వనితా ప్రకాశిక
మహిళా సాధికారతను సాధించగల్గుతున్నామా?
– తొలి సంచిక
భారతదేశంలో దాదాపు సగం జనాభాగా ఉన్న 65
కోట్లమంది స్త్రీలు పలురంగాలలో ముందడుగు
వేస్తున్నా సంపూర్ణ సాధికారతను సాధించలేకపోతున్నారనేది
నూటికి నూరుపాళ్ళు నిజం. 15 ఏళ్ళ క్రితం ఒక జాతీయ
మహిళావిధానం రూపొందించటం జరిగింది. అయినా స్త్రీలకు
న్యాయం సుదూరంగానే ఉంటున్నది. పార్లమెంటులో 33
శాతం స్త్రీలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రవేశపెట్టిన బిల్లులు
ఇప్పటివరకు ఏ పరిస్థితిలో ఉన్నాయో మనకి తెలుసు. ఎన్నికల్లో
మహిళలకు రాజకీయపార్టీలు టికెట్లు ఇచ్చి గెలిపిస్తున్నా,
వాళ్ళు గెలిచాక, పదవులు చేపట్టాక పెత్తనం భర్తదో, కుమారుడిదో, మరిదిదో కావటం విచారకరం. దీనికి మహిళల ఆత్మన్యూనత, పురుషులపై ఆధారపడటం కూడా కొంత కారణంగా చెప్పవచ్చు. స్త్రీలు బాగా చదువుకున్నా, తమ పేరిట ఆస్తిపాస్తులున్నా, పురుషుల
అధీనంలో పనిచేయటం, స్వంత వ్యక్తిత్వాన్ని అణచివేసుకోవటం అనేక రంగాలలో
చూస్తున్నాం. ఉద్యోగినులుగా ఆర్థిక స్వాతంత్ర్యంగల స్త్రీలు కూడా తమ ఉద్యోగ విధులలో
భర్తల ప్రమేయాన్ని, వారి అవినీతిని నిరోధించలేక పోవటం గమనార్హం. రచయితలు,
గాయకులు, మొదలైన ఇతర సృజనాత్మక రంగాలలో, నిష్ణాతులయిన వాళ్ళ
సృజనరంగంలో ఎదుగుదలను పురుషులే శాసించటం, అదుపాజ్ఞలలో ఉంచటం, మనం
ఎందరో కళాకారిణుల జీవితాలను చూసి, చదివి తెలుసుకుంటున్నాం.
స్త్రీ పురుషులు ఇద్దరూ పరస్పర పూరకాలు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావం
ఉండటంవల్లేస్త్రీ సాధికారత నత్తనడక నడుస్తున్నది. ఇటీవల బాపుగారు దర్శకత్వం
వహించిన ఓ సినిమాలో ఆమె అతనికన్నా “తక్కువ సమానం”, అతడు ఆమెకన్నా “ఎక్కువ
సమానం” అనే డైలాగ్ వినిపించారు. సమానం అంటూనే ఎక్కువ తక్కువలు శాసించే
సాంప్రదాయిక మూఢ భావనల గురించి ఎన్నో శతాబ్దాలనుంచి పోరాటం జరుగుతూనే
ఉంది. మన దేశంలోని సనాతన మతఛాందసంలోంచి పుట్టిన అనేక మూఢవిశ్వాసాల
గురించి ఆనాడు స్త్రీలకంటే పురుషులే ఎక్కువ కృషి చేశారనిపిస్తుంది.
సతి, ఆడశిశు హత్యలు, వితంతువుల అధోగతి మానవత్వాన్ని మంటగలిపాయి.
ఆధునిక పాశ్చాత్యవిజ్ఞానం, సాహిత్యం, తత్వశాస్త్రాలను ప్రవేశపెట్టి ఆధునీకరణ ద్వారా
భారతీయులలోని వెనుకబాటుతనాన్ని రూపుమాపటంలో రచయితల పాత్ర