డాక్టర్ చాగంటి కృష్ణ కుమారి
మథన పడ్డాడానాడు
వాటిమధ్య ఏదో క్రమత వుందని, అదేదో తెలియకున్నదని!
ఆనాటికి తెలుసున్నవవి అరవై మూడే!
ఒకానొక ఆవర్తనక్రమానికవి వొదిగి తీరుతాయనే
నమ్మకం మది!
ఎన్నో సంవత్సరాల పరిశోధన, పరిశీలన, ప్రయోగాలతో
తలమునకలవగా కలిగిన అంతర్జష్టి.
‘పేర్చాడు పేర్కాడు మూలకాల వివరాల కార్డు ముక్కలను
‘పేరుస్తునే వున్నాడు, పేషన్స్ పేక ముక్కల ఆటగాడిలా
నిలువు అడ్డు వరుసలలో, వాటి ద్రవ్య్వరాశుల, రసాయన
ప్రవర్తనాతీరుల ప్రాతిపదికగా
ఓపికతో, ఓర్మితో!
క్రమం తెలిసిరావటంలేదు,
ఆఆలోచనతోనే మూతపడ్డాయి కనులలసటతో
ముక్కలన్నీ క్రమ పద్దతిని ఒక పట్టికలో చేరుతూ
సుషుప్తిలొ పాక్షాత్కరించాయని,
చెపుతుంది ఓ కథ
మనకు తెలుసు-అంతర్జష్టి తో కనుగొనబడని
వాటికై ఖాళీలను వదిలిపెట్టిన అతని ఆవర్తన పట్టిక!
లోతైన శాస్త్రీయ అవగాహనా ఫలితమని!
ఆపట్టిక ఆధునికమై, నిండుగా విస్తృతావర్తన పట్టికై
విస్తృతి చెందుతున్నదింకనూ, శతాధిక మూలకాలతో
రసాయన పితామహా వీకు జేజేలు!
మెండలీవూనీకు జేజేలు —
ప్రకృతి సంభాషిస్తుంది, తపనతో శ్రమిస్తున్న పరిశోధకునితో
విఘూడ విక్కమ్ములను విశదీకరిస్తుంది
అత్యవసరంగా కొన్ని పదాలను సృజిస్తూ తన నూతన
అవగాహనను శాస్త్రవేత్త తెలియజెప్పే తరుణంలో
విజ్ఞానశాస్త్ర భాషలు వికశిస్తాయి, విస్తరిస్తాయి.
ఆభాషే వైజ్ఞానిక భాష,
అవును మెండలీవు తరువాత
ఈనాడెన్నెన్ని కొత్త పదాలు
బౌతిక, రసాయన శాస్త్రాలలో, మరిన్ని
శాభఖోపశాఖలలొ చేరాయో కదా!