆమెని _ రీసెర్చ్ అసొసియేట్ గా నియమించింది. 1940లో అసోసియేట్ ప్రొఫసర్ ఆఫ్ రీసెర్చ్ గా నియమితురాలైంది.
ఎప్పుడైతే గ్రెట్టి కోరి తన భర్తతో కలసి నోబెల్ ని అందుకొన్నదో అప్పుడు దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఫలితంగా గ్రెట్టిని ప్రొఫసర్ ని చేసారు. కానీ దురదృష్ట వసాత్తూ ఆమెను ఎముక మజ్జ వ్యాధి (marrow disease) కృంగదీసి 1957, కాలేయం పూర్తి పని చేయడం మానేయడంతో కాలేయ వైఫల్యంతో (liver failure) మరణించింది.
దంపతులు కలసి పుచ్చుకొన్న చాలా _ పురస్కారాలున్నప్పటికీ , కొన్నిపురస్కారాల ప్రానాలలో ఆమెను మినహాయించారు. వారి పరిశోధనా కృషి మొత్తమూ కలసి నిర్వహించినదైనప్పటికీ కార్ల్ నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ కి ఎన్నుకో బడ్డాడు, కాని అదే సంవత్సరం ఆమెకు ఆ గౌరవంలభించలేదు . మరో ఎనిమిది సంవత్సరాలకి ఎన్నుకొన్నారు. Albert Lasker Award, Willard Gibbs Medal రెండూ కూడా క్రల్ ఒక్కడికే ప్రదానం చేసారు. అయితే గ్రెట్టి 1948 లో Garvan Medal ని అందుకొంది. ఇది రసాయన రంగంలో ప్రతిభకు స్త్రీలకు ఇచ్చే పతకము.
అదనపు సంప్రదింపులు : references for further reading
https://www.nobelprize.org/prizes/medicine/1947/summary
https://biologywise.com/brief-explanation-of-cori-cycle