కలిగి ఉంటుంది. దీన్నే ముక్తకం అంటారు.
అంటే శతకంలో ప్రత్యేకంగా ఒక కథ, వస్త్వైక్యo
వంటివి ఉండవు. సాధారణంగా శృంగార నీతి
వైరాగ్య భక్తి వ్యంగ్య ప్రధానాలుగా ఉంటాయి
శతకాలు. ఈ అంశాలే ప్రధానమైనా సమాజానికి
ఒక చక్కటి సందేశాన్ని ఇస్తాయి. అలాగే పద్య
నిర్మాణంలోనూ వ్యక్తీకరణలోనూ
కవిత్వలక్షణాలను ప్రోదిచేసుకుని ఉంటాయి.
పోతన నారాయణ శతకం, తాళ్ళపాక
తిరుమలాచార్యుల శతకం, దాశరథి శతకం,
భర్తృహరి మూలానికి అనువాదమైన ఏనుగు
లక్ష్మణకవి శతకం, భాస్కర శతకం,
నరసింహశతకం ఇలా ఎన్నెన్నో శతకాలు ప్రసిద్ధం కాగా వీటిలో భాష కొంత ప్రౌఢంగా
ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆధునికులకూ తేలిక పదాలతో అన్వయక్లిష్టాలు కాకుండా
ఉన్నవి వేమనశతకం, సుమతీశతకం, కుమారీ కుమారా శతకాలు సుబోధకంగా
ఉన్నాయి. వీటి ప్రభావముతోనే ఈ కాలంలో అనేకులు వర్ధిష్ణువులు ఆటవెలది అనే
ఛందస్సును ఎంచుకుని శతకాలపేరుతో వ్రాస్తున్నారు. శతకాలలో ఉన్న వెసులుబాటును
వారు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొందరైతే పూర్వపు శతకాల్లో ఉన్న
కవిత్వమర్మాలూ వ్యక్తీకరణలోని అందాలూ పద్యనిర్మాణ దక్షతలూ అలంకారాదుల
తాపడాలూ అలవరచుకుంటున్నట్టు కనిపించదు. పైగా చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ
చెప్తూ అమూల్యమైన శతక సాహిత్య సౌరభాలను పలుచన చేస్తున్నట్లు తోస్తుంది.
సరే ప్రస్తుతానికి వద్దాం. తెలుగు సాహిత్యంలో శతకాలు ఎలా సాహిత్య విలువలను
సంతరించుకొన్నాయో స్పృశించుకుని ముగిద్దాం.
వేమన శతకంలోని
ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
అన్న పద్యం ఒక్కటి తీసుకుంటే ఇందులో ఇందులో రుచి అన్న పదానికి కాంతి తినే
రుచి అనే శ్లేష, కప్పురం అంటే పచ్చకర్పూరం (హారతికర్పూరం తినం రుచిచూడం కదా!)
అనీ గ్రహిస్తే ఈ చిన్న పద్యంలో ఎంత అందం ఉన్నదో సరసహృదయులు ఆనందిస్తారు.
పుణ్యపురుషుల పచ్చకర్పూరపు పోలిక ఎంతో రంజింపచేస్తుంది.