గణనీయమైంది. ముఖ్యంగా
గురజాడవారి రచనల్లోస్త్రీపట్ల
మానవీయ అవగాహనతో
చేసిన పాత్ర చిత్రణలు కల
కాలం తెలుగుసాహిత్యంలో
మణిదీపాలుగా నిలిచి
పోయాయి. నేటికీ శ్రామిక
రంగంలో స్త్రీలకీ, పురుషులకీ
వేతనాల వ్యత్యాసం గమనిస్తే
ఆమెను ఎప్పుడూ రెండో
తరగతి పౌరురాలిగా పరిగణించటం చూడగలం. ‘మహిళలు ఉద్యోగాలు చేయటం మా
దయవల్లనే’ అనుకునే పురుష పుంగవులున్నారు. అది ఒక అదనపు భారంగా ఆమె ‘సూపర్
ఉమెన్’ గా మారటానికి తనదైన అభిరుచులు, ఆరోగ్యాన్ని ఎంత త్యాగం చేస్తుందో ఎవరికీ
పట్టదు.
స్త్రీల సాధికారతకు మన సమాజంలో కొన్నిమార్పులు జరగాలి. ఆడపని, మగపని అనే
విభజన మానేయాలి. అన్ని పన్లు అందరూ పంచుకొని చేయగలగాలి. స్త్రీకి గానీ పురుషుడికి
గానీ వాళ్ళ శరీరంపై వారికున్న సంపూర్ణ హక్కులు అనుభవించేటట్లు చట్టాలతో బాటు
అమలుతీరు ఉండాలి. స్త్రీ ఒక వ్యక్తి. ఆమెకి మెదడు, మనస్సు ఉంటుంది. ఆమె ఒక ఆస్తి,
వస్తువు కాదు. స్త్రీ పట్ల అత్యాచారాలు చేసేవారిని సమాజం వెలివేయాలి. చట్టం శిక్షించాలి.
మగపిల్లకి తల్లిని, అక్కచెల్లెళ్ళను, ఇతర స్త్రీలను గౌరవించే సంస్కారం ఇవ్వాలి.
స్త్రీని ‘అబల’ అంటుంటారు. మన పురాణాలన్నిటిలో స్త్రీని శక్తి స్వరూపిణిగా
అభివర్ణించారు. ఆమెను పూజిస్తూనే స్త్రీలపట్ల అమానుష అణచివేత ప్రదర్శించే మగ
పురుగులను ఏరివేయాలి. అమ్మ లేకపోతే అబ్బాయి లేడు కదా!
స్త్రీలు తమపై జరిగే అణచివేతను ప్రతిఘటించి, ఉన్నత విద్యావంతులై తమ
సాధికారతను ఇంటినుంచే ఆరంభించాలి. ఆమె సంపాదనపై అతని ఆధిపత్యాన్ని
అంగీకరించరాదు. కోట్లు సంపాదించే నటీమణులు, గాయనీమణులు భర్తవల్లనే నిర్జీవులు
కావటం ఎంత విషాదం! ఆమె బాల్యంనుంచే ఆత్మరక్షణ విద్యలు నేర్వాలి. స్త్రీకి సంప్రదాయ
మూఢవిశ్వాసాల వల్ల ఏర్పడిన పాత దురాచారాలు చాలావరకు తొలగిపోయినా సరికొత్త
సమస్యలు రూపం మార్చుకొని ఆమెను చుట్టుముట్టి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి.
భారతీయ మహిళ తన పూర్వ ప్రాభవజ్ఞానంతో ఆధునిక శాస్త్రీయ ధృక్పథంతో వ్యక్తిగా
నిలబడాలి. మహిళలు ఎదిగితేనే దేశాభివృద్ధిసుసాధ్యం. మహిళల పేరుతో మగవారికి
ఇచ్చే పథకాల దోపిడీని నివారించాలి. ముఖ్యంగా స్త్రీలు తమ శక్తిని తాము గుర్తించి
ధైర్యస్థైర్యాలతో నిలిచి సాధికారతను నిరూపించుకుంటూ తర్వాతి తరాలకు మార్గదర్శనం
చేయాలి. అప్పుడే ఆధునిక మహిళగా చరిత్రను తిరగరాయగలదు.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు