11.5 C
New York
Sunday, November 24, 2024

తెలుగు కోసం కొత్త కోణం

”తెలుగు కోసం కొత్త కోణం” అన్న విషయం మీద, భారతీయ రక్షకభట సేవల శాఖ(ఐ పి ఎస్)  – విశ్రాంత  ఉన్నతాధికారి శ్రీ వి వి లక్ష్మీనారాయణ గారు మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక పై, 08-07-2023 నాడు, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో ప్రసంగించారు.

వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ గారు ప్రస్తుతం తెలుగు భాష ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా తీసుకొని పోవడం మన చేతుల్లోనే ఉందని చక్కటి ఉదాహారణలతో  వివరించారు.  ఉద్యమం అనేది బయట ఎలుగెత్తి చాటడం కాదు. ఇంట గెలిచి రచ్చగెలవాలని  సూచించారు. మహాత్మగాంధీగారు భారతీయ సంస్కృతి మనకు గర్వకారణం అని అన్నారు.  అలాగే మనం మన తెలుగుభాష మనకు గర్వకారణం అని ముందుకు వెళ్ళాలి అని చెప్పారు.

కోర్టు తీర్పులు మాత్రమే తెలుగులో రావడం కాదు వాదనలు, వాజ్యాలు, దరఖాస్తులు, తెలుగులో రావాలి. ముందు న్యాయవాదుల్లో మార్పు రావాలని సుచించారు.

అన్నీ భాషలను కలుపుకొని సొంతం చేసుకొనే శక్తి ఒక్క తెలుగు భాషకే ఉందని చెప్పారు. అవి తెలుగు పదాలా లేదా ఇతర భాషలకు చెందిన పదాలా అని గుర్తు పట్టనేని విధంగా మన భాషలో కలగలసి పోయాయన్నారు.

ఉదా. దస్తావేజు, జిల్లా లాంతరు  లాంటి  పదాలు. మొ. అనేక దేశీయ పదాలు కలుస్తున్నాయని చెప్పారు.

తెలుగు భాష అజంతాభాష. అందుకే తనకు తెలుగుభాషంటే తనకెంతో గౌరవమని కొనియాడారు.

వినసొంపుగా  ఉండే బాష!

కవులు  సంగీత  బాష అని కూడా  అంటారని చెప్పారు. అక్షరాలను  సంగీతంలా  మార్చే శక్తి  ఒక్క తెలుగుకే  సొంతమని చెప్పారు. తెలుగుమాటలను పాటలుగా పాడే శక్తి ఒక్క తెలుగుకే ఉంది. వినసొంపైన భాష తెలుగు భాష. ఉదా. అన్నమాచార్య సంకీర్తనలు, త్యాగరాజు, రామదాసు సంకీర్తనలు.

అవధానం తెలుగు భాష ప్రత్యేకత!

ఎంతో ప్రసిద్ధిచెందిన అష్టావధాన ప్రక్రియ తెలుగులో మాత్రమే  ఉందన్నారు. ఎటువంటి వాక్యాన్నైనా అర్థం మార్చగల శక్తి అవధానం లో ఉందని

  1. ఉదా. కప్పను చూసి పాము గజగజ వణికెను.

ఉదా. వెంగప్పను చూసి పాను గజగజ వణికెను

  1. ఉదా. దారములేని హారము

ఉదా. మందారములేని హారము

ఇటువంటి  సృజనాత్మక శక్తి తెలుగుభాషలో ఉంది.

ఏ  భాష లోను  లేని  ప్రక్రియలు  తెలుగుభాషలో  ఉన్నాయి

చమత్కారాలు నానార్థాలు, పర్యాయ పదాలు కోకొల్లలు గా ఉన్నాయన్నారు. శతకాలతో పాటు హైకులు, నానీలు, పేరడీలు, మొ. ఏ  భాష లోను  లేని  ప్రక్రియలు  తెలుగుభాషలోఉన్నాయన్నారు.

ముందు మనలో మార్పురావాలి!

ఈ భాష గొప్పతనాన్ని ముందు మనం తెలుసుకోవాలి అప్పుడే ప్రస్పుటంగా దానిగురించి మన ముందు తరాలకు చెప్పగలుగుతాం. మొక్కై వంగనిదే మానై వంగదు అందుకనే వారికి చిన్నతనంనుండే  మన బిడ్డలకు నాలుక తిరిగే విధంగా తెలుగు పద్యాలను నేర్పించాలన్నారు.  వీటి ద్వారా ఎన్నో  పౌరాణిక, ఇతిహాసాలు, చారిత్రక   ఇలా  ఎన్నో  నేర్చుకోవచ్చు అనిచెప్పారు. వీటిలో మన సంస్కృతి దాగి ఉందని తెలియజేశారు. తెలుగులో  రామాయణం, మహాభారతం, బాగవతంలాంటి  కథలు చదివితే   మనశరీరానికి కావలిసిన  మల్టీవిటమిన్ దొరుకుతుంది  అన్నారు.

