– డా. బాలాజీ దీక్షితులు పి.వి 8885391722
నా తలపులు
నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి
రేయినకా
పగలనకా
నీవు ప్రకృతిలా
వయ్యారం ఆవిష్కరిస్తూ
సుగంధ లేపనాన్ని
అద్దతుంటే
ఆ జ్ఞాపకాల వర్షం
నిలువెల్లా తడిపేస్తుంది
ప్రేమ కేళిలా
రస రంగులు చల్లుతుంది
రాధికాన్యాసం
నీలో నేను
ఉండిపోవాలనుకొనే
కృష్ణుణిడిలా
మురళీ జాతర చేసుకుంటున్నా