ఉదా. భూమి దున్నతుంటే ఆడపిల్లలు పుడుతారంట కదా మీదేశాన అని రాముడు సీతను చమత్కారంగా అంటే,  దానికి సమాధానంగా మీదేశాన పరమాన్నం తింటే మగపిల్లలు పుడుతారంటకదా! అని గడుసుగా సీత సమాధానం చెబుతుంది.

అలాగే   అల్లసాని  పెద్దన్న  గారు  తాను  తెలుగును  వత్తులు  లేకుండా  మాట్లాడతాను  అంటే  దానికి తెనాలి  రామకృష్ణ   హాస్యంగా  మాట్లాడారు  అని చెప్పారు. తెలుగు బాష  తెలుగువా’డికి  , తెలుగు నాడికి  అంకితమిస్తున్నాను అన్నారు. నానార్దాలు  , అంటే  ఒక  పదానికి అనేక  అర్దాలు  వచ్చేబాష  తెలుగు బాష  అని  అన్నారు. సంస్కృతంలో  ఉన్నట్టే    తెలుగులో  కూడా అక్షరాలు, గుణింతాలు  ఎక్కువగా  ఉండి   అందంగా  ఉంటాయి. పలకడానికి , వినడానికి  ఎంతో  మధురంగా ఉంటుంది  తెలుగు బాష  అని చెప్పారు.  తెలుగువారు   ఏ భాషలోని   కఠిన  పదాలను అయినా  సులభంగా , స్పష్టంగా  పలుక గలరు  అందుకే తనకు   తెలుగు బాష  అంటే  గౌరవం  అని చెప్పారు.

మన  తెలుగుజాతి  సమాజంలో  ఏవిదంగా  నడుచు  కోవాలి  అని   బద్దెన గారు  పద్యరూపంలో  చెప్పారు. వేమన  సోమన  లాంటివారు  కూడా  తేలిక పదాలతో  పద్యాలు  రాసారు  అని చెప్పారు.  మన తెలుగులో  తప్పు చేసినప్పుడు తల్లి కొట్టవచ్చు, గురువు  శిక్షించవచ్చు  అని   తెలియ చేసే  పద్యాలున్నాయని   అందుకే  తెలుగు బాష  అంటే  తనకు  ఎంతో  గౌరవం  అని  చెప్పారు.

తెలుగుభాషలో హాస్యం అనేది అణువణువునా  కన్పింస్తుంది.

బారీష్టర్  పార్వతీశం లాంటి  వారి  కధలు  చదివితే   ఆరోగ్యాన్ని  పెంచే    హాస్యం  ఎంతో  ఉందని  చెప్పారు.

వ్యక్తిత్వవికాసం మన జానపద కథల్లోనే ఉందని చెప్పారు!

మన పిల్లల్లో వ్యక్తిత్వ వికాశం పెంపొందించేందుకు ప్రత్యేకమైన ఆంగ్ల శిక్షణా తరగతులు  అవసరం లేదన్నారు. మన పెద్దవాళ్ళు చెప్పే కథల్లోనే ఎన్నో మానవత్వపు విలువలు దాగి ఉన్నాయని అన్నారు.

ఉదా. కాకి బావ- నక్క బావ కథ పొగడ్తలకు పడిపోకోడదని దానిలోని సారమని చెప్పారు.

ఇంటిల్లిపాది చదవాలి!

తెగిపోతున్న కుటుంబ బంధాలు తెలుగు భాషవల్ల కలుపుకొని పోవాలన్నారు. అమ్మమ్మలు, నాన్మమ్మలు , అత్తలు, కథలు చెప్పాలని సూచించారు.  తల్లులు  చందమామ లాంటి  పుస్తకాలలోని  కధలను  పిల్లలకు కథలు చెప్పాలి. వారితో చందమామ కథలను  చదివించాలి.  వారితోపాటు మనంకూడా కూర్చోని చదవాలి.  చిన్నప్పటినుండే  తెలుగు  పట్ల  అభిమానం  కలిగేట్టు  చేయాలని  చెప్పారు. కలసిమెలసి అందరూ ప్రయాణించాలి. అందరినీ కలుపుకొని పోవాలన్నారు. అప్పుడు దానంతట అదే ఆనందం వెల్లి విరిస్తుంది. తెలుగు వికాశం చెందుతుందని చెప్పారు.  అలాగే అన్ని భాషలలోని కథలను తెలుగుభాషలోనికి అనువదించ వలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

తెలుగుభాషలో ఎన్నో ప్రక్రియలు

వారు మాట్లాడుతూ తెలుగు ఎంతో గొప్ప భాష అని పదాలు, పదజాల తో ఎంతో మధురమైన పద్యాలు ఒక్క తెలుగు భాషకే సొంతం అని అన్నారు.  ఎన్నో నుడికారాలు, సామెతలతో పద్య,గద్యలతో ఎంతో మధుమైన భాష నా తెలుగు భాష అని అన్నారు . అలాగే తెలుగులో ఎన్నో లఘుప్రక్రియలైన నానీలు, హైకులు, రుబాయి ల వంటి రకరకాల ప్రక్రియలు  ఉన్నాయి. లఘుకవితలు, వచన కవితల ద్వారా తెలుగు అందం తెలుస్తుంది అని అన్నారు.  

తెలుగు భాషలో హాస్యం అణువనువునా దాగి ఉంది!

తెలుగు  భాషలో  పేరడీ  సాహిత్యం  ఉందని తెలియజేశారు ఉదా. జొన్న విత్తులగారు  పేరడి  సాహిత్యనికి ఎంతో  కృషి  చేస్తున్నారు  అని  చెప్పారు.

ఇలా మన  భాషలో  ఎన్నో వున్నాయి  నేర్చుకోవాడానికి,  మనకి  ‘బోర్’ కొట్టడం  అనేది  ఉండదు.  బోర్ కొడితే  నీళ్లు  ఎలా  వూరుతాయో  అలాగే  మనభాషలో   ఎన్నో  పదాలు, కవితలు, పద్యాలు వూరుతుంటాయి  అని చెప్పారు.

సాహిత్యం  ద్వారా  సమాజంలో మార్పు !

చట్టాల కన్నా తెలుగు భాషలో వచ్చిన పద్యాలు ఎంతో మార్పు వస్తుంది అని చెప్పారు.

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లాంటి  కథల ద్వారా  సమాజంలో  బాల్యవివాహలు  రూపుమాసి పోయిందని. ఒక చిన్న పద్యం  ద్వారా సమాజంలో మార్పు తీసుకొనిరావడానికి  ఒక చిన్నపద్యం చాలు. గరిమెల్ల సత్యనారాయణ గారు రాసినటువంటి “మాకొద్దు  ఈ తెల్ల దొరతనం” లో

హిందువులు లేత లేగదూడలై ఏడ్చుచుండ

తెల్లవారను గడుసరి గొల్లవాడు

పితుకుతున్నారు మూతులు బిగియబెట్టి

అలాగే శేషంద్ర శర్మ గారు  తెలుగు బాష  ద్వారా  సమాజంలో  చాలా  మార్పు  తెచ్చారాని  చెప్పారు. సామాజిక సేవతో పాటు అందరం భాషసేవను చెయ్యాలని పిలుపునిచ్చారు.

తెలుగుభాషలో  వత్తులు  మారితే  పదాలు , వాటి  అర్ధాలే  మారిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.

  1. ఉదా : దా అంటే  భార్య

 ధా అంటే  ధారగాపోయడం,  (నీటి ధార లాగ)

  • ఉదా. భావజాలం

        బావజాలం

 ఎన్ని భాషలు నేర్చిన మాతృభాష లో విద్య అర్థవంతంగా ఉంటుంది!

జ్ఞానసమపార్జనకు మాతృభాష మూలం అంటూ నేటి యువత ఆంగ్లం తో పాటు తెలుగు మీద మక్కువ పెంచుకొని తెలుగులోనే రాయడం,చదవడం వంటివి చేయాలి. మాతృభాషపై పట్టు ఉంటే  ఇతర భాషలైనా సులభంగా నేర్చుకోవచ్చని. అందుకు ఉదాహరణ తానేనని చెప్పారు. తనకు మాతృభాషపై పట్టు ఉండటం మూలంగానే  ఆంగ్లం, హిందీ, మరాఠీ, తదితర భాషలలో పట్టు ఏర్పడిందని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలుగుకు సంబందించి ఒక అధికారి ఉండేలా చూడాలని ప్రభుత్వం తెలుగు లోనే అన్ని సందేశాలు పంపేవిధంగా చర్యలు తీసుకోవాలని చూచించారు.

ముగింపు

ఇన్ని  విధాలు  కలిగిన  తెలుగు  మాతృ బాషను  జాగ్రత్తగా  కాపాడు కోవాలని  అన్నారు. తెలుగును  ఉద్యమంగా వతీసుకొని రావలిసిన  అవసరం  లేదని,  తెలుగును  సాహిత్యం  ద్వారా  ప్రజల్లో మార్పు తీసుకురావచ్చని,  ఇలా   సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తీసుకొని రావచ్చని  చెప్పారు.  ముందు ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నారు V. V. లక్ష్మి నారాయణ గారు  తెలుగుబాషను   ఎందుకు  గౌరవిస్తానో అని  వివరంగా, చక్కగా  తన  ప్రసంగంలో  చెప్పారు. మనతో కలసి అమ్మ జీవితంలో ఎలా తోడు ఉంటుందో మనజీవితంతో పెనవేసుకొనిపోయేది మాతృభాష. ప్రపంచంలోని 800కోట్ల మందిని కదిలించే సామర్థ్యం ఒక్క తెలుగు భాషకే ఉందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స నుండి ప్రపంచ భాషలందు తెలుగులెస్సగా మనం తీసుకొని పోవాలి.

ఈ కార్యక్రమం లో తెలుగు భాషా ఉద్యమ కర్త శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారు మాట్లాడుతూ తెలుగుభాష  గొప్పతనాన్ని చాటేవిధంగా కవితలు రాయడానికి పిలుపునిచ్చారు. అందుకు నగదు బహుమతి కూడా ఉంటదని తెలియజేశారు.  వివిధ ప్రాంతాలలోని కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొనడం జరిగింది.



5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